Did You Know : రైల్వే ట్రాక్‌పై రాళ్లు దేనికి.. మరి మెట్రోకు ఎందుకు లేవు?
Railway Tracks : మనలో చాలా మందికి రైల్వే ట్రాక్‌లపై రాళ్ల గురించి ఆసక్తి ఉంటుంది. వాటిని ఏమని పిలుస్తారు. అవి ఎందుకు వేస్తారు.. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఇలాంటి డౌట్లు చిన్న పిల్లలకు ఎక్కువ. మరి ఎందుకు ఇలా రాళ్లు వేస్తారు.
రైలు ప్రయాణం చేస్తే తెలియని ఆనందం. రైలు ముందుకు కదులుతుంటే.. కిటికీలో నుంచి చూస్తుంటే మంచి ఫీల్. రైలు(Rail)లో వెళ్లడం.. అద్భుతమైన ప్రయాణ అనుభవం. అయితే, రైల్వే ట్రాక్(Railway Track)లపై రాళ్లు ఎందుకు ఉన్నాయని మనలో చాలా మంది జీవితంలో ఒక్కసారైనా ఆలోచించి ఉండవచ్చు. రైల్వే ట్రాక్ మీద ఉండే రాళ్లను 'ట్రాక్ బ్యాలస్ట్' అని పిలుస్తారు
రైల్వే ట్రాక్ కింద పర్పెండిక్యులర్ గా ఒక బ్లాక్ లాంటిది పెడతారు ఎప్పుడైనా చూశారా? వాటిని రైల్వే స్లీపర్స్(Railway Sleepers) అని అంటారు. రైల్వే ట్రాక్స్ మధ్య గ్యాప్ కరెక్ట్ గా ఉండేలా, అలాగే ట్రాక్ ఎప్పుడు నిటారుగా ఉండేలా ఉండడానికి ఈ రైల్వే స్లీపర్స్ ఉపయోగపడతాయి. రైల్వే స్లీపర్స్ ను రైల్ రోడ్ టై లేదా క్రాస్ టై అని కూడా పిలుస్తుంటారు. అంతకుముందు రైల్వే స్లీపర్స్ చెక్కతో తయారు చేసే వాళ్లు.. ఆ తర్వాత ఇప్పుడు కాంక్రీట్ తో కూడా తయారు చేస్తున్నారు.
ఇక ట్రాక్ బ్యాలస్ట్(track ballast) అనేది రైల్వే ట్రాక్‌లపై కంకర రాళ్లతో ఉంటాయి. అవి ట్రాక్‌బెడ్‌ను ఏర్పరుస్తాయి. రైల్వే ట్రాక్‌ల చుట్టూ ప్యాక్ చేస్తారు. అవి పైన చెప్పుకొన్న రైల్వే స్లీపర్‌లకు నేలలాగా ఉంటాయన్నమాట. ఇవి రైల్వే ట్రాక్‌లను నిటారుగా, సరిగ్గా ఉంచడానికి ఉపయోగించబడతాయి. రైల్వే స్లీపర్‌లు ట్రాక్‌లకు లంబంగా ఉంచిన దీర్ఘచతురస్రాకార సపోర్ట్ పీస్.
ట్రాక్ బ్యాలస్ట్ కోసం కంకర రాళ్లను ఉపయోగిస్తారు. రైల్వే ట్రాక్‌లపై అలంకరణకు ఉపయోగించినట్లుగా మృదువైన, గుండ్రటి గులకరాళ్లను ఉపయోగించారు. రైలు(Rail) ప్రయాణిస్తున్నప్పుడు అవి ఒకదానికొకటి దొర్లవచ్చు లేదా జారిపోవచ్చు. ట్రాక్ బ్యాలస్ట్ కేవలం షార్ప్ గా ఉన్న రాళ్లతో మాత్రమే తయారు చేస్తారు. ఎక్కువగా కదలని రాళ్లు మాత్రమే వాడతారు.
రైల్వే ట్రాక్(Railway Track)లపై చెట్లు పెరగడానికి రాళ్లు అనుమతించవు. చెట్లు పెరిగితే.. రైల్వే లైన్ల నేలను బలహీనపరుస్తుంది. ఈ రాళ్లు(Stones) అలా కూడా ఉపయోగపడతాయన్నమాట. ట్రాక్ బ్యాలస్ట్ కూడా నీటిని ట్రాక్‌లోకి చేరకుండా చేస్తుంది. రైల్వే ట్రాక్‌ల నుండి పూర్తిగా వెళ్లదేమో... కానీ నీరు దానిపై ఉండకుండా చూసేందుకు ట్రాక్‌ల కింద లేదా చుట్టూ సరైన డ్రైనేజీని సులభతరం చేస్తుంది. రాళ్లు లోనికి నీళ్లు వెళ్తాయి. ప్రయాణిస్తున్న రైలు శబ్దాన్ని కూడా ట్రాక్ పక్కన ఉన్న రాళ్లు తక్కువ చేస్తాయి.
ఇక మెట్రో స్టేషన్ల(Metro Station)ను పరిశీలిస్తే.. ట్రాక్ బ్యాలస్ట్ ఉండదు. మెట్రో స్టేషన్నలో ట్రాక్ నిర్మించే విధానం వేరేగా ఉంటుంది. వీల్ లోడ్ తట్టుకునే విధంగా.. ట్రాక్స్ రూపొందించారు. అంతే కాదు.. మెట్రో స్టేషన్లలో ట్రాక్స్ కు, జనాలకు మధ్య ఎక్కువ దూరం ఉండదు. బ్యాలస్ట్ ఉంటే.. రాళ్లు ఎగిరి జనాలకు తగిలే ప్రమాదం ఉంది. మరో విషయం ఏంటంటే.. మెట్రో స్టేషన్లు క్లోజ్డ్.. ఏరియాలో ఉంటాయి.. కాబట్టి.. లోపల నడిచే ట్రైన్లు లిమిటెడ్ స్పీడ్ తో నడుస్తాయి. ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది. మెట్రో రైలుకు తగిన సాంకేతికతతో ట్రాక్ నిర్మాణం ఉంటుంది. అందుకే రాళ్లు ఉండవు.