ప్రపంచంలో ఉన్న బంగారంలో ఎంత బంగారం మన భారతీయ మహిళల దగ్గర ఉందో తెలుసా? తెలిస్తే ఆశ్చర్యపోతారు
మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టం. అయితే మిగతా దేశాల్లోని మహిళలతో పోలిస్తే భారతదేశంలో బంగారానికి ఎక్కువ విలువ ఉంది. మహిళలు దీన్ని ఇష్టంగా కొనుక్కుంటారు.
బంగారం... భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి దీన్ని అత్యంత విలువైన సంపదగా చెప్పుకుంటున్నారు. ఇది సాంప్రదాయ సాంస్కృతి ప్రాముఖ్యతరే చిహ్నంగా చెప్పుకుంటారు. బంగారు ఆభరణాలతో మహిళలకు లోతైన అనుబంధం కలిగి ఉంది. భారతీయ వేడుకలలో వివాహాలలో ఎప్పుడైనా సరే మహిళలు మెడలో బంగారం ధగధగ లాడాల్సిందే. బంగారాన్ని ఆభరణాల రూపంలో, బిస్కెట్ల రూపంలో, కడ్డీల రూపంలో ఇలా రకరకాలుగా భద్రపరచుకుంటారు. ప్రపంచంలో మహిళలు వినియోగిస్తున్న బంగారం మనదేశంలోనే అధికంగా ఉంది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం భారతీయ మహిళలు దాదాపు 24 వేల టన్నుల బంగారాన్ని కలిగి ఉన్నారు. ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారు నిల్వలలో ఇది పదకొండు శాతం.
భారతీయ మహిళలు కలిగి ఉన్న ఈ బంగారం విలువ తక్కువేమీ కాదు. ఐదు దేశాల బంగారు నిల్వలను మించిపోయి భారతీయ మహిళల దగ్గర బంగారం ఉంది. అమెరికాలో 8000 టన్నుల బంగారం ఉంటే, జర్మనీలో 3300 టన్నుల బంగారాన్ని మహిళలు వాడుతున్నారు. ఇక ఇటలీలో 2,450 టన్నులు, ఫ్రాన్స్ లో 2000 టన్నులు, రష్యాలో 1900 టన్నులు ఆభరణాల రూపంలో బంగారాన్ని మహిళలు కలిగి ఉన్నారు. వీరందరితో పోలిస్తే భారతీయ మహిళల్లో 24 వేల టన్నుల బంగారాన్ని ఆభరణాల రూపంలో కలిగి ఉన్నారు.
ఆక్స్ఫర్డ్ గోల్డ్ గ్రూపు నివేదిక ప్రకారం భారతీయ కుటుంబాలు ప్రపంచంలోని మొత్తం బంగారంలో మొత్తం 11 శాతాన్ని కలిగి ఉన్నాయి. ఇది అమెరికా, అంతర్జాతీయ ద్రవ్యనిధి, స్విట్జర్లాండ్, జర్మనీల దగ్గర ఉన్న బంగారాల నిల్వలకంటే కూడా ఎక్కువ.
ఇక మన దేశం విషయానికి వస్తే భారతదేశంలో ఉన్న మొత్తం బంగారంలో దక్షిణ భారతదేశంలో నివసిస్తున్న మహిళలే 40 శాతాన్ని బంగారు ఆభరణాలను కలిగి ఉన్నారు. అందులో తమిళనాడులోనే 28 శాతం బంగారం ఉంది.
దేశం జిడిపిలో 40 శాతం కవర్ చేస్తూ భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో బంగారం ముఖ్యపాత్ర పోషిస్తుంది. భారత దేశంలోని ఆదాయ పన్ను చట్టాలు చెబుతున్న ప్రకారం వివాహమైన మహిళలు అరకిలో బంగారాన్ని తమతో పాటు ఉంచుకోవచ్చు. ఇక పెళ్ కాని మహిళలు పావుకిలో బంగారాన్ని తమ దగ్గర ఉంచుకోవచ్చు. అదే పురుషులైతే 100 గ్రాముల బంగారాన్ని మాత్రమే కలిగి ఉండాలి. భారతీయ సంస్కృతిలో బంగారం అనేది సంపదకు చిహ్నం.
టాపిక్