December 18 Telugu News Updates : ఎయిర్‌పోర్టు వరకు మెట్రో.. కసరత్తు వేగవంతం
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సమాచారం కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. తాజా వార్తల కోసం ఎప్పటికప్పుడు పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి.
Sun, 18 Dec 202203:43 PM IST
రూల్స్ ఇవే…
న్యూ ఇయర్ వేడుకలు అంటేనే పెద్ద జోష్..! అందులోనూ హైదరాబాద్ అంటే ఒక్కమాటలో చెప్పలేం. ఇక యూత్ తెగ సంబరాలు చేసుకుంటారు. నగర వీధుల్లోకి వచ్చి హుషారుగా గడిపేందుకు రకరకాల ప్లాన్ లు వేసుకుంటారు. ఇక పబ్స్ కథ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హోటళ్లు, పబ్స్, క్లబ్ లకు భారీ డిమాండ్ ఉంటది. ఈ నేపథ్యంలో పోలీసులు నిఘా కూడా ఎక్కువగానే ఉంటుది. అయితే ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి పోలీసులు నిబంధనలు విడుదల చేశారు. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రూల్స్ ఇవే..
పోలీసులు విధించిన తాజా రూల్స్ త్రీ స్టార్ అంతకంటే పెద్ద హోటళ్లు, పబ్బులు, క్లబ్బులకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
రాత్రి 1గంట వరకు నిర్వహించే వేడుకలకు 10 రోజుల ముందుగానే అనుమతి తీసుకోవాలి.
ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, పార్కింగ్ ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చాలి.
వేడుకల్లో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ మించకూడదు.
Sun, 18 Dec 202201:41 PM IST
కమిటీలు ఏర్పాటు
ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా అలైన్‌మెంట్ ఖరారు, గ్రౌండ్ డేటా సేకరణ తదితర పనులు త్వరితం చేసేందుకు రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేసినట్లు మెట్రో ఎండీ ఎన్వీయస్ రెడ్డి తెలిపారు. మెట్రో పిల్లర్లు, వయాడక్ట్, మెట్రో స్టేషన్ల నిర్మాణం, వాటి ఎత్తు ఎంత వుండాలనే విషయంలో ఈ డేటా కీలకమౌతుందని ఆయన అన్నారు.
Sun, 18 Dec 202201:41 PM IST
బంగారు కిరీటం
కొమురవెళ్లి మల్లన్న మన కొంగు బంగారమని, రాష్ట్రానికే తలమానికం మల్లన్న జాతర అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. మల్లన్న స్వామివారి కల్యాణం వైభవంగా జరగడం స్వామివారికి బంగారు కిరీట ధారణ చేయడం సంతోషంగా ఉన్నదని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆలయాలకు నిధులు మంజూరు చేస్తూ.. పురాతన ఆలయాలకు పూర్వ వైభవం తెస్తున్నారని మంత్రి వెల్లడించారు
Sun, 18 Dec 202212:03 PM IST
రాజీనామాలు..
తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభం మరింత ముదిరింది. సీనియర్ల ఆరోపణలతో 12 మంది నేతలు తమ పదవులకు రాజీనామాలు చేశారు.
Sun, 18 Dec 202211:41 AM IST
చంద్రబాబు ఫైర్…
పల్నాడు ఎస్పీ రవిశంకర్ తీరుపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాచర్లలో వైసీపీ అరాచక శక్తులకు ఎస్పీ సహకరిస్తున్నారని ఆరోపించారు. అతడిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పల్నాడు ఎస్పీ స్థానంలో హోంగార్డును కూర్చోబెట్టినా సమర్థంగా పని చేస్తారని ఎద్దేవా చేశారు.
Sun, 18 Dec 202210:26 AM IST
పవన్ ఫైర్..
వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆదివారం సత్తెనపల్లిలో కౌలు రైతు భరోసా యాత్ర సభలో పాల్గొన్న ఆయన.. వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రౌడీయిజం తగ్గాలన్నారు. వైసీపీ రాకుండా చూసుకునే బాధ్యత నాదన్నఆయన.. కార్యకర్తలు మాత్రం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని కోరారు. తనను వీకెండ్ పొలిటీషియన్ అంటున్నారని... తాను వారానికి ఒకసారి వస్తేనే తట్టుకోలేకపోతున్నారని.. రోజు ఇక్కడే ఉంటే తట్టుకుంటారా..?అని పవన్ ప్రశ్నించారు.
Sun, 18 Dec 202209:09 AM IST
కొత్త బాస్
ఈ నెలాఖరులోగా రాష్ట్రానికి కొత్త పోలీస్ బాస్ వస్తారా?అన్న అంశంపై చర్చ జరుగుతోంది. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి నెలాఖరున పదవీవిరమణ చేయనున్నారు. కొత్తవారి ఎంపిక ప్రక్రియపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరనేది ఎంపిక పూర్తి కాకపోతే మొదట ఇన్ ఛార్జ్ డీజీపీని నియమించి, ఆ తర్వాత పూర్తిస్థాయిలో నియమించే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే... హైదరాబాద్ నగరంలో కీలకమైన రాచకొండ కమిషనర్ కూడా బదిలీ అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి.
Sun, 18 Dec 202204:57 AM IST
కవితకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ఆహ్వానం
ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ కవితకు ఆహ్వానం దక్కింది. ఆమె కేరళలోలోని కన్నూర్ లో జరగబోయే ఇండియన్ లైబ్రెరీ కాంగ్రెస్ సమావేశాల్లో జనవరి 2,3 తేదీల్లో పాల్గొంటారు. ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు కవితకు ఆహ్వానం పలికారు.
Sun, 18 Dec 202203:36 AM IST
అన్నక్యాంటీన్ కు నిప్పుపెట్టిన దుండగులు
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్నక్యాంటీన్ కు దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది.
Sun, 18 Dec 202203:33 AM IST
హైకోర్టు తీర్పును అమలు చేయాలి
పోలీస్ ప్రిలిమినరీ పరీక్షల్లో హైకోర్టు తీర్పును అమలు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు లేఖ రాశారు.
Sun, 18 Dec 202203:33 AM IST