Mouth ulcers: నోట్లో పొక్కులు వస్తే ఇవి నమలండి.. వెంటనే తగ్గిపోతాయి-what are the reasons and home remedies for mouth ulcers ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mouth Ulcers: నోట్లో పొక్కులు వస్తే ఇవి నమలండి.. వెంటనే తగ్గిపోతాయి

Mouth ulcers: నోట్లో పొక్కులు వస్తే ఇవి నమలండి.. వెంటనే తగ్గిపోతాయి

Koutik Pranaya Sree HT Telugu
Sep 15, 2024 07:00 PM IST

Mouth ulcers: మౌత్ అల్సర్స్ కు కారణాలు: నోటి పూతలకు అనేక కారణాలు ఉంటాయి. కానీ చిన్న బొబ్బలు తరచుగా విడుదల కావడానికి ఈ కారణాలు కారణమవుతాయి.

నోట్లో పొక్కులకు కారణాలు, పరిష్కాారాలు
నోట్లో పొక్కులకు కారణాలు, పరిష్కాారాలు (shutterstock)

నోట్లో పొక్కు వస్తే చాలా కష్టంగా ఉంటుంది. కొందరికి తరచూ నోటిలో బొబ్బలు లేదా పొక్కులు వస్తుంటాయి. దీన్నే నోటి పూత అనీ అంటారు. తరచూ వస్తుంటే మాత్రం కారణం కనుక్కోవాల్సిందే. పళ్లతో పొరపాటున కొరుక్కోవడం లేదంటే వేడి టీ, కాఫీ తాగడం వల్ల నోట్లో ఇలా పొక్కులు వస్తాయి. కానీ ఏ కారణమూ లేకుండా వస్తుంటే మాత్రం నివారణ మార్గాలు తెల్సుకోవాల్సిందే.

చిన్న పొక్కులు:

ఈ పొక్కులు తెలుపు లేదా లేత పసుపు రంగులో ఉంటాయి. వాటి చుట్టూ చర్మం ఎరుపు రంగులోకి మారుతుంది. వీటితో చాలా నొప్పిగా ఉంటుంది. కారం ఉన్న ఆహారాలు తినలేం. వేడిగా ఏమీ తాగలేం. కానీ ఒకటి నుండి రెండు వారాల్లో పూర్తిగా నయం అవుతాయి.

చిన్న పొక్కులు రావడానికి కారణాలు:

  1. అధిక ఒత్తిడి
  2. అనారోగ్యం కారణంగా బలహీనమైన రోగనిరోధక శక్తి
  3. మహిళల్లో పీరియడ్స్ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల కూడా పొక్కులు రావచ్చు.
  4. విటమిన్ బి 12 లోపం వల్ల
  5. మలబద్ధకం, జీర్ణవ్యవస్థలో వాపు సమస్యలు, పేలవమైన జీర్ణక్రియ వల్ల
  6. పరిశుభ్రంగా లేని నీళ్లు తాగడం వల్ల
  7. ధూమపానం వల్ల

ఈ కారణాల వల్ల నోట్లో పొక్కులు రావచ్చు.

నోటి పూత తగ్గించే ఇంటి చిట్కాలు:

  • కలబంద రసం పొట్టను చల్లబరిచి వేడిని తగ్గిస్తుంది. దీనివల్ల పొక్కులు త్వరగా నయం అవుతాయి. కలబంద రసాన్ని రోజూ తాగితే ఫలితం ఉంటుంది.
  • ఎండు కొబ్బరి ముక్కలను మెత్తగా నమిలి నోట్లో కాసేపు పెట్టుకుని మింగేయాలి. ఇలా చేయడం వల్ల సాధారణ పొక్కుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • వేయించిన, నూనె, కారంగా ఉండే ఆహారాన్ని తక్కువగా తినండి
  • అతిమధురం పొడిని తేనెలో కలిపి తినండి. ఈ ఆయుర్వేద మందుతో బొబ్బలు కూడా త్వరగా నయమవుతాయి.
  • రోజంతా ఎక్కువ నీటిని తాగండి.
  • గోరువెచ్చని నీటిలో పసుపు వేసి పుక్కిలించాలి. దీంతో కూడా ఉపశమనం దొరుకుతుంది.
  • నోటిలో బొబ్బలు వస్తే, యాలకులు నమలండి. పొక్కులు తగ్గిపోతాయి.

పెద్ద పొక్కులు:

ఇవి రెండు నుంచి మూడు సెంటీమీటర్ల పెద్ద బొబ్బలుగా ఉంటాయి. ఇవి తగ్గడానికి ఒక నెల లేదా అంతకంటే ఎక్కువ సమయం పడుతుంది.ఇవి కొన్నిసార్లు ధూమపానం వల్ల వస్తాయి. ఇవి కొన్నిసార్లు ప్రమాదకర వ్యాధులకూ సంకేతాలు కావచ్చు. ఈ సమస్య ఉంటే వైద్యుల్ని సంప్రదించాలి.