Baking Soda: వంట సోడాను వాడడం ఆరోగ్యానికి మంచిదేనా? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారు?-is using baking soda good for health what do nutritionists say ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Baking Soda: వంట సోడాను వాడడం ఆరోగ్యానికి మంచిదేనా? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారు?

Baking Soda: వంట సోడాను వాడడం ఆరోగ్యానికి మంచిదేనా? పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారు?

Haritha Chappa HT Telugu
Jul 09, 2024 09:30 AM IST

Baking Soda: బేకింగ్ సోడాను వంట సోడా అని పిలుచుకుంటారు. దీన్ని ఎన్నో రకాల వంటకాల్లో కలుపుతారు. పకోడీ, బజ్జీల తయారీలో వీటిని వాడతారు. అలాగే ఇడ్లీలు మెత్తగా వచ్చేందుకు కూడా వంటసోడా వాడతారు. వంటసోడా నిత్యం వాడడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

బేకింగ్ సోడా
బేకింగ్ సోడా (Pixabay)

నేటి వంటకాల్లో బేకింగ్ సోడా వాడకం బాగా పెరిగింది. బేకింగ్ సోడా ఆరోగ్యానికి మంచిదా? ప్రత్యామ్నాయంగా మరేదైనా ఉపయోగించవచ్చా? అనే సందేహాలు ఎంతో మందిలో వస్తాయి. ముఖ్యంగా పకోడీ, బజ్జీలు, పునుకుల వంటకాల్లో వంటసోడాను కలుపుతూ ఉంటారు. అలాగే ఇడ్లీ పిండిలో కూడా కొంతమంది కలుపుతూ ఉంటారు. ఇలా వంటసోడా కలపడం వల్ల బేకింగ్ సోడాను కలిపేవారు ఉన్నారు. దీని వల్ల ఇడ్లీలు సుతిమెత్తగా వస్తాయి. అయితే ఇలా అన్నింట్లోనూ తరచూ వంటసోడాను వినియోగించడం ఆరోగ్యకరమేనా?

బేకింగ్ సోడా అంటే…

బేకింగ్ సోడాను సోడియం కార్బొనేట్ అని అంటారు. ఇందులో సోడియం ఉంటుంది. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల పొట్ట ఉబ్బరం సమస్య పెరుగుతుంది. కాలేయ సమస్యలు ఉన్నవారు బేకింగ్ సోడాను తీసుకోవడం మానుకోవాలి. బేకింగ్ సోడాను అధికంగా వాడడం వల్ల గుండెల్లో మంట వంటివి వస్తాయి. ముఖ్యంగా అజీర్ణం వంటివి వస్తాయి.

బేకింగ్ సోడా తరచూ తినడం వల్ల దంతాల అనామెల్ దెబ్బతింటుంది. బేకింగ్ సోడాలో సోడియం అధికంగా ఉంటుంది. ఇది అధికంగా తింటే వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. మూర్ఛలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అధికంగా తింటే మూత్రపిండా వైఫల్యం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది గ్యాస్ ను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. చాలా మంది బేకింగ్ సోడాతో దంతాలు తోమడం వంటివి కొంతమంది చేస్తుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు.

బేకింగ్ సోడా అధికంగా వాడితేనే చెడు ప్రభావాలు కనిపిస్తాయి. కానీ మితంగా వాడితే వంట సోడా వల్ల కొన్ని మంచి ఫలితాలు జరుగుతాయి. దీనిలో యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు, యాంటీ ఫంగల్ లక్షణాలు, యాంటీ సెప్టిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. మొటిమలను వదిలించుకోవడానికి బేకింగ్ సోడాను ఉపయోగించుకోండి. ఒక స్పూను బేకింగ్ సోడాలో నీరు కలిపి పేస్టులా చేసి మొటిమలు ఉన్నచోట రాసుకోండి. రోజులో రెండు మూడు సార్లు అప్లై చేస్తే మొటిమలు పోతాయి.

సిల్కీ హెయిర్ కోసం బేకింగ్ సోడాను వినియోగించుకోవచ్చు. జిడ్డు జుట్టుతో బాధపడే వారు బేకింగ్ సోడాను నీళ్లలో కలిపి జుట్టును శుభ్రపరచుకోవడం వల్ల జుట్టు పట్టుకుచ్చుల్లా మెరుస్తూ ఉంటుంది. ఆహారంగా మాత్రం ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది.

చర్మం మెరుపును పెంచుకోవడం వల్ల వంట సోడా వినియోగించవచ్చు. రోజ్ వాటర్లో వంటసోడా వేసి పేస్టులా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. అయిదు నిమిషాల పాటూ ఉంచి తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మురికి, మృతకణాలు పోతాయి.

గోళ్లను శుభ్రపరచడానికి వంట సోడా వాడుకోవచ్చు. గోళ్లపై ఉన్న మరకలు, మురికి పోయేందుకు ఇది ఉపయోగపడుతుంది. నీటిలో బేకింగ్ సోడా కలిపి గోళ్లను ముంచి కాసేపు ఉంచాలి. అలా ఉంచితే గోళ్లు శుభ్రపడతాయి.

Whats_app_banner