ATM PIN : ఏటీఎం పిన్‌లో 4 అంకెలే ఎందుకు ఉంటాయి? దీని వెనక స్టోరీ చదవండి
ATM Pin Story : ఈ కాలంలో ఏటీఎం లేని వ్యక్తి ఉండడేమో. బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఏటీఎం వాడుతున్నారు. అయితే ఏటీఎంకు నాలుగు అంకెల పిన్ మాత్రమే ఎందుకు ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా?
ఒకప్పుడు బ్యాంకు నుంచి డబ్బులు తీసుకోవాలంటే చాలా పెద్ద టాస్క్. ఉదయం వెళితే మధ్యాహ్నం వరకు డబ్బులు తీసుకుని వచ్చేవారు. విత్ డ్రా ఫామ్ రాసి.. లైన్లో నిలబడి చేతిలోకి డబ్బు వచ్చేసరికి కొన్నిసార్లు సాయంత్రం కూడా అయింది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. నిమిషంలో డబ్బులు తీసుకోవచ్చు. ఏటీఎం వెళితే సరిపోతుంది.
బ్యాంకు అకౌంట్ ఉన్నవారు ఏటీఎంను మాత్రమే ఉపయోగిస్తున్నారు. బ్యాంకులో చెక్కు రాయడం, చలాన్ రాయడం, డబ్బు విత్ డ్రా చేయడం, మునుపటిలా జమ చేయడం చాలా అరుదు. బ్యాంకు మూసి ఉన్నా ఏటీఎం మాత్రం తెరిచి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ATM ఉపయోగించడం నేర్చుకున్నారు.
మీరు ఏటీఎంను ఉపయోగించాలనుకుంటే దాని పిన్‌ను గుర్తుంచుకోవాలి. ATM మాత్రమే కాదు, మీరు ఉపయోగించే క్రెడిట్ కార్డ్‌లు, డెబిట్ కార్డ్‌లకు కూడా PIN ఉంటుంది. ఇవి మన రోజువారీ జీవితాన్ని మరింత సులభతరం చేశాయి. పట్టణంలో ఏ ఏటీఎంకు వెళ్లినా అక్కడ జనం ఉంటారు. ఎందుకంటే బ్యాంకుకు వెళ్లి టైమ్ వేస్ట్ చేసుకునే బదులుగా ఏటీఎంలలోకి వెళ్లి కార్డు పెట్టి పిన్ ఎంటర్ చేస్తే సరిపోతుంది.
అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ ATM పిన్ 4 అంకెలతోనే ఎందుకు ఉంది? బహుశా ఎప్పుడూ ఆలోచించి ఉండరు. కానీ దీని వెనక కూడా ఇంట్రస్టింగ్ స్టోరీ ఉంది. తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు కూడా.
అందుకే 4 అంకెలు
ATM మెషీన్ ఆవిష్కర్త జాన్ షెపర్డ్-బారన్. మొదటి యంత్రాన్ని రూపొందించినప్పుడు అతను పిన్ నంబర్‌కు ఆరు అంకెల పిన్‌ను ఇచ్చాడు. ఈ సంఖ్య కలయికలు పెద్దవి. సంక్లిష్టంగా ఉంటాయి. అతని భార్య కరోలిన్ ముర్రే 6 అంకెలు చాలా ఎక్కువగా ఉన్నాయని, పిన్ నంబర్‌ను మరచిపోతారని చెప్పింది. ఎందుకంటే పిన్ నంబర్‌ని గుర్తుంచుకోవడం కష్టంగా ఉంటుంది. దీంతో అతను పిన్ నంబర్‌ను 4 అంకెలకు కుదించాడు, ఇది గుర్తుంచుకోవడానికి సులభం.
అంటే అందరూ సులభంగా గుర్తుంచుకునేలా 4 నంబర్ పిన్ ఇచ్చాడు. మానవ మెదడు ఒకేసారి 4 నుండి 5 సంఖ్యలను చూసినప్పుడు, అవి జ్ఞాపకశక్తిలో ఉంటాయి. అంతకంటే పెద్ద సంఖ్య అయితే కచ్చితంగా బట్టి పట్టాల్సి ఉంటుంది.
ఏటీఎం గురించి మరికొన్ని విషయాలు
మన దేశంలో ఏటీఎం దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. డబ్బులున్న ఏటీఎంను పేల్చడం, మెుత్తానికే తీసుకెళ్లడంలాంటివి చూస్తుంటాం. అయితే ఈ ఏటీఎంను దొంగిలిస్తే పట్టుబడతామన్న ఆలోచన వారికి ఉండటం లేదు. దేశంలోని ప్రతి ఏటీఎంలో కూడా జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉన్నందున, ఏటీఎం మెషీన్‌ను తీసుకెళ్లడం వల్ల దొంగలను గుర్తించడం సులభం అవుతుంది. ఇప్పుడు అన్ని ఏటీఎంలలో సీసీటీవీ, సెక్యూరిటీ ఉన్నాయి.
బ్యాంకులు మూసి ఉన్న రోజుల్లో ATMలు ఎక్కువ రద్దీగా ఉంటాయని మీరు అనుకోవచ్చు. కానీ ఇది తప్పు. శుక్రవారాల్లో ఏటీఎం వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత రెండు రోజులు బ్యాంకులకు సెలవులు ఉండడంతో చాలా మంది శుక్రవారం నాడు ఏటీఎం దగ్గరకు వస్తారు. ఎక్కువ మంది శుక్రవారం డబ్బు విత్‌డ్రా చేయడానికి, డిపాజిట్ చేయడానికి ATMలను ఉపయోగిస్తున్నారు.
బ్రెజిల్‌లోని ATMలు ఇలాంటి పిన్‌లతో పని చేయవు. బదులుగా బయోమెట్రిక్ విధానం ఉంటుంది.
టాపిక్