Vitamin D: ప్రతి సమస్య విటమిన్ డి లోపం వల్లే కాదు, అతిగా తీసుకుంటే అనారోగ్యమే-what happens when vitamin d is overly taken see side effects ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vitamin D: ప్రతి సమస్య విటమిన్ డి లోపం వల్లే కాదు, అతిగా తీసుకుంటే అనారోగ్యమే

Vitamin D: ప్రతి సమస్య విటమిన్ డి లోపం వల్లే కాదు, అతిగా తీసుకుంటే అనారోగ్యమే

Koutik Pranaya Sree HT Telugu
Oct 01, 2024 07:00 PM IST

Vitamin D: విటమిన్ డి వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే అధిక విటమిన్ డి తీసుకోవడం వల్ల ప్రయోజనాల కంటే తీవ్రమైన ఆరోగ్య సంబంధిత నష్టాలు కూడా వస్తాయి. ఇది ఎముక ఆరోగ్యం నుండి మానసిక ఆరోగ్యం వరకు తీవ్రంగా ప్రభావితం చూపుతుంది.

విటమిన్ డి సైడ్ ఎఫెక్ట్స్
విటమిన్ డి సైడ్ ఎఫెక్ట్స్ (shutterstock)

అతి అనర్థం. ఏదైనా తగినంత మోతాదులో ఉంటేనే ఆరోగ్యానికి శ్రేయస్కరం. ఈ ఫార్ములా శరీరానికి అవసరమైన విటమిన్లకు కూడా సరిపోతుంది. ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లలో ఒకటి విటమిన్ డి. ఈ మధ్య చాలా మంది విటమిన్ డి లోపం గురించి మాట్లాడటం వినే ఉంటారు. సప్లిమెంట్లు కూడా వాడతారు. అయితే ప్రతిదానికే అదే సమస్య అనుకుని తీవ్రంగా వాడితే చాలా నష్టపోతారు. 

విటమిన్ డి టాక్సిసిటీ:

విటమిన్ డి శరీరంలో హార్మోన్‌గా పనిచేయడం ద్వారా పేగుల్లోని కాల్షియం శోషణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచి కండరాల పనితీరును సులభతరం చేస్తుంది. ఇందులో ఉండే న్యూరోప్రొటెక్టివ్ గుణాలు మెదడు కణాల పనితీరును నియంత్రించడంలో సహాయపడతాయి. అయితే ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉన్నాకూడా అధిక విటమిన్ డి తీసుకోవడం వల్ల ప్రయోజనాలకు బదులుగా ఆరోగ్యానికి తీవ్రమైన నష్టాలను కలిగిస్తుంది. ఎముక ఆరోగ్యం నుండి మానసిక ఆరోగ్యం వరకు తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. 

రోజుకు ఎంత విటమిన్ డి అవసరం?

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతిరోజూ 60,000 ఇంటర్నేషనల్ యూనిట్ల (ఐయు) విటమిన్ డి నెలల తరబడి తీసుకోవడం వల్ల శరీరంలో విషపూరితం అవుతుంది. సాధారణంగా పెద్దలకు రోజుకు 600 ఐయు విటమిన్ డి అవసరం. ఎక్కువ విటమిన్ డి తీసుకోవడం శరీరంలో విటమిన్ డి టాక్జిసిటీకి దారితీస్తుంది, దీనిని హైపర్విటమినోసిస్ అని కూడా పిలుస్తారు.

విటమిన్ డి మోతాదు మించితే ఈ లక్షణాలు:

ఆకలి

ఆకలి తగ్గుతుంది.  విటమిన్ డి ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో కాల్షియం పరిమాణం పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీన్నే హైపర్కాల్సెమియా అని కూడా అంటారు. దీనివల్ల వికారం, వాంతులు, బలహీనత, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్ డి పరీక్ష చేయించుకోవాలి.

ప్రేగు కదలికలు

శరీరంలో విటమిన్ డి మోతాదు మించినప్పుడు మలబద్ధకం వంటి జీర్ణశయాంతర లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో కాల్షియం కార్బొనేట్ అధికంగా ఉండటం కూడా క్రమరహిత ప్రేగు కదలికలకు కారణమవుతుంది.

బలహీనత

అధిక విటమిన్ డి తీసుకోవడం వల్ల కలిగే హైపర్కాల్సెమియా అలసట, బద్ధకానికి కారణమవుతుంది. ఈ అలసట, శక్తి లేకపోవడం మీ రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది.

మూత్ర విసర్జన

విటమిన్ డి అధికంగా తీసుకోవడం వల్ల తరచుగా మూత్ర విసర్జన చేసే లక్షణాలు కనిపిస్తాయి. ఇది డయాబెటిస్, మూత్రపిండాల సమస్యలకు సంకేతంగా పరిగణించబడుతుంది.

 

టాపిక్