Sweating and Weight lose: చెమటలు అధికంగా పడితే బరువు తగ్గుతారా? ఇదెంత వరకు నిజం?
Sweating and Weight lose: కొంతమందికి చెమట అధికంగా పడుతుంది. ఇలా చెమట పడితే వారు బరువును తగ్గుతారా? ఇది నిజమో కాదో నిపుణులు వివరిస్తున్నారు.
మనుషులకు చెమట పట్టడం సాధారణ విషయం. వాతావరణం వేడెక్కినా, ఏదైనా శారీరక శ్రమ చేసినా, జిమ్ లో వర్కవుట్ చేసినా చెమటలు పడతాయి. ఇలా చెమటలు పట్టడం వల్ల శరీర బరువు తగ్గుతుందనే వాదన ఉంది. శరీరం నుంచి ఎంత ఎక్కువ చెమట ప్రవహిస్తే అంత త్వరగా బరువు తగ్గుతారని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ విషయంలో ఎంత వరకు నిజమవుందో తెలుసుకోవాలంటే ముందుగా చెమటులు ఎందుకు పడతాయో తెలుసుకోవాలి.
ఎందుకు చెమటలు పడతాయి?
చెమట వల్ల బరువు తగ్గుతుందో లేదో తెలుసుకోవడానికి ముందు, చెమట ఎందుకు పడుతుందో తెలుసుకోవాలి. మన శరీర ఉష్ణోగ్రత పెరిగినప్పుడు శరీరంలోని చెమట గ్రంథులు చురుకుగా పనిచేయడం వల్ల చెమట బయటకు వస్తుంది. శరీరం చెమట ద్వారా దాని ఉష్ణోగ్రతను నియంత్రించుకుంటుంది. శరీరం నుండి చెమట బయటకు వస్తే, శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఎండాకాలంలో, వ్యాయామం లేదా ఏదైనా శారీరక శ్రమ చేసేటప్పుడు, శరీర ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుంది. దీని వల్ల చెమట పట్టడం కూడా పెరుగుతుంది.
చెమట బరువు తగ్గడానికి కారణమవుతుందా?
చెమటలు పట్టడం వల్ల శరీరం బరువు తగ్గుతుందనే నమ్మకం ప్రజల్లో ఉంది, కానీ అది పూర్తిగా తప్పు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, చెమట శరీరంలో కేలరీలను బర్న్ చేస్తుంది. కానీ బరువు తగ్గడానికీ, చెమట పట్టడానికీ ఎటువంటి సంబంధం లేదు. జిమ్ లో వ్యాయామం చేయడం, సైక్లింగ్ చేయడం లేదా మరేదైనా శారీరక శ్రమ చేయడం వల్ల కేలరీలు మాత్రమే ఖర్చవుతాయి. ఇది అదనపు బరువును పెంచదు, కొవ్వును కరిగించదు. అంటే బరువు తగ్గించదు అని అర్థం.
చెమట వల్ల కలిగే ప్రయోజనాలు
శరీరానికి చెమట పట్టడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది బరువు తగ్గడానికి కారణం కాదు, కానీ ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. నిజానికి చెమట వల్ల శరీరంలోని రంధ్రాల ద్వారా అంతర్గత టాక్సిన్స్ బయటకు వస్తాయి. శరీరంపై పేరుకుపోయిన మురికి కూడా చెమట ద్వారా విడుదలవుతుంది. దీనివల్ల చర్మం మెరిసిపోతుంది. బాడీ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. అధిక వేడికి, శారీరక శ్రమ వల్ల లేదా వ్యాయామం వల్ల కూడా కొంతమందికి శరీరం నుండి చెమట పట్టద్దు. అది ఏదో ఒక అంతర్గత వ్యాధికి సంకేతం అని ఆరోగ్య నిపుణులు నమ్ముతారు.
2016లో 'జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన నివేదక చెబుతున్న ప్రకారం చెమట పట్టడం వల్ల చర్మం pH స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. ఇది చర్మంలో బ్యాక్టిరియా పెరుగుదలను అడ్డుకుంటుంది. చెమట పట్టకపోతే ఆనందించకండి... చెమట పట్టకపోవడం ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.
చెమట పట్టడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు చేరవు. ఎందుకంటే చెమట ద్వారా అధిక సోడియం ఉంటే అది బయటికి పోతుంది. దీనివల్ల ఎముకలకు కావాల్సినంత కాల్షియం లభిస్తుంది. సోడియం ఎక్కువైపోతే కాల్షియాన్ని శోషించుకోవడం శరీరం తగ్గిస్తుంది. అందుకే చెమట పట్టడం ద్వారా సోడియాన్ని వదిలించుకోవాలి.