Eggless Banana Cake Recipe : వీకెండ్ స్పెషల్ ఎగ్‌లెస్ బనానా కేక్.. ఇలా చేసేయండి-weekend special recipe is eggless banana cake here is the making process ,లైఫ్‌స్టైల్ న్యూస్
Telugu News  /  Lifestyle  /  Weekend Special Recipe Is Eggless Banana Cake Here Is The Making Process

Eggless Banana Cake Recipe : వీకెండ్ స్పెషల్ ఎగ్‌లెస్ బనానా కేక్.. ఇలా చేసేయండి

ఎగ్​లెస్ బనానా కేక్
ఎగ్​లెస్ బనానా కేక్

Eggless Banana Cake Recipe : మీ వీకెండ్​ని మరింత స్పెషల్​ చేసేందుకు మీకు ఎగ్​లెస్ బనానా కేక్ బాగా హెల్ప్ చేస్తుంది. పైగా దీనిని చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే ఈజీగా తయారు చేయవచ్చు. మరి దీనిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Eggless Banana Cake Recipe : చాలా మంది కేక్​ అనగానే ఎగ్ ఉంటుందేమో అని భయపడతారు. అలాంటి వారికోసమే ఈ ఎగ్​ లెస్​ బనానా కేక్. కాబట్టి దీనిని అందరూ హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. ఇది మీ వీకెండ్​ని మరింత స్పెషల్ చేస్తుంది. అంతేకాకుండా.. మీ స్వీట్​ క్రావింగ్స్​కి ఎలాగో వీకెండ్ బ్రేక్ ఇస్తారు కాబట్టి.. ఇది కచ్చితంగా మీకు మంచి స్వీట్ డిజెర్ట్ అవుతుంది. మరి దీనిని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

కావాల్సిన పదార్థాలు

* పిండి - 300 గ్రాములు

* బేకింగ్ పౌడర్ - 12 గ్రాములు

* దాల్చిన చెక్క పొడి - 5 గ్రాములు

* వాల్‌నట్‌లు - 100 గ్రాములు

* అరటిపండు - 4

* వెన్న - 70 గ్రాములు

* పెరుగు - 100 మి.లీ

* పాలు - 150 మి.లీ

ఎగ్లెస్ బనానా కేక్ తయారీ విధానం

ఓ గిన్నెలో పిండి, బేకింగ్ పౌడర్‌ను జల్లెడ పట్టండి. దానిలో దాల్చినచెక్క పొడి, వాల్‌నట్‌లను జోడించండి. ఒక గిన్నెలో కరిగించిన వెన్నతో పాటు.. అరటిపండ్లను పూర్తిగా మాష్ చేయండి. అరటిపండు గుజ్జులో పెరుగు కలపండి. ఈ మిశ్రమంలో క్రమంగా పాలు వేస్తూ బాగా కలపండి. ఇది పిండిని మృదువుగా, ముద్దలు లేకుండా చేస్తుంది.

ఈ బనానా మిక్స్‌ను వెన్నతో గ్రీజు చేసిన ట్రేలో పోయాలి. దీనిని 170°C వద్ద ముందుగా వేడిచేసిన ఓవెన్‌లో 50-60 నిమిషాలు బంగారు గోధుమ రంగు వచ్చేవరకు బేక్ చేయాలి. బేక్ చేసిన తర్వాత చల్లార్చి.. పైన ఐసింగ్ షుగర్ చల్లి సర్వ్ చేసేయడమే. ఇది మీ వెకెండ్​ని కచ్చితంగా స్పెషల్ చేస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్