Wine Before Sleep : నిద్రపోయే ముందు వైన్ తాగడం ఆరోగ్యకరమా?
Wine Before Sleep Good Or Bad : చాలామందికి నిద్రపోవడం అనేది పెద్ద సమస్యగా మారింది. ఎలాగైనా నిద్రపోవాలని.. తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. కొంతమంది పడుకునే ముందు వైన్ తాగుతారు. ఇలా తాగితే మంచిదేనా?
ఎంత ప్రయత్నించినా.. నిద్రపట్టదు.. దీంతో కొంతమంది ఆల్కహాల్(alcohol) తీసుకుంటారు. అయితే దీనితో నిద్ర పడుతుందా.. ఒకవేళ నిద్రపోయినా.. ప్రశాంతమైన నిద్ర ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలు కొంతమందికి వస్తుంటాయి. పడుకునేముందు వైన్ తాగితే మంచిదేనా?
వైన్ తాగే వ్యక్తులు తరచుగా నిద్రపోతారని పరిశోధకులు కనుగొన్నారు. కానీ తక్కువ వ్యవధిలో మేల్కొంటారు. ఆ తర్వాత తిరిగి నిద్రపోవడం చాలా కష్టంగా మారుతుంది. మద్యపానం చేసేవారికి వైన్(Wine) అందించనప్పుడు నిద్రలేమి లక్షణాలు కనిపించాయని పరిశోధకులు కనుగొన్నారు. వారి నిద్ర విధానాలలో అంతరాయాలను అనుభవిస్తారు. వైన్ తీసుకోవడం వల్ల శరీరం నుండి తరచుగా మూత్రం బయటకు పోతుంది. వెంటనే లేస్తారు.
నిద్రవేళకు ముందు మద్యం(liquor) సేవించడం మానేసినప్పుడు.., వారు ఆల్కహాల్ మానేసిన లక్షణాలతో బాధపడ్డారు. నిద్రపోవడానికి ప్రయత్నించినప్పుడు, నిద్రలేమి లక్షణాలను చూపించారని పరిశోధనలో తేలింది. అయితే ఈ అలవాటను మెల్లమెల్లగా మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రెండు గ్లాసుల వైన్ ఒకరి నిద్ర నాణ్యతపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందనే అపోహ ఉంది. రోజువారీ నిద్ర విధానంలో అంతరాయం కలగడానికి కారణాన్ని తెలుసుకునేందుకు ప్రొఫెషనల్ వైద్యుని సహాయం తీసుకోవాలి. కానీ నిద్రకు ముందు మందు తాగితే నిద్ర బాగా పడుతుందనేది మాత్రం అపోహ మాత్రమే.
వాల్‌నట్స్‌లో ప్రోటీన్, పొటాషియం ఉంటాయి కాబట్టి నిద్రలేమికి సహాయపడతాయి. ఇది మెలటోనిన్ అనే సహజమైన నిద్ర హార్మోన్‌ను తయారు చేయడానికి శరీరానికి సహాయపడుతుంది. మెదడు(Mind)పై విశ్రాంతి ప్రభావం కోసం మీ సాయంత్రం భోజనంతో సలాడ్ తీసుకోండి. నిద్రపోవడానికి, మెలటోనిన్, సెరోటోనిన్ ఉత్పత్తి చేయడానికి మన శరీరానికి విటమిన్ B6 అవసరం. అరటిపండ్లు(Banana), వెచ్చని పాలు విశ్రాంతి కోసం సహజ రసాయనాలను విడుదల చేయడం ద్వారా నిద్రను ప్రోత్సహిస్తాయి. నిద్రపోవడానికి గంట ముందు టెలివిజన్(Television), కంప్యూటర్లు, మొబైల్ ఫోన్(Mobile Phone)ను ఆఫ్ చేయడం అలవాటు చేసుకోవాలి. వ్యాయామం, యోగా కూడా మంచి నిద్రకు దోహదపడతాయి.
నిద్రపోయే ముందు వైన్ తాగడం మానుకోవాలని, ప్రశాంతమైన నిద్ర కోసం పైన పేర్కొన్న ఆహారాలను ఉపయోగించాలని నిపుణులు చెబుతున్నారు. నిద్రవేళలో రెండు గ్లాసుల వైన్ తీసుకోవడం వల్ల ఒక వ్యక్తి చాలా కాలం పాటు ఆల్కహాలిక్‌గా మారే ప్రమాదాన్ని పెంచుతుంది. దీని ఫలితంగా నిద్ర సమస్యలు మాత్రమే కాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. నిద్రవేళకు ముందు వైన్ తాగడం వల్ల మంచి నిద్ర వస్తుందనుకోవడం అపోహ. నిద్రపోయే ముందు ఆల్కహాల్ తీసుకుంటే.. అది మీ ఆర్ఈఎమ్ నిద్రావస్థ(ర్యాపిడ్ ఐ మూవ్‌మెంట్)ను భంగపరుస్తుంది.