నోటి దుర్వాసన ఒక సాధారణ నోటి ఆరోగ్య సమస్య. ఇది మనం తీసుకునే ఆహారంతో ముడిపడి ఉంటుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటి ఘాటైన వాసన కలిగిన ఆహారాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య రావచ్చు.
pexels
By Bandaru Satyaprasad May 15, 2024
Hindustan Times Telugu
క్రమం తప్పకుండా దంతాలు, ఫ్లాస్‌లను బ్రష్ చేయకపోతే మీ నోటిలో ఆహారం ఉండిపోయి అది బ్యాక్టీరియాను ఆకర్షిస్తుంది. ఆహారం దంతాలు, చిగుళ్లపై కుళ్లిపోయి దుర్వాసన వస్తుంది.
pexels
నోటి దుర్వాసనకు కారణాలు- సరిగ్గా బ్రషింగ్, ఫ్లాసింగ్, నాలుకను శుభ్రపరచకపోవడం వలన నోటిలో బ్యాక్టీరియా పేరుకుపోతుంది. లాలాజల ఉత్పత్తిలో తగ్గుదల, డీహైడ్రేషన్, చిగుళ్ల వ్యాధి, కావిటీస్, దంత సమస్యలు బ్యాక్టీరియా ఉత్పత్తికి దారి తీసి నోటి దుర్వాసన వస్తుంది. ధూమపానం, సైనస్ ఇన్ఫెక్షన్లు, మధుమేహం, లివర్ లేదా మూత్రపిండాల వ్యాధులు నోటి దుర్వాసనకు కారణమవుతాయి.
pixabay
నోటి దుర్వాసనను నివారించే మార్గాలు- నోటి పరిశుభ్రత : ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో రోజుకు కనీసం రెండుసార్లు మీ దంతాలను బ్రష్ చేయండి. ప్రతిరోజూ ఫ్లాస్ చేయండి.
pexels
మీ నాలుకను శుభ్రం చేసుకోండి- మీ దంతాలను బ్రష్ చేసేటప్పుడు, ప్రతిరోజూ నాలుకను సున్నితంగా శుభ్రం చేయడానికి స్క్రాపర్‌ని ఉపయోగించండి. బాక్టీరియా నాలుకపై పేరుకుపోవడం వల్ల నోటి దుర్వాసనకు దారితీస్తుంది.
pexels
హైడ్రేటెడ్ గా ఉండండి - మీ నోటి ఆరోగ్యానికి తరచూ నీరు తాగడం చాలా ముఖ్యం. లాలాజలం ఆహార కణాలు, బ్యాక్టీరియాను తొలగించడానికి సహాయపడుతుంది.
pexels
షుగర్ లేని గమ్ లేదా పుదీనా ఆకులు నమలండి - ఘాటైన వాసన కలిగిన ఆహారం, పానీయాలు తిన్న తర్వాత చక్కెర రహిత చూయింగ్ గమ్ లేదా పుదీనా నమలండి. ఇవి లాలాజల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. నోటిని శుభ్రపరచడానికి, శ్వాసను తాజాగా చేయడానికి సహాయపడుతుంది.
pexels
కరకరలాడే పండ్లు, కూరగాయలు తినండి - క్యారెట్, సెలెరీ, యాపిల్స్ వంటి క్రంచీ కూరగాయలు, పండ్లు తినండి. ఈ ఆహారాలు దంతాలను శుభ్రపరచడంలో లాలాజల ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడతాయి.
pexels
వీటితో పాటు ఘాటైన వాసన కలిగిన ఆహారాలు తినడం తగ్గించండి. ధూమపానానికి దూరంగా ఉండండి. మౌత్ వాష్ ఉపయోగించం, గ్రీన్ టీ తాగడం, ప్రోబయోటిక్స్ వాడడం వల్ల నోటి దుర్వాసనను నివారించవచ్చు.
pexels
నోటి శుభ్రతతో దుర్వాసనను దూరం చేయవచ్చు. నోటి శుభ్రత పాటిస్తున్నా దుర్వాసన వస్తే అంతర్లీన ఆరోగ్య సమస్య ఉన్నట్లు సంకేతం. ఇందుకు మీరు వైద్యులను సంప్రదించండి.
pexels
అల్లం, తులసి, బెల్లం మిశ్రమం చలికాలంలో పెరిగే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల నుండి రక్షించడానికి ఒక బెస్ట్ హోం రెమెడీ.