Sexsomnia : నిద్రలోనే సెక్స్.. మీకు ఈ అరుదైన వ్యాధి ఉందా?-what is sexsomnia sleeping disorder signs symptoms and causes details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sexsomnia : నిద్రలోనే సెక్స్.. మీకు ఈ అరుదైన వ్యాధి ఉందా?

Sexsomnia : నిద్రలోనే సెక్స్.. మీకు ఈ అరుదైన వ్యాధి ఉందా?

HT Telugu Desk HT Telugu
Feb 18, 2023 08:20 PM IST

Sexsomnia Sleeping Disorder : నిద్రలో నడవడం లేదా కూర్చోవడం గురించి విని ఉంటారు. కానీ నిద్రలోనే శృంగారం కూడా చేస్తారని మీకు తెలుసా? ఇదో అరుదైన వ్యాధి. ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. శృంగారంలో పాల్గొన్నట్టుగా ఆ వ్యక్తికి కూడా తెలియదు. ఉదయం లేస్తే.. ఏం జరగనట్టుగానే ప్రవర్తిస్తారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

సెక్స్‌సోమ్నియా.. దీనినే స్లీప్ సెక్స్(Sleep Sex) అని కూడా అంటుంటారు. ఇది ఒక రకమైన నిద్ర రుగ్మత. సెక్స్‌స్నోమియా(Sexsomnia) అనే రుగ్మత వచ్చిన వారు నిద్రలో సెక్స్ చేస్తారు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వారు చూసేందుకు కళ్లు తెరిచి ఉన్నా.. శబ్దాలు చేసినా.. సెక్స్ సమయంలో మాత్రం నిద్రలోనే ఉంటారు. అమెరికాలో కూడా ఓ ఘటన జరిగింది.

అమెరికాలో ఆ మధ్య ఓ మహిళ తన భర్తకు ఉన్న అరుదైన వ్యాధిని బయటపెట్టింది. 'నేను రాత్రి త్వరగా నిద్రపోతాను. అయితే నా భర్త నిద్రిస్తున్నప్పుడు లైంగిక సంబంధం కలిగి ఉంటాడు. మరుసటి రోజు ఉదయం, సంఘటన గురించి అడిగినప్పుడు ప్రతిదీ మర్చిపోతాడు.' అని మహిళ చెప్పింది.

వైద్య పరిభాషలో ఈ రుగ్మతను 'సెక్స్‌సోమ్నియా'((Sexsomnia) అంటారు. ఈ వ్యాధితో బాధపడేవారు నిద్రిస్తున్నప్పుడు సంభోగం చేశారనే విషయాన్ని మరచిపోతారు. చాలా మంది ఈ వింత వ్యాధితో బాధపడుతున్నారు. ముందుగా ఇతర నిద్ర సంబంధిత రుగ్మతలు ఉన్న వ్యక్తిలో సెక్స్‌సోమ్నియా సంభవించవచ్చు. మగవారిలో ఎక్కువగా నిర్ధారణ అవుతుంది. పూర్తిగా మేల్కొని ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, లైంగిక నిద్రలేమితో బాధపడుతున్న వ్యక్తులు నిద్రలో ఉన్నప్పుడు వారు చేసిన లైంగిక ప్రవర్తనలను గుర్తుంచుకోరు. ఆ తర్వాత మీ భాగస్వామి ఆ విషయం మీకు చెబితే.. అప్పుడు కూడా అవునా.. నేనా అనే అంటారు.

సెక్స్‌సోమ్నియా లక్షణాలు:

హస్తప్రయోగం, రమ్మని పిలవడం, సంభోగం, లైంగిక వేధింపు, శబ్ధాలు చేయడం, నిద్రపోతున్నప్పుడు చెడుగా మాట్లాడటం

కారణాలు

ఒత్తిడి(Stress), నిద్ర లేమి. మద్యం లేదా ఇతర ఔషధాల వినియోగం. ముందుగా ఉన్న పారాసోమ్నియా ప్రవర్తనలు, కోపం, గందరగోళం, నిరాశ

ఈ వ్యాధికి చికిత్స

ఈ వ్యాధిని నయం చేసే ఔషధం లేదని మానసిక నిపుణులు అంటున్నారు. అదంతా మానసికంగా మనం చేసే ఆలోచన మీదే ఆధారపడి ఉంటుంది. ఇది జరిగేప్పుడు భాగస్వామి ఒక పరిష్కారాన్ని కనుగొనాలి. నిద్రలోనే శృంగారం చేసేప్పుడు ఆ వ్యక్తిని మేల్కొలపాలి. అవసరమైతే, సెక్స్‌లో పాల్గొనకుండా మాట్లాడండి. మనస్తత్వవేత్తలు కూడా ఇదే అంటున్నారు. మీ భాగస్వామితో మొత్తం విషయాన్ని బహిరంగంగా చర్చించండి. సమస్య నయం అయ్యే ఛాన్స్ ఉంది. సెక్స్‌సోమ్నియా ఉండే వ్యక్తులకు మంచి వాతావరణాన్ని సృష్టించండి. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ప్రత్యేక పడకగదిలో పడుకోండి.

సెక్స్‌సోమ్నియా డిజార్డర్ ఉన్న వ్యక్తులు నిద్రలోనే లైంగిక చర్యకు ఉపక్రమిస్తారని థెరపిస్టులు అనే మాట. ఈ రుగ్మతతో బాధపడేవారు రాత్రి నిద్రలో సెక్స్ చేస్తారు.. కానీ మరుసటి రోజు మాత్రం ఆ సంగతి గుర్తు ఉండదు.

WhatsApp channel