Mint Leave Health Benefits : పుదీనా ఆకులతో ఈ 10 అద్భుత ప్రయోజనాలు తెలుసా?
Mint Leave Health Benefits : పుదీనా ఆకులు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణ క్రియ సంబంధిత సమస్యలకు ఇది అద్భుత ఔషధం. అయితే దీనివల్ల కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
Mint Leave Health Benefits : తెలుగింటి ప్రత్యేక వంటకాల్లో పుదీనా ఉండి తీరాల్సిందే. ఇక తేనీటి నుంచి మొదలు ఆల్కహాల్ వరకూ అనేక పానీయాల్లో దీనిని వినియోగిస్తారు. చాలా సలాడ్స్‌లో, డెజర్ట్స్‌లో కూడా పుదీనా వాడుతారు. ఇక చాలా మంది ఫేవరైట్ అయిన బిర్యానీలో పుదీనా బాగా వాడుతారు. నాన్ వెజ్ వంటకాల్లో చాలా వరకు పుదీనా వాడతారు. ఇంత ప్రాచుర్యం పొందిన ఈ పుదీనాలో ఏముంది? పుదీనా అంటే అంత స్పెషల్. ముందుగా పుదీనా ఆకుల్లో ఉండే పోషకాలను గమనిద్దాం.
ప్రతి 100 గ్రాముల పుదీనాలో ఉండే పోషకాలు
* క్యాలరీలు 70
* టోటల్ ఫ్యాట్ - 0.9 గ్రాములు
* శాచ్యురేటెడ్ ఫ్యాట్ -- 0.2 గ్రాములు
* సోడియం – 31 మి.గ్రా.
* పొటాషియం – 569 మి.గ్రా.
* కార్బొహైడ్రేట్లు -- 15 గ్రా.
* డైటరీ ఫైబర్ – 8 గ్రాములు
* ప్రోటీన్ – 3.8 గ్రాములు
ఇక ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సీ, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బీ 6, మాంగనీస్, ఫోలేట్ కూడా గణనీయంగా ఉంటాయి.
* కంటి చూపు బాగుండేందుకు తోడ్పడే విటమిన్ ఏ పుదీనాలో బాగా లభిస్తున్నందున దీనిని మీరోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
* పుదీనాలో ఉండే యాంటాక్సైడ్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మీ శరీరాన్ని కాపాడుతాయి. ఇతర ఆకులు, మూలికల కంటే ఈ విషయంలో ఇది బాగా పనిచేస్తుంది.
* పుదీనాలో ఉండే మెంథాల్ అనే మిశ్రమం ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ (ఐబీఎస్) నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. జీర్ణ వ్యవస్థ అదుపు తప్పి ఐబీఎస్ అనే సమస్య ఏర్పడుతుంది. కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, అకస్మాత్తుగా నొప్పితో విరేచనం అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఒత్తిడి కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. దీనికి పుదీనా మంచి ఉపశమనంగా పలు అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే పచ్చి పుదీనా ఆకు కంటే పుదీనా ఆయిల్ ఉండే క్యాప్సూల్స్ బాగా పనిచేస్తాయని ఆ అధ్యయనాల్లో తేలింది.
* పుదీనా ఆకులు జీర్ణ వ్యవస్థను బాగు చేస్తాయి. ముఖ్యంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, చాతీలో మంట, ఎసిడిటీ వంటి వాటికి ఇది హోమ్ రెమెడీ. భోజనంలో పుదీనా గానీ, మింట్ ఆయిల్ గానీ ఉంటే ఈ జీర్ణ క్రియ సమస్యలన్నీ దారికొస్తాయి. బిర్యానీ, మాంసాహారం వంటి మసాల ఫుడ్‌లో పుదీనా కలపడం వల్ల తేలిగ్గా జీర్ణమవుతాయి.
* చిన్నారులకు చనుబాలు పట్టే తల్లులు చనుమొనలు పగిలినప్పుడు, నొప్పిగా ఉన్నప్పుడు పుదీనా రసం రాస్తే నయం అవుతాయని అధ్యయనాల్లో వెల్లడైంది.
* జలుబు నుంచి పుదీనా బాగా ఉపశమనం ఇస్తుంది. ముక్కు నుంచి శ్వాస ఆడలేని పరిస్థితిలో పుదీనా డీకంజెస్టెంట్‌గా పనిచేస్తుంది. శ్వాసకోశ వ్యాధులు ఉన్నప్పుడు పుదీనా వాసన పీల్చడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.
* నోట్లో ఉన్న బ్యాక్టీరియాను మట్టుబెట్టి దుర్వాసనను అరికట్టడంలో పుదీనా బాగా పనిచేస్తుంది.
* పుదీనాలో ఉండే విటమిన్లు, యాంటాక్సిడెంట్ల మీ రోగనిరోధకతను పెంపొందిస్తాయి.
* పుదీనా ఆకుల్లో ఉండే సెలిసైక్లిక్ యాసిడ్, విటమిన్ ఏ కారణంగా మొటిమలను నియంత్రించగలుగుతుంది. ఇదొక క్లెన్సర్‌గా, మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది.
* పుదీనా ఆకుల్లో ఉండే కెరోటీన్, యాంటాక్సిడంట్లు మీ జుట్టు పెరిగేలా సాయపడడంతోపాటు, జుట్టు రాలకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు పేలను, చుండ్రును తొలగిస్తాయి.
సంబంధిత కథనం