యాలకులు సుగంధ రుచిని కలిగి ఉంటుంది. కేవలం మసాలా దినుసులా మాత్రమే కాకుండా కొలెస్ట్రాల్ నియంత్రణ, జీర్ణ క్రియను ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుంది.  

pixabay

By Bandaru Satyaprasad
Aug 06, 2024

Hindustan Times
Telugu

ఆహార రుచిని పెంచుతుంది - ఛాయ్ లేదా బిర్యానీ ఏ ఆహారం అయినా యాలకులు దాని రుచిని పెంచుతుంది. రుచితో పాటు వివిధ రూపాల్లో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.  

pexels

కొలెస్ట్రాల్ నిర్వహణ - ఇలాచి కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడంలో సమర్థవంతం పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. యాలకుల్లోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రక్తంలోని కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి.  

pexels

యాంటీ ఆక్సిడెంట్లు - యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఇలాచి శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.  

pixabay

యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు - శరీరంలో వాపు సాధారణ చర్య, ఇలాచి యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. శరీరంలో మంట, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.  

pixabay

జీర్ణ ప్రయోజనాలు - యాలకులు జీర్ణ ప్రయోజనాలు కలిగి ఉంటాయి. జీర్ణ క్రియకు కీలకమైన ఎంజైమ్ ల విడుదలకు సహాయపడతాయి. అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనానికి సహాయపడుతుంది.  

pixabay

గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి ఉపశమనం - ఇలాచి గ్యాస్ట్రిక్ అసౌకర్యం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇలాచిలోని కార్మినేటిక్ లక్షణాలు పొట్ట సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.  

pexels

నోటి సమస్యలు - ఇలాచి నోటి సమస్యలను తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ మైక్రోబయల్ లక్షణాలు నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. నోటి దుర్వాసన, కావిటీస్ ను నివారిస్తుంది.  

pixabay

 శ్వాసకోశ ఆరోగ్యం - యాలకులలోని సుగంధ సమ్మేళనాలు శ్వాసకోశ ఆరోగ్యానికి సహాయపడతాయి. యాలకుల సువాసనను పీల్చడం ద్వారా శ్వాస సమస్యలు తగ్గుతాయి. జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం అందిస్తుంది. 

pixabay

షుగర్ లెవల్స్ నియంత్రణ - రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో యాలకులు సహాయపడతాయి. 

pixabay

ఒత్తిడి ఉపశమనం - ఇలాచి సువాసన, రుచి ఒత్తిడిని నియంత్రించే లక్షణాలు కలిగి ఉంటుంది. టీలలో ఉపయోగించినా లేదా అరోమాథెరపీలో వాడినా ఇలాచి మానసిక ప్రశాంతతకు సహాయపడుతుంది.  

pixabay

హాట్ షోతో అట్రాక్ట్ చేసిన బిగ్ బాస్ బ్యూటి దీప్తి సునైనా

Instagram