Wearing Inners At Night : రాత్రిపూట లోదుస్తులు ధరించకుండా నిద్రపోతే ఏం జరుగుతుంది?
Wearing Inners At Night : రాత్రిపూట లోదుస్తులు వేసుకోకుండా నిద్రపోతే ఏమవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? దీని ద్వారా మీరు కొన్ని ప్రయోజనాలు పొందవచ్చు.
మీరు రాత్రిపూట లోదుస్తులు వేసుకుని నిద్రపోతారా? చాలా మందికి ఈ ప్రశ్న హాస్యాస్పదంగా అనిపించవచ్చు. ఎందుకంటే లోదుస్తులు అనగానే మనలో చాలామంది అదేదో వెరైటీగా ఫీలవుతారు. మీరు దాని అవసరాన్ని ప్రశ్నిస్తే? చాలా మంది నవ్వుతారు. అయితే వీటిని రాత్రిపూట ధరించకపోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అనేది కూడా నిజం. లోదుస్తులను ఉపయోగించకపోవడం వల్ల కలిగే ప్రభావాలపై పరిశోధనలో కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెల్లడించాయి. అవి ఏంటో తెలుసుకోండి..
యాసిడ్ రిఫ్లక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
లోదుస్తుల వంటి బిగుతైన దుస్తులు మీ పొట్టను పైకి నెట్టి కడుపుపై ఒత్తిడిని కలిగిస్తాయి. ఫలితంగా యాసిడ్ రిఫ్లక్స్ కారణంగా గుండెల్లో మంట వస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ 20, 30లలో సాధారణం. అయినప్పటికీ లోదుస్తులను రాత్రి పడుకునే సమయంలో తీసేసయడం యాసిడ్ రిఫ్లక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఈస్ట్ ఇన్ఫెక్షన్
చాలా మందిని ఇబ్బంది పెట్టే బ్యాక్టీరియా ఉంటుంది. 20 శాతం మంది మహిళల్లో ఈ బాక్టీరియా ఉంటుంది. కొందరిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ ఈస్ట్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. కాటన్ బట్టలు ఉపయోగించినప్పుడు, అవి తేమను నిలుపుకుంటాయి. బ్యాక్టీరియా పెరగడానికి పరిస్థితులను సృష్టిస్తాయి. రాత్రిపూట లోదుస్తుల వాడకాన్ని నివారించడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
దుర్వాసన
చెమట ఎక్కువగా వచ్చే ప్రదేశం కావడంతో లోదుస్తులు చెమటను పీల్చుకుని దుర్వాసనను కలిగిస్తాయి. ప్రైవేట్ భాగాలు సున్నితమైన కణజాలంతో రూపొందించబడ్డాయి. సింథటిక్ పదార్థాలతో తయారు చేయబడిన గట్టి లోదుస్తులు అసౌకర్యం, గాయం, సంక్రమణకు కారణమవుతాయి. అంతే కాదు లోదుస్తులను నివారించడం, వదులుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల నొప్పిని కూడా తగ్గించవచ్చు. కొన్నిసార్లు పూర్తిగా నివారించవచ్చు.
చిరాకు, అలెర్జీలు
ప్రైవేట్ పార్ట్‌లలో అసౌకర్యం, అలెర్జీ వచ్చే ప్రమాదం ఎక్కువ. లోదుస్తులతో సహా చాలా బట్టలు కృత్రిమ నూలు, రంగులు, రసాయనాలతో తయారు చేసి ఉంటాయి. అవి చాలా త్వరగా అలెర్జీని కలిగిస్తాయి. అలెర్జీలు అసౌకర్యం, దద్దుర్లు, పొక్కులు, వాపులను కలిగిస్తాయి. ఈ స్థితిలో అలర్జీని కలిగించే లోదుస్తులకు రాత్రిపూట దూరంగా ఉండటం మంచిది.
పురుషులకు కూడా వర్తిస్తుంది
లోదుస్తులను నివారించడం వల్ల ఇన్ఫెక్షన్, దురద వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పునరుత్పత్తి అవయవాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మీరు లోదుస్తులు ధరించనప్పుడు మీరు అసౌకర్యం, ఇన్ఫెక్షన్లు, యాసిడ్ రిఫ్లక్స్ వంటి వ్యాధుల నుండి బయటపడతారు. పురుషులు కూడా రాత్రిపూట లోదుస్తులను ధరించకుండా నిద్రపోవడం మంచిది. లోదుస్తులు ఎక్కువగా టైట్ ఉండకుండా చూసుకోండి.