Rakhi Sawant Wedding: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ సెక్స్ బాంబ్
Rakhi Sawant Wedding: సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీ సావంత్. తన బాయ్‌ఫ్రెండ్‌ను కోర్టులో పెళ్లి చేసుకున్న ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Rakhi Sawant Wedding: బాలీవుడ్‌లో తాను చేసిన సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలిచే సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ పెళ్లి చేసుకుంది. అయితే ఈ పెళ్లి గ్రాండ్‌గా జరగలేదు. సీక్రెట్‌గా ఓ కోర్టులో జరగడం విశేషం. తన బాయ్‌ఫ్రెండ్ ఆదిల్ ఖాన్ దురానీని ఆమె పెళ్లి చేసుకుంది. ఇప్పుడీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
అందులోనూ రాఖీ తల్లి ఆసుపత్రి పాలైన మరుసటి రోజే ఆమె ఈ పెళ్లి చేసుకోవడం గమనార్హం. కోర్టు రూములో సీక్రెట్‌గా తన బాయ్‌ఫ్రెండ్‌ను రాఖీ పెళ్లి చేసుకుంది. రాఖీ సావంత్ తల్లి క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఆమెను హాస్పిటల్‌లో చేర్చినట్లు మంగళవారం (జనవరి 10) రాఖీ మీడియాకు తెలిపింది. ఆ మరుసటి రోజే ఆమె పెళ్లి ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి.
పెళ్లి తర్వాత రాఖీ మీడియాతో మాట్లాడింది. పెళ్లిపై ఆనందం వ్యక్తం చేస్తూనే అదే సమయంలో పట్టలేనంతగా ఏడ్చేసింది. దీంతో అక్కడున్న మీడియా వాళ్లంతా అయోమయానికి గురయ్యారు. రాఖీ, ఆమె భర్త ఆదిల్ తమ అధికారిక పెళ్లి సర్టిఫికెట్‌పై సంతకాలు చేశారు. వధూవరులు ఇద్దరూ సంతకాలు చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి.
ఈ పెళ్లికి ఇద్దరూ చాలా సింపుల్‌గా వచ్చారు. రాఖీ రెడ్ కలర్ సల్వార్ ధరించగా.. ఆదిల్ సింపుల్‌గా జీన్స్, టీషర్ట్‌లో రావడం విశేషం. ఆదిల్ దురానీ దుబాయ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త. రాఖీ గతంలో రితేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతనితో విడిపోయిన తర్వాత ఆదిల్ ఖాన్‌ను మీడియాకు పరిచయం చేసింది. ఇది జరిగి ఏడాది అయింది. ఇప్పుడు వాళ్లిద్దరూ భార్యాభర్తలు అయ్యారు.
టాపిక్