Alcohol: ఆల్కహాల్ మానేయాలనుకుంటున్నారా? ఒకేసారి మానేయడం ప్రమాదం ఇలా ప్లాన్ చేసుకోండి-want to quit alcohol risk of quitting suddenly plan this way ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Alcohol: ఆల్కహాల్ మానేయాలనుకుంటున్నారా? ఒకేసారి మానేయడం ప్రమాదం ఇలా ప్లాన్ చేసుకోండి

Alcohol: ఆల్కహాల్ మానేయాలనుకుంటున్నారా? ఒకేసారి మానేయడం ప్రమాదం ఇలా ప్లాన్ చేసుకోండి

Haritha Chappa HT Telugu
Oct 24, 2024 02:00 PM IST

Alcohol: మద్యపానం మానేయాలని ఆలోచిస్తున్నారా? ఒకేసారి మానేయడం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి మద్యపానం మానేయడానికి ఇలా ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళండి.

ఆల్కహాల్ ఎలా మానేయాలి?
ఆల్కహాల్ ఎలా మానేయాలి? (Pixabay)

ఆల్కహాల్ అలవాటు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని ఆందోళన చెందుతున్నారా? అందుకే దాన్ని మీరు మానేయాలనుకుంటున్నారా? ఒకేసారి మానేస్తే మీ శరీరం తట్టుకోలేదు. దాన్ని అంచెలంచలుగా మానేయాలి. ఆల్కహాల్ మానేయాలి అనుకునేవారు ప్లాన్ ప్రకారం ముందుకు సాగడం చాలా ముఖ్యం. ఆల్కహాల్ వ్యసనం ఆరోగ్యానికి ఎంతో హానికరం. ఆ వ్యసనాన్ని హఠాత్తుగా మానేయడం కూడా ప్రమాదకరమే.

ఆల్కహాల్ ఎందుకు మానేయాలి?

ఆల్కహాల్‌ను ప్రతిరోజూ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. అలాగే ఊబకాయం బారిన పడతారు. మూత్రపిండాలు ఫెయిల్ అవ్వడం, క్యాన్సర్ బారిన పడడం, గుండె జబ్బులు వంటి సమస్యలు వస్తాయి. అందుకే ఆల్కహాల్ ను ఎంత త్వరగా మానేస్తే అంత మంచిది. అలా అని హఠాత్తుగా ఆల్కహాల్ తాగడం మానేయడం కూడా సరైన నిర్ణయం కాదు.

కొన్నేళ్లుగా ఆల్కహాల్‌కు వ్యసనపరుడిగా మారిన వ్యక్తి. దాన్ని అంచలంచెలుగా కాలక్రమేణా మానేయాలి. కానీ అకస్మాత్తుగా మారడం వల్ల శారీరకంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. మానసికంగా కూడా వారు సమతుల్యతను కోల్పోతారు. అసహనాన్ని పెంచుకుంటారు. కొన్నిసార్లు పిచ్చిపిచ్చిగా ప్రవర్తించే అవకాశం ఉంది. కాబట్టి ఆల్కహాల్ మానేయడానికి ఒక ప్లాన్ ప్రకారం ముందుకు సాగాలి. ఎలా ఆల్కహాల్ మానేయాలో వైద్యులు సూచిస్తున్నారు.

పరిమాణం తగ్గించండి

ప్రతిరోజూ మీరు ఎంత ఆల్కహాల్ తాగుతారో ఆ ఆల్కహాల్ లో సగం మాత్రమే మొదట తాగడం ప్రారంభించండి. ప్రతిరోజూ తాగే ఆల్కహాల్ పరిమాణాన్ని తగ్గిస్తూ రావాలి. అలాగే తాగుతున్నప్పుడు నెమ్మదిగా షిఫ్ట్ చేయాలి. ఒకేసారి తాగేయడం మంచి పద్ధతి కాదు.

ఆల్కహాల్ తాగేటప్పుడు అందులో ఉన్న ఆల్కహాల్ శాతాన్ని తగ్గించడానికి ఎక్కువగా సోడాను లేదా నీటిని కలపాల్సిన అవసరం ఉంది. అలాగే ఖాళీ పొట్టతో తాగకూడదు.

ఆల్కహాల్ తాగేటప్పుడు మీ చుట్టూ తాగుబోతులు లేకుండా చూసుకోండి. వారు మిమ్మల్ని ఆ వ్యసనం నుంచి బయట పడకుండా అడ్డుకుంటారు. ఆల్కహాల్ మానేయాలనుకున్నప్పుడు మీ చుట్టూ ఆ అలవాటు లేనివారు ఉండేలా చూడండి. వారిని చూసి మీలో కూడా ఉత్తేజం కలుగుతుంది.

ఒత్తిడిని తట్టుకోండి

ఆల్కహాల్ హఠాత్తుగా మానేయడం అంతా సులువు కాదు. ప్రతిరోజు తాగే అలవాటు ఉన్నవారు హఠాత్తుగా మానేస్తే తీవ్రమైన ఒత్తిడి బారిన పడతారు. ఆ కోరికను నియంత్రించుకోలేక ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి సంగీతం వినడం, వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం, తోటపని, వంటపని, పుస్తకాలు చదవడం వంటి పనులు ఆరంభించాలి. మిమ్మల్ని మీరు బిజీ చేసుకోవడం ద్వారా ఆల్కహాల్ ఆలోచనలు రాకుండా జాగ్రత్త పడాలి.

ఆల్కహాల్ అలవాటు మానేయాలనుకునేవారు ఆరోగ్యకరమైన, పుష్టికరమైన ఆహారాన్ని తినడం చాలా అవసరం. అలాగే శరీరంలో ఎలక్ట్రోలైట్ల సమతుల్యత కోల్పోకుండా కూడా చూసుకోవాలి.

మద్యపానాన్ని విజయవంతంగా మానేయాలనుకుంటే అనేక ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. ఎదురు దెబ్బలు తగులుతున్నా కూడా పట్టుదలగా ఆల్కహాల్ మానేయాలన్న నిర్ణయం పైనే మీరు ఉండాలి. దీనికి ఎక్కువ సమయం పట్టొచ్చు. కానీ చివరికి మీరు కచ్చితంగా మానేస్తారు. దీనికి మీ సంకల్పబలం చాలా ముఖ్.యం

ఆల్కహాల్ వ్యసనం నుండి బయటపడడానికి మీ ఇంట్లో వారి సాయం కూడా తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మద్దతు వల్ల మీరు త్వరగా ఆల్కహాల్ మత్తు నుండి బయటపడతారు.

Whats_app_banner