మొదటిసారి కలయిక తర్వాత మహిళల శరీరంలో ఏం జరుగుతుంది?-what happens after having first time intercourse in females ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మొదటిసారి కలయిక తర్వాత మహిళల శరీరంలో ఏం జరుగుతుంది?

మొదటిసారి కలయిక తర్వాత మహిళల శరీరంలో ఏం జరుగుతుంది?

Koutik Pranaya Sree HT Telugu
Aug 13, 2024 07:54 AM IST

మొదటిసారి శృంగారంలో పాల్గొన్నాక మహిళల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెల్సుకోవాలనుందా? ఈ మార్పులు ఒక్కొక్కరిలో వేరుగా ఉండొచ్చు. కానీ, సాధారణంగా వచ్చే మార్పులు ఇవే.

మహిళల శరీరంలో శృంగారం తర్వాత వచ్చే మార్పులు
మహిళల శరీరంలో శృంగారం తర్వాత వచ్చే మార్పులు (freepik)

మొదటిసారి కలయిక గురించి అనేక ప్రశ్నలుంటాయి. అసలు కలయిక తర్వాత శరీరంలో ఏం జరుగుతుందనే భయమూ, ఏం జరుగుతుందో తెల్సుకోవాలనే ఆతురత కూడా ఉంటాయి. ముఖ్యంగా మహిళల శరీరంలో వచ్చే అనేక మార్పులొస్తాయి.

ఈ మార్పులుంటాయి:

1. చనుమొనల్లో మార్పు:

చనుమొనల్లో అనేక నరాల చివర్ల సమూహం ఉంటుంది. శృంగార సమయంలో కలిగే భావప్రాప్తి, ఆనందకరమైన అనుభూతి వల్ల రొమ్ములోని కణజాలం పెద్దగా అవుతుంది. దీంతో రొమ్ము పరిమాణం తాత్కాలికంగా పెరుగుతుంది. లైంగికంగా కలిగే ప్రేరణ వల్ల చనుమొనల్లోనూ మార్పువస్తుంది.

2. ఆనంద హార్మోన్లు:

శృంగారం తర్వాత హార్మోన్లలో అనేక మార్పులొస్తాయి. వారానికి కనీసం ఒక్కసారైనా శృంగారంలో పాల్గొనడం వల్ల ఒక మనిషికి కావాల్సిన సంతోషం దొరుకుతుందని సొసైటీ ఫర్ పర్సనాలిటీ, సోషల్ సైకాలజీ సర్వే చెబుతోంది. కలయిక తర్వాత చనుమొనలు, చనుమొన చుట్టూ ఉండే ఏరియోలా, యోని దగ్గర రక్త ప్రసరణ పెరుగుతుంది. భావప్రాప్తి కలిగినప్పుడు ఏరియోలా ఉబ్బడం, చనుమొనలు గట్టిగా మారడం లాంటి మార్పులూ వస్తాయి. ఇవన్నీ శరీరంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ అనే ఆనందం కలగజేసే హార్మోన్ల వల్లే.

3. యోని సాగుదలలో మార్పు:

మొదటిసారి కలయిక తర్వాత యోని సాగుదలలో మార్పు వస్తుంది. కలయిక సమయంలో మరింత వదులుగా, కలయికకు సులవయ్యేలా యోనిలో మార్పు వస్తుంది. ఇవన్నీ శృంగారం కోసం శరీరం సిద్ధం చేసే మార్పులు.

4. నొప్పి రావచ్చు:

అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్‌స్టేట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ప్రకారం దాదాపు 75 శాతం మహిళల్లో శృంగారం తర్వాత నొప్పి ఉంటుంది. దానికి అనేక కారణాలున్నాయి. హైమన్ పొర చిరగడం, సాగడం వల్ల ఈ నొప్పి రావచ్చు. యోనిలో తేమ లేకుండా పొడిగా ఉండటమూ కారణమే. అలాగే కొందరిలో శృంగారం అంటే భయం వల్ల యోని కండరాలు బిగుతుగా మారతాయి. దాంతో కలయిక సమయంలో నొప్పి మరింత ఎక్కువుండొచ్చు.

5. రక్త స్రావం:

కెనెడీయన్ మెడికల్ అసోసియన్ జర్నల్ ప్రకారం 0.7 నుంచి 9 శాతం మహిళల్లో మొదటి సారి సెక్స్ తర్వాత బ్లీడింగ్ కనిపిస్తుందని తేలింది. కానీ ఇది సాధారణమైన విషయం. హైమెన్ పొర దెబ్బతినడం కూడా దీనికి కారణం. యోని ముఖ ద్వారంలో హైమెన్ పొర ఉంటుంది.

6. మంట రావచ్చు:

మొదటిసారి కలయిక తర్వాత యోనిలో మంట రావచ్చు. శృంగారం తర్వాత వెంటనే బాత్రూమ్ వెళ్లాలి అనిపిస్తుంది చాలామందికి. మొదటి సారి యోని కండరాల్లో వచ్చే సంకోచం వల్ల ఈ మంట వస్తుంది. ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరికి ఈ సమస్య వస్తుంది. కానీ దీర్ఘకాలం మాత్రం ఈ మంట ఉంటే ఏదైనా సమస్య ఉన్నట్లే లెక్క.

7. దురద:

కాండోమ్స్ వాడకం వల్ల కొంతమందిలో కలయిక తర్వాత దురద వస్తుంది. కాండోమ్ మెటీరియల్ వల్ల ఈ అలర్జీ రావచ్చు. లేదంటే ఏదైనా లూబ్రికెంట్ వాడినా కూడా దురద అనేది సహజంగానే ఉంటుంది. అవి మీకు నప్పుతున్నాయో లేదో గమనించుకోవాలి. లూబ్రికెంట్ల వల్ల సెక్స్ సమయంలో నొప్పి తగ్గుతుంది. ఇవి యోని దగ్గర ఉండే పొడితత్వాన్ని తగ్గిస్తాయి. కానీ మీకు నప్పే లూబ్రికెంట్ ఎంచుకోవడం ముఖ్యం.

8. ఇన్ఫెక్షన్లు:

కలయిక సమయంలో మూత్రనాళంలోకి బ్యాక్టీరియా ప్రవేశించే అవకాశాలుంటాయి. దీంతో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఈ ఇన్ఫెక్షన్ వల్ల దురద, మంట వస్తాయి. కొంతమందిలో మూత్రంలో రక్తం కూడా రావచ్చు.

 

టాపిక్