Sex during pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో సంభోగం సరైనదేనా?-can sex cause miscarriage during pregnancy when to avoid ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sex During Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో సంభోగం సరైనదేనా?

Sex during pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో సంభోగం సరైనదేనా?

HT Telugu Desk HT Telugu
Jan 13, 2023 10:00 PM IST

sex during pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో లైంగిక ప్రక్రియలో పాల్గొనవచ్చా? లేదా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. అయితే ఎవరు పాల్గొనవచ్చు? ఎవరు పాల్గొనరాదో ఒకసారి చదవండి.

గర్భధారణ సమయంలో సెక్స్‌లో పాల్గొనవచ్చా?
గర్భధారణ సమయంలో సెక్స్‌లో పాల్గొనవచ్చా?

sex in pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్‌లో పాల్గొనడం వల్ల ఎలాంటి నష్టం లేదు. అయితే పాల్గొనవద్దని మీ డాక్టర్ చెబితే మాత్రం సెక్స్‌లో పాల్గొనకండి. సెక్స్‌లో పాల్గొనడం వల్ల గర్భంలో ఉన్న బేబీకి ఎలాంటి నష్టం ఉండదు. ప్రెగ్నెన్సీ సమయంలో సెక్స్ డ్రైవ్‌లో మార్పులు రావడం సహజం. ఈ విషయాల గురించి మీ భాగస్వామితో చర్చించడం సబబుగా ఉంటుంది.

కొందరికి ప్రెగ్నెన్సీ సమయంలో కూడా లైంగిక ప్రక్రియలో పాల్గొనడం ఆనందాన్నిస్తుంది. కానీ మరికొందరికి ఆందోళనకరంగా ఉంటుంది. ఈవిషయం మీ భాగస్వామితో చర్చించడం మంచిది. మీ భావాలను మీ భాగస్వామితో పంచుకోవడమే ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం. భాగస్వామి ఒత్తిడి చేసినప్పటికీ వాస్తవిక పరిస్థితిని విడమరిచి చెప్పడం వల్ల గర్భిణికి సౌకర్యవంతంగా ఉంటుంది.

ప్రెగ్నెన్సీలో ఎలాంటి క్లిష్టత లేనప్పుడు లైంగిక ప్రక్రియలో పాల్గొనడం వల్ల గర్భస్రావం వంటి పరిస్థితులు ఉత్పన్నం కావని వైద్యులు చెబుతారు. ఆర్గాజమ్ సమయంలో మీ కండరాలు స్టిఫ్ అవ్వడం గమనిస్తారు. దీనిని బ్రాక్స్‌టన్ హిక్స్ కాంట్రాక్షన్స్ అంటారు. కాస్త అసౌకర్యంగా అనిపించినా, ఇలా కావడం సహజమే.

ప్రెగ్నెన్సీలో సెక్స్ ఎప్పుడు కూడదు?

ఒక్కోసారి వైద్యులు ప్రెగ్నెన్సీలో సెక్స్ వద్దని చెబుతారు. ప్రెగ్నెన్సీలో రక్తస్రావం జరుగుతున్నప్పుడు ఈ సూచన చేస్తారు. సెక్స్ వల్ల ప్లసెంటా మరింత రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది.

అలాగే గర్భంలో పిండం చుట్టూ ఉండే నీరు లీకైనప్పుడు కూడా సెక్స్‌లో పాల్గొనరాదని వైద్యులు సూచిస్తారు.

గర్భ ముఖ ద్వారం (సెర్విక్స్) వద్ద సమస్యలు ఉన్నప్పుడు కూడా ప్రసవ నొప్పులు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో కూడా సెక్స్‌లో పాల్గొనవద్దని సూచిస్తారు.

ఇక గర్భంలో కవలలు ఉన్నప్పుడు, లేదా ఇంతకముందు గర్భధారణలో త్వరగా ప్రసవ నొప్పులు వచ్చి ఉంటే కూడా సెక్స్‌లో పాల్గొనవద్దని సూచిస్తారు.

ప్రెగ్నెన్సీ సమయంలో భాగస్వామితో కాకుండా ఇతరులతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొంటే సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్ఫెక్షన్స్ (ఎస్టీఐ) వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది బేబీకి ప్రమాదం. అందువల్ల కండోమ్ ధరించడం మంచిది.

ఏ పొజిషన్ మేలు? ఏది తగదు?

ప్రెగ్నెన్సీలో చాలా మంది దంపతులు సెక్స్ విషయంలో సురక్షితంగానే భావిస్తారు. అయితే ఇది అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే అనువైన భంగిమలు అన్వేషించాలి. అనుభవం కొద్దీ సులువైన భంగిమ తెలుసుకోవచ్చు.

ప్రెగ్నెన్సీ సమయంలో భాగస్వామి ఆన్ టాప్ పొజిషన్‌లో ఉండడం గర్భిణికి అసౌకర్యంగా ఉంటుంది. పొట్ట వల్ల మాత్రమే కాకుండా, రొమ్ము భాగం కూడా కాస్త అసౌకర్యంగా ఉంటుంది. ఎదురెదురుగా ఉంటూ, లేదా మీ భాగస్వామి మీ వెనక ఉంటూ ప్రక్రియలో పాల్గొనడం వల్ల గర్భిణికి కాస్త సౌకర్యంగా ఉంటుంది.

Whats_app_banner