Wednesday Motivation : విజయం సాధించడం గొప్ప విషయం కాదు.. విజయాన్ని నిలబెట్టుకోవడం గొప్ప విషయం
Wednesday Motivation In Telugu : జీవితంలో విజయం సాధించాలంటే చాలా కష్టపడాలి. అందుకు ప్రతీ రోజు ముఖ్యమైనదే. ఇందుకోసం మీరు ఎంచుకునే జీవనశైలి కూడా ముఖ్యం. అయితే రోజూ ఉదయాన్నే లేవగానే మీ ఆలోచనలు పాజిటివ్‌గా ఉండాలి. అలాంటి కొన్ని మాటలు ఎక్కడ ఉన్నాయి.
జీవితం ఎవరినీ అంత ఈజీగా వదిలిపెట్టదు. అందరి సరదా తీర్చేస్తుంది.. అయితే దాన్ని కంట్రోల్‌కి తెచ్చుకునేందుకు మనం చేసే పోరాటం ముఖ్యమైనది. అందుకోసం ప్రతీ రోజు కష్టపడాలి. ప్రతీ క్షణం ఆలోచించాలి. మెదడులోని రక్తాన్ని ఎరువుగా వాడి కొత్తగా ముందుకు వెళ్లాలి. అయితే రోజును మనం పాజిటివ్‌గా మెుదలుపెడితే సగం పని అయిపోయినట్టే. నెగెటివ్‌గా రోజును మెుదలుపెడితే మీ అంత దురదృష్టవంతులు ఉండరు. ఇందుకోసం రోజూ కొన్ని పాజిటివ్ మాటలు వినాలి. దానికి తగ్గట్టుగా ముందుకు వెళ్లాలి. మీరు షేర్ చేసేందుకు కొన్ని కోట్స్ ఇక్కడ ఉన్నాయి. మీ ప్రియమైనవారికి షేర్ చేసి.. వారి ఆనందంలోనూ మీ బాగమవ్వండి..
మీరు కోరుకున్నది మీకు లభించకపోతే, మీరు ఆలోచించగలిగే దానికంటే మంచిదాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని మీరు అర్థం చేసుకోవాలి.
మీరు జీవితంలో ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. క్లిష్ట పరిస్థితుల్లో మీ చేయి పట్టుకుని, మీకు సహాయం చేసినవారిని గుర్తుపెట్టుకోవాలి. మిమ్మల్ని పైకి లేపిన వారి చేతిని ఎప్పటికీ వదలకూడదు.
పోగొట్టుకున్న దాన్ని మరచిపోయి అనుకున్నది సాధించేందుకు కష్టపడండి..
జీవితంలో విజయం సాధించడం పెద్ద విషయం కాదు.. కానీ విజయాన్ని నిలబెట్టుకోవడం పెద్ద విషయం.
ఎవరైనా మీకు భయపడి మిమ్మల్ని గౌరవిస్తే అది గౌరవం కిందకు రాదు.
మీరు జీవితంలో సంతోషంగా ఉండాలనుకుంటే, ఎవరినీ అర్థం చేసుకోకుండా, ఎవరిపైనా పూర్తి అంచనాలు లేకుండా ఉండండి..
మిమ్మల్ని ఎప్పుడూ ఎవరితోనూ పోల్చుకోవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరి విధి భిన్నంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి వివిధ ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయి. అందరి దారి వేరు. మీ గమ్యానికి వెళ్లే దారి కూడా వేరుగానే ఉంటుంది.
సంబంధాలు, నమ్మకం - ఇది జీవితానికి ఆధారం.
అత్యంత ముఖ్యమైన విషయం విశ్వాసం, ఆ విశ్వాసాన్ని వాస్తవంగా మార్చగల సామర్థ్యం కూడా ముఖ్యమైనది.
విజయం ఒక్కరోజులో జరగదు. మీరు అంకితభావంతో, ఏక దృష్టితో ఉండాలి. శ్రమకు ప్రత్యామ్నాయం లేదు.
జీవితంలో కొన్ని రిస్క్‌లు తీసుకోండి. తరచుగా రిస్క్ తీసుకునే వారు చరిత్రను మార్చి లక్షలాది ప్రజలకు ఆదర్శంగా ఉంటారు. కంఫర్ట్ జోన్‌లో ఉన్నవారు అక్కడ నుంచి కదల్లేరు.
ఎల్లప్పుడూ ఒక విషయం గుర్తుంచుకోవాలి, మీరు డబ్బు కోసం పరిగెత్తకూడదు, అద్భుతమైన జ్ఞాపకాల కోసం పరిగెత్తాలి. అప్పుడే విజయం మీ వైపు వస్తుంది.
ఇబ్బందులకు భయపడకండి, మీ ఆశావాద, సానుకూల దృక్పథంతో నిర్ణయాలు తీసుకోండి.. లక్ష్యం వైపు వెళ్లండి.
చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోండి, మీ బలమైన సంకల్ప శక్తితో వాటిని సాధించండి. ఈ చిన్న లక్ష్యాలు మీకు పెద్ద లక్ష్యాలను అందిస్తాయి.
కష్ట సమయాలల్లో మీ సహనాన్ని ఎన్నడూ బలహీనపరచవద్దు. ఎందుకంటే సహనమే మిమ్మల్ని ముందుకు నడిపే ఇంధనం..