Vitamin D: విటమిన్ డి లోపిస్తే మీ శరీరం ఈ పనులు చేయలేదు, ముందే జాగ్రత్త పడండి
Vitamin D: మన శరీరానికి అత్యవసరమైన విటమిన్లలో విటమిన్ డి కూడా ఒకటి. ఇది లోపిస్తే శరీరం అనారోగ్యం పాలవుతుంది. కాబట్టి విటమిన్ డి లోపం రాకుండా ప్రతి ఒక్కరూ చూసుకోవాలి.
Vitamin D: శరీరానికి అవసరమైన పోషకాలలో విటమిన్ డి ఒకటి. ఇది తగినంత స్థాయిలో శరీరానికి ప్రతిరోజూ అందాల్సిన అవసరం ఉంది. విటమిన్ డి లోపం శరీరంలో కొన్ని రకాల సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి ఈ విటమిన్ లోపించకుండా చూసుకోవాలి. ముందుగానే జాగ్రత్త పడకపోతే విటమిన్ డి లోపం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చి పడతాయి.

విటమిన్ డి మన శరీరంలో ఎన్నో పనులకు అవసరం. ఇది తగినంత స్థాయిలో శరీరానికి అందకపోతే కండరాలు, ఎముకలు బలహీనపడతాయి. అవి పెళుసుగా మారతాయి. మన ఎముకలకు అవసరమైన కాల్షియం, ఫాస్పరస్ శరీరం గ్రహించాలంటే విటమిన్ డి అవసరం. కాబట్టి ప్రతిరోజూ తగినంత విటమిన్ డి శరీరానికి అందేలా జాగ్రత్త పడాలి. ఆహారం నుండి కాల్షియంను గ్రహించడానికి కూడా విటమిన్ డి ముఖ్యం. విటమిన్ డి లోపించడం వల్ల కండరాలు, కీళ్లు, ఎముకలు బలహీన పడి ఏ పనీ చేయలేరు.
రోజుకు ఎంత విటమిన్ డి కావాలి?
వయసును బట్టి ఒక మనిషికి ఎంత విటమిన్ డి అవసరమో నిర్ణయిస్తారు. దీన్ని ఇంటర్నేషనల్ యూనిట్ (IU)లలో కొలుస్తారు. పుట్టినప్పటినుంచి 12 నెలల వయసు ఉన్న పిల్లలకు 400IU, ఒక సంవత్సరం నుండి 70 సంవత్సరాల వరకు 600IU, 71 సంవత్సరాలకు పైబడిన వారికి 800IU అవసరము. విటమిన్ డి లోపిస్తే అది ఎంతో ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.
శరీరంలో విటమిన్ డి లోపం వల్ల క్యాల్షియం శోషణ కష్టమైపోతుంది. శరీరం కాల్షియం శోషించుకోలేక చతికిలపడుతుంది. దీనివల్ల ఎముకలకు, దంతాలకు, కండరాలకు తగినంత కాల్షియం అందదు. ఎప్పుడైతే కాల్షియం లోపం ఏర్పడుతుందో బలమైన ఎముకలను శరీరం నిర్మించలేదు. ఎముక నొప్పులు పెట్టడం, ఎముక పగుళ్ళు ఏర్పడడం, కండరాల నొప్పులు ఏర్పడడం వంటివి జరుగుతాయి.
ఎముకల నిర్మాణానికి వాటి ఆరోగ్యాన్ని నిర్వహించడానికి శరీరానికి విటమిన్ డి చాలా అవసరం. ముఖ్యంగా పిల్లల్లో ఎముక పెరుగుదల ఉంటుంది. ఆ ఎముక పెరుగుదలకు విటమిన్ డి అవసరం. విటమిన్ డి లోపిస్తే శరీరం ఎముకలను పోషించలేదు.
ఎముకలకు, కండరాలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎముక ఆరోగ్యం, కండరాల పని తీరుపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి, కండరాల పనితీరుకు విటమిన్ డి అవసరం. ముఖ్యంగా వృద్ధులకు విటమిన్ డి ఎంతో అవసరం. ఇది కండరాల బలాన్ని పెంచుతాయి. వాటి పనితీరును నిర్వహిస్తాయి. లేకుంటే చిన్న చిన్న గాయాలకే ఎముకలు విరిగిపోయే ప్రమాదం ఉంది.
పిల్లల్లో రికెట్స్ వ్యాధి
ఎముకల్లో కాల్షియం, ఫాస్ఫరస్‌తో నిండి ఉంటాయి. అవి అలా ఎముకను నిర్మించాలంటే విటమిన్ డి ఎంతో ముఖ్యం. బలమైన ఎముకలు అభివృద్ధి చేయడానికి విటమిన్ డి ముఖ్య పాత్ర పోషిస్తుంది. శరీరంలో విటమిన్ డి లోపిస్తే ఎముకలు మెత్తబడిపోతాయి. పిల్లల్లో రికెట్స్ వంటి వ్యాధులు వస్తాయి. ఇక పెద్దలలో ఆస్టియోమలాసియా వంటి వ్యాధులు వస్తాయి.
బోలు ఎముకల వ్యాధి కూడా విటమిన్ డి లోపం వచ్చే అవకాశం ఉంది. విటమిన్ డి సరిపోకపోతే శరీరం ఆర్థరైటిస్ వంటి ఎముక రుగ్మతల బారిన పడుతుంది. ఎన్నో ఆర్థోపెడిక్ సమస్యలు వస్తాయి. శరీరానికి ఎముకలను, కండరాలను కాపాడే శక్తి కావాలంటే మీరు కావలసినంత విటమిన్ డిని శరీరానికి అందించాల్సిందే.