Veg Dum Biryani Recipe : వీకెండ్ స్పెషల్.. వెజ్ దమ్ బిర్యానీ చేసేద్దామా?
Veg Dum Biryani Recipe : వీకెండ్ వచ్చేసింది. కాబట్టి చాలా మంది కాస్త ఆలస్యంగా నిద్ర లేచేందుకు చూస్తుంటారు. కాబట్టి వారి బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ అయిపోతుంది. అయితే చాలా మంది శనివారం నాన్ వెజ్ తినరు. కాబట్టి.. మీ బ్రంచ్ కోసం హ్యాపీగా వెజ్ దమ్ బిర్యానీ చేసేసుకోండి. హ్యాపీగా లాగించేయండి.
Veg Dum Biryani Recipe : మీరు కూడా బిర్యానీ లవర్ అయితే.. ఈ శనివారం.. మీరు వెజ్ బిర్యానీతో స్టార్ట్ చేసేయండి. నాన్ వెజ్ కూడా తినేవాళ్లు అయితే.. నాన్ వెజ్ కర్రీ చేసుకుని.. ఈ వెజ్ దమ్ బిర్యానితో వీకెండ్‌ని గడిపేయొచ్చు. అయితే మీకు టేస్ట్నిచ్చే.. చక్కని వెజ్ దమ్ బిర్యానీని ఎలా చేయాలో.. దానికి ఏమేమి కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
* కారం - 1 టీస్పూన్
* పెప్పర్ - 1 టీస్పూన్
* బిర్యానీ మసాలా - 1 టేబుల్ స్పూన్
* ఉప్పు - రుచి ప్రకారం
* కాలీఫ్లవర్ - 1
* బఠాణీ - అరకప్పు
* ఉల్లిపాయ - 1
* క్యారెట్లు - 2
* బంగాళదుంపలు - 2
* బే ఆకు - 1
* దాల్చిన చెక్క -1
* సోంపు - చిటికెడు
* ఏలకులు - 2
* బియ్యం - అరకప్పు
* పెరుగు - కొంచెం
వెజ్ దమ్ బిర్యానీ తయారీ విధానం
ఒక పాత్రను తీసుకుని స్టవ్ వెలిగించి దానిపై పెట్టండి. దానిలో నూనె వేయండి. తరిగిన ఉల్లిపాయలు వేసి.. వాటి రంగు మారేవరకు వేయించండి. ఈ బ్రౌన్ ఆనియన్స్ పక్కన పెట్టి.. ఆ గిన్నెలో క్యారెట్, క్యాలీఫ్లవర్, బీన్స్, బఠానీలు, బంగాళాదుంపలు వేసి బాగా కలపండి. దానిలో కారం, పెప్పర్, ఉప్పు, బిర్యానీ మసాలా వేసి కలపండి. ఇప్పుడు కొంచెం పెరుగు వేసి కాసేపు ఉడికించాలి. ఇప్పుడు 80 శాతం వండిన అన్నం తీసుకుని.. ఒక గిన్నెలో ఒక పొరను వేయండి. దానిపై ఈ వెజిటెబుల్ బిర్యానీ మిక్స్ వేయండి. మళ్లీ దానిపై అన్నం వేసి.. మళ్లీ కూరగాయల మిశ్రమం వేయండి. ఇలా వేస్తూ.. చివరగా డ్రై ఫ్రూట్స్, బ్రౌన్ ఆనియన్స్‌తో అలంకరించి.. ఐదు నిమిషాలు మగ్గనివ్వండి. అంతే టేస్టీ.. టేస్టీ.. వెజ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే.
సంబంధిత కథనం