Lions Attack : సఫారీ వాహనంలో వెళ్లే మనుషులపై సింహాలు ఎందుకు దాడి చేయవు?-why dont lions attack on people in a safari vehicle know clear details ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lions Attack : సఫారీ వాహనంలో వెళ్లే మనుషులపై సింహాలు ఎందుకు దాడి చేయవు?

Lions Attack : సఫారీ వాహనంలో వెళ్లే మనుషులపై సింహాలు ఎందుకు దాడి చేయవు?

Anand Sai HT Telugu
Jun 25, 2024 09:30 AM IST

Safari Vehicle : సింహాలను చూసేందుకు సఫారీ వాహనాల్లో టూరిస్టులు వెళ్తుంటారు. అవి దగ్గర నుంచి వెళ్లినా ఏమీ అనవు. అయితే దీనికి కొన్ని రకాల కారణాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం..

సఫారీ వాహనాలపై సింహాలు ఎందుకు దాడి చేయవు
సఫారీ వాహనాలపై సింహాలు ఎందుకు దాడి చేయవు (Unsplash)

సఫారీ వాహనాలపై సింహాలు ఎందుకు దాడి చేయవు? మనల్ని ఈ ఒక్క విషయం ఆశ్చర్యపరుస్తుంది. అడవిలో సఫారీలో వెళ్తున్నప్పుడు చుట్టూ సింహాలు ఉంటాయి. కానీ రైడింగ్ వాహనాలపై దాడి చేయవు. ఎందుకొ మీకు తెలుసా? వేటాడి ఆహారం తినే సింహాలు వాహనాలపై ఎందుకు దాడి చేయవని ఎప్పుడైనా ఆలోచించారా? వాహనాల్లో మనం ఎంత సురక్షితంగా వెళ్తున్నా.. అడవి జంతువులు ఎలాంటి పరిస్థితుల్లో ఎలా ప్రవర్తిస్తాయో తెలియదు. అయితే చాలా వరకు సింహాలు మాత్రం సఫారీ వాహనాల మీద దాడి చేయవు. ఎక్కడో ఒక దగ్గర దాడి జరిగినట్టుగా అప్పుడప్పుడు వార్తలు వస్తుంటాయి.

వాటి మనుగడపైనే దృష్టి

అడవిలోని చాలా జంతువులు సహజంగా మనుషులపై దాడి చేయవు. ఎందుకంటే జంతువులు ఎల్లప్పుడూ తమ ప్రధాన ప్రాథమిక ప్రవృత్తిగా మనుగడపై దృష్టి పెడతాయి. ఆహారాన్ని కనుగొనడం, వాటి ఆవాసాలను రక్షించడం, వాటి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడంపై మాత్రమే జంతువులు దృష్టి పెడుతాయి. అవి మనుషులపై దాడి చేయవు. అనేక అడవి జంతువులు మనిషికి దూరంగా ఉండేందుకే ఇష్టపడతాయి. మనం వాటిని ఏదైనా అంటే మాత్రం మీదకు వచ్చేస్తాయి.

సఫారీలపై దాడి చేయవు

చాలా అడవుల్లో, జూ పార్కుల్లో ఎదురుగా రోజూ అనేక వాహనాలు వచ్చి వెళ్తుండడం సింహాలకు అలవాటు. సింహాలు వాహనాలు నడపడం ముప్పుగా చూడవు. మానవుల నుండి ఎటువంటి హాని జరగనప్పుడు దాడి చేయాలి అనుకోవు. దీనికి అంతకుముందు వాటికి జరిగిన అనుభావాలే కారణం. అలాగే రైడ్ డ్రైవర్, జంతు సంరక్షకులు మీ వెంట ఉంటారు. జంతువులు వాహనంలోని ప్రతి ఒక్కరినీ ఒక్కొక్కటిగా విడిగా చూడవు. రైడింగ్ వాహనాలపై సింహాలు దాడి చేయకపోవడానికి ఇది కూడా ఓ కారణమే. ఎందుకంటే పులి, సింహాం ఏదైనా ఒక్క విషయాన్ని మాత్రమే టార్గెట్ చేస్తాయి. ఎంత గుంపుగా ఉన్నా.. ఒక్క జంతువు మీదే దాడి చేస్తాయి. అయితే మీరు అడవి జంతువుల దగ్గరకు వెళ్తున్నప్పుడు కొన్ని ప్రాథమిక నియమాలను పాటించడం చాలా ముఖ్యం.

మెుదట్లో దూకుడుగా ఉంటాయి

జంతువులను చూసేందుకు అరణ్యంలోకి వెళ్తుంటాం. అక్కడ జంతువులు సాధారణంగా దూకుడుగా ఉండవు. పర్యాటకుల కోసం వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటారు ఆఫీసర్లు. ఈ రైడ్‌ను ప్రారంభించే ముందు జంతువుల ప్రవర్తనను పర్యవేక్షించడం జరుగుతుంది. వాటికి దగ్గరగా వాహనాలు నడుపుతూ సింహాల ప్రవర్తనను పర్యవేక్షిస్తారు. జంతువులు అభయారణ్యంలోకి కొత్తగా వచ్చినప్పుడు మొదటిసారిగా దూకుడుగా ఉంటాయి. కానీ నిర్ణీత వ్యవధి తర్వాత రైడ్ వాహనాలకు, అందులో ప్రయాణించే వ్యక్తులకు అలవాటు పడిపోతాయి. ఇదంతా వాటికి అనుభవంతోనే వస్తుంది. ఆ తర్వాత ఆ జంతువులు స్వారీ చేసే వాహనాలను, వాటిలోని మనుషులను ఆహారంగా చూడవు. అందువల్ల జంతువులు రైడింగ్ వాహనాలపై దాడి చేయవు.

మనుషులను ఎరగా చూడవు

సింహాలు సాధారణంగా మనుషులను ఎరగా చూడవు. కానీ మనిషి ఒంటరిగా నడిచినా, పరిగెత్తినా సింహాల దాడికి గురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మనిషి నిలుచుంటే ఏదో వింత జంతువు అని భయపడతాయి. కింద కూర్చుంటే.. నాలుగు కాళ్ల జంతువు అనుకుని దాడి చేసే అవకాశం ఉంది. మనం సఫారీలో వెళ్లినప్పుడు వాటికి గాయాలు చేస్తే.. కోపంతో ప్రవర్తించే అవకాశం ఉంది.

వాహనాలంటే భయం

రైడ్-ఆన్ వాహనాలు ఎల్లప్పుడూ పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. 4 చక్రాల జీప్‌లు ఎల్లప్పుడూ సింహాలకు పెద్ద ముప్పుగా అనుకుంటాయి. చూసేందుకు భారీ పరిమాణంలో ఉండే జీప్‌లతో పోరాడలేం అనే భావన సింహాల్లో ఉంటుంది. ఎందుకంటే రైడింగ్ వాహనాలు సింహాల కంటే పెద్దవి. సింహాలు వాహనాలు నడపడం ముప్పుగా చూస్తాయి. కొన్ని సమయాల్లోనే వాహనం మీదకు వస్తాయి.

గైడ్ చెప్పేది వినాలి

ప్రయాణికుల వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మీరు గైడ్‌ చెప్పేది వినాలి. గైడ్ మార్గదర్శకాలను పాటించడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు నిశ్శబ్దంగా ఉండమని చెబుతారు. నిలబడకూడదు వంటి ఆదేశాలు జారీ చేయవచ్చు, దాని ప్రకారం అనుసరించాలి. మీ చర్యలు జంతువులకు భంగం కలిగించకూడదు లేదా వాటి సాధారణ ప్రవర్తనకు అంతరాయం కలిగించకూడదు. గైడ్ ఇలాంటి విషయాలు చెప్పినప్పుడు వినడం ముఖ్యం.

కొన్ని సఫారీ ప్రాంతాల్లోని సింహాలు వాహనాల ఉనికికి అలవాటుపడి ఉండవచ్చు. వాహనాలు తమకు ముప్పు కలిగించవని అనుభవం ద్వారా తెలుసుకుని ఉండవచ్చు. వాహనాల లోపల మనుషులు వింతగా అనిపించి.. భయంతో దాడి చేసే అవకాశం తక్కువగా ఉండవచ్చు. ఇలా రకరకాల కారణాలతో సింహాలు సఫారీల మీద దాడి చేయవని చెబుతారు.

జాగ్రత్తలు పాటించాలి

అడవి జంతువుల మధ్య ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దిగవద్దు. వాహనం లోపల ఉండాలి. జంతువుల కార్యకలాపాలకు భంగం కలిగించవద్దు. జంతువులతో ఆడకూడదు. పెద్ద శబ్దాలు చేయడం, చప్పట్లు కొట్టడం, జంతువులపై వస్తువులను విసరడం మానుకోండి. వాహనం వెలుపల మీ చేతులు, కాళ్ళను ఎప్పుడూ పెట్టకండి. ఏ కారణం చేతనైనా వాటిని తాకడానికి ప్రయత్నించవద్దు.

WhatsApp channel