Y Chromosome: వై క్రోమోజోములు అంటే ఏమిటి? అవి తగ్గడం వల్ల మగ పిల్లలు భవిష్యత్తులో పుట్టడం కష్టమా?-what are y chromosomes does decreasing them make it harder to have boys ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Y Chromosome: వై క్రోమోజోములు అంటే ఏమిటి? అవి తగ్గడం వల్ల మగ పిల్లలు భవిష్యత్తులో పుట్టడం కష్టమా?

Y Chromosome: వై క్రోమోజోములు అంటే ఏమిటి? అవి తగ్గడం వల్ల మగ పిల్లలు భవిష్యత్తులో పుట్టడం కష్టమా?

Haritha Chappa HT Telugu
Aug 29, 2024 07:30 AM IST

Y Chromosome: వై క్రోమోజోమ్ క్రమంగా క్షీణిస్తున్నట్టు ఒక కొత్త అధ్యయనంలో తెలిసింది. దీంతో భవిష్యత్తులో మగపిల్లలు పుట్టారనే వార్త వైరల్ అవుతోంది. అసలు వై క్రోమోజోమ్ ఏమిటో? తెలుసుకోండి.

వై క్రోమోజోమ్ అంటే ఏమిటి?
వై క్రోమోజోమ్ అంటే ఏమిటి?

పెళ్లయిన ప్రతిజంట పండంటి బిడ్డ కావాలని కోరుకుంటారు. కొందరు ఆడబిడ్డ కావాలని కోరుకుంటే, మరికొందరు మగబిడ్డ కావాలనుకుంటారు. ప్రతి ఇంట్లో ఒక బాబు, పాప ఉంటేనే సంతోషమని, అది సంపూర్ణ కుటుంబం అని భావించేవాళ్లు కూడా ఉన్నారు. ఇప్పుడు మగ పిల్లలు పుడుతున్నారు. కానీ భవిష్యత్తులో మాత్రం మగపిల్లలు పుట్టే సంఖ్య తగ్గిపోతుందట.

మగబిడ్డను నిర్ణయించేది క్రోమోజోమ్‌లే

గర్భం ధరించగానే మగబిడ్డ లేక ఆడ బిడ్డ అన్న చర్చ నడుస్తూనే ఉంటుంది. ఏ బిడ్డ పుట్టినా కూడా ఆమె లింగాన్ని నిర్ణయించేసి తల్లి కాదు, తండ్రి. తండ్రి నుంచి వచ్చే క్రోమో‌జోమ్‌లపై బాబు లేదా పాప అన్నది ఆధారపడి ఉంటుంది. మహిళల్లో ఎక్స్ క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. కానీ పురుషుల్లో మాత్రం X, Y అనే రెండు రకాల క్రోమోజోములు ఉంటాయి. భర్త నుంచి X క్రోమోజోమ్ భార్యను చేరితే… ఆమెలో ఉన్న ఎక్స్ క్రోమోజోముతో కలిసి ఆడపిల్ల పుడుతుంది. అదే భర్త నుంచి వై క్రోమోజోమ్ భార్యను చేరితే… X,Y క్రోమోజోములు కలిసి అబ్బాయి పుడతాడు. అయితే మగవారిలో Y క్రోమోజోములు తగ్గిపోయే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో ఆడపిల్లలు మాత్రమే భూమిపై పుట్టే పరిస్థితి ఉండొచ్చని ఇటీవల ఓ అధ్యయనంలో వెల్లడైంది.

Y క్రోమోజోమ్ అంటే ఏమిటి?

మహిళల శరీరంలో రెండు ఎక్స్ క్రోమోజోములు ఉండగా, పురుషులకు ఒక ఎక్స్, ఒక వై క్రోమోజోములు ఉంటాయి. పురుషుల లింగాన్ని నిర్ణయించడంలో వై క్రోమోజోమ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. Y క్రోమోజోమ్ లో మగపిల్లాడి ఎదుగుదలను నియంత్రించే కొన్ని జన్యువులు ఉంటాయి. ఈ కారణంగా పురుషుల్లో ప్రత్యేక శారీరక లక్షణాలు ఏర్పడతాయి.

పురుషుల సంఖ్య తగ్గడాన్ని సూచిస్తూ అధ్యయన నివేదిక ఏం చెబుతోంది. నివేదిక ప్రకారం, వై క్రోమోజోమ్ ఇప్పుడు పురుషులలో తగ్గుతోంది లేదా బలహీనంగా మారుతోంది. కొత్త పరిశోధన ప్రకారం, గత 166 మిలియన్ సంవత్సరాలలో, వై క్రోమోజోమ్ నుండి సుమారు 900 క్రియాశీల జన్యువులలో 55 ఉన్నాయి. 11 మిలియన్ సంవత్సరాలలో, వై క్రోమోజోమ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని నమ్ముతారు. ఇది శాస్త్రవేత్తలలో చర్చకు దారితీసింది, కొంతమంది వై క్రోమోజోమ్ నిరవధికంగా ఉంటుందని చెప్పారు, మరికొందరు కొన్ని వేల సంవత్సరాలలో కనుమరుగవుతుందని నమ్ముతారు.

ప్రముఖ జెనెటిక్స్ శాస్త్రవేత్త జెన్నిఫర్ మార్షల్ గ్రేవ్స్ కొత్త అధ్యయనానికి నాయకత్వం వహించారు. ఆ అధ్యయనం ప్రకారం మగవారిలో వై క్రోమోజోమ్ క్షీణిస్తూ వస్తున్నట్టు గుర్తించారు. ఇది మగ సంతానంపై తీవ్ర ప్రభావం పడుతుంది. జపాన్ కు చెందిన ఎలుకల జాతిలో చేసిన ప్రయోగంలో ఈ ఫలితం తెలిసింది. ఎలుకల జాతిలో వై క్రోమోజోమ్ క్రమంగా క్షీణించి మాయమైపోయింది. దీంతో ఎలుకల్లో కొత్త జన్యువు పుట్టింది.అలాగే మనుషుల్లో కూడా వై క్రోమోజోమ్ అంతర్ధానమైనా మరో కొత్త జన్యువు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు శాస్త్రవేత్తలు.

Y క్రోమోజోములో 1438 జన్యువులు ఉంటాయి. కానీ కాలక్రమేణా ఇప్పటికీ వాటి సంఖ్య దారుణంగా పడిపోయింది. ప్రస్తుతం 45 జన్యువులు మాత్రమే ఉన్నాయి. అలా ఆ 45 జన్యులు పోవడానికి కొన్ని వేల ఏళ్లు పడుతుంది. ఆ తరువాత మానవ జాతిలో అందరూ ఆడపిల్లలే ఉంటారేమో.

ఇలా మగ క్రోమోజోములు తగ్గడం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ కొత్త జన్యువులు పుట్టే అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

టాపిక్