Solar Eclipse Effect : జంతువులు, పక్షులు, తేనెటీగలపై సూర్యగ్రహణ ప్రభావం.. ఇంట్రస్టింగ్ సమాచారం-solar eclipse effect on animals birds and bees know interesting information ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Solar Eclipse Effect : జంతువులు, పక్షులు, తేనెటీగలపై సూర్యగ్రహణ ప్రభావం.. ఇంట్రస్టింగ్ సమాచారం

Solar Eclipse Effect : జంతువులు, పక్షులు, తేనెటీగలపై సూర్యగ్రహణ ప్రభావం.. ఇంట్రస్టింగ్ సమాచారం

Anand Sai HT Telugu
Mar 31, 2024 06:20 PM IST

Solar Eclipse Effect : గ్రహణం పడే సమయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే మానవులపైనే కాదు.. జంతువులు, పక్షుల మీద కూడా గ్రహణం ప్రభావం ఉంటుంది. కొన్ని రోజుల్లో సూర్యగ్రహణం రానుంది. వాటిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం..

సూర్యగ్రహణ ప్రభావం
సూర్యగ్రహణ ప్రభావం (Unsplash)

ఈ ఏడాది ఏప్రిల్ 8న సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈలోగా గ్రహణంపై అప్రమత్తంగా ఉండాలని అమెరికా శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఆ రోజు గ్రహణాన్ని చూసేందుకు ఎక్కువ దూరం ప్రయాణించవద్దని, డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎందుకంటే ఈ గ్రహణం సమయంలో ప్రమాదాల సంఖ్య పెరిగింది. అంతకుముందు గ్రహణ కాలంలో ప్రమాదాల సంఖ్య పెరిగినందున ఈ హెచ్చరిక జారీ చేశారు. గ్రహణ సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయంలో నియమాలున్నాయి.

హిందూ సంప్రదాయం ప్రకారం గ్రహణం అత్యంత అశుభకరమైన సమయం. భారతదేశంలో గ్రహణం సమయంలో ఎవరూ బయటకు రాకూడదనే నియమం ఉంది. గ్రహణ సమయంలో బయటకు వస్తే రకరకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పెద్దలు చెబుతుంటారు.

గ్రహణం మానవులపైనే కాకుండా జంతువులపై కూడా ప్రభావం చూపుతుందని నిరూపితమైంది. గ్రహణ సమయంలో జంతువులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. ఓ నివేదిక ప్రకారం ఈ సంవత్సరం సంపూర్ణ గ్రహణం ఎక్కువ కాలం ఉంటుంది. ఆకాశం చీకటిగా మారుతుంది.

పక్షులు, గబ్బిలాలు, కీటకాల కదలికలపై పగటిపూట చీకటి ప్రభావంతో ఏమి జరుగుతుందో కార్నెల్ విశ్వవిద్యాలయం పరిశోధకులు కనుగొన్నారు. రెక్కలున్న జీవులు కాంతిలో మార్పులకు మరింత అనుగుణంగా ఉంటాయి. ఎందుకంటే పక్షులు పగటిపూట వలసపోతాయి. కానీ ఆకస్మిక సంపూర్ణ సూర్యగ్రహణం చీకటిని తెస్తుంది. వాటి వలస ప్రక్రియను ప్రభావితం చేస్తుంది.

సంవత్సరాలుగా శాస్త్రవేత్తలు గ్రహణ సమయంలో జంతువుల ప్రవర్తనను పరిశీలించారు. టెక్సాస్‌లోని ఫోర్ట్ వర్త్ జూలో ఏప్రిల్ 8న అకస్మాత్తుగా బ్లాక్‌అవుట్ సమయంలో జంతువులు ఎలా విభిన్నంగా ప్రవర్తిస్తాయో అర్థం చేసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనికి ముందు 2017లో సౌత్ కరోలినా జూలో జంతువుల వింత ప్రవర్తన కనుగొన్నారు. జంతువులు కూడా వింతగా అరుపులు వేసే పరిస్థితిని గ్రహణ సమయంలో ఉంటుందట. వాటి నివాస ప్రదేశం, గూళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి ఉంటుంది.

కొలంబియాలోని సౌత్ కరోలినా రివర్‌బ్యాంక్స్ జూలోని శాస్త్రవేత్తలు గ్రహణం సమయంలో సంతానోత్పత్తిలో నిమగ్నమైన తాబేళ్లను కనుగొన్నారు. అయితే వాటి ప్రవర్తనకు గల కారణాలు తెలియరాలేదు. మగ జిరాఫీలు జూలో పరుగులు తీయడం ప్రారంభించాయి. సైబీరియన్ కోతులు గ్రహణ సమయంలో అన్నీ కలిసి ఆందోళనగా ఉన్నాయని తేలింది. ఇతర జంతువులు అరుస్తాయని పరిశోధకులు కనుగొన్నారు.

పరిశోధన ప్రకారం సూర్యగ్రహణం సమయంలో తేనెటీగలు పనిచేయడం మానేస్తాయి. 2017 సూర్యగ్రహణం సమయంలో తేనెటీగ పరాగ సంపర్కాల ప్రవర్తనను పరిశోధించారు. ఈ గ్రహణం సమయంలో తేనెటీగలు వాటి పనిని పూర్తిగా ఆపివేస్తాయి. అంటే తేనె కోసం పువ్వుల మీదకు వెళ్లవు. అన్ని ఒకే దగ్గర చేరి ఉంటాయని కనుగొన్నారు.

WhatsApp channel

టాపిక్