Liver Cancer Symptoms : ఈ లక్షణాలను అస్సలు విస్మరించకూడదు.. కాలేయ క్యాన్సర్ కావొచ్చు-never ignore these symptoms in body it may liver cancer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Liver Cancer Symptoms : ఈ లక్షణాలను అస్సలు విస్మరించకూడదు.. కాలేయ క్యాన్సర్ కావొచ్చు

Liver Cancer Symptoms : ఈ లక్షణాలను అస్సలు విస్మరించకూడదు.. కాలేయ క్యాన్సర్ కావొచ్చు

Anand Sai HT Telugu
May 20, 2024 05:20 PM IST

Liver Cancer Symptoms In Telugu : ఇటీవల చాలా మంది కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. కానీ ఈ విషయాన్ని మెుదట్లో గుర్తించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలను ముందుగానే తెలుసుకోవాలి.

లివర్ క్యాన్సర్ లక్షణాలు
లివర్ క్యాన్సర్ లక్షణాలు

క్యాన్సర్ పేరు చెబితేనే గుండెల్లో రాయి పడినట్టుగా అవుతుంది. మన చుట్టు పక్కలవారికి వచ్చినట్టు తెలిస్తే చాలా ఎక్కువగా ఆలోచిస్తాం. ఈ వ్యాధి పేరు వింటేనే ప్రతి ఒక్కరి గొంతు భయంతో ఎండిపోతుంది. క్యాన్సర్ అనేది ప్రాణాంతక వ్యాధి. ప్రస్తుతం క్యాన్సర్‌ బారిన పడే వారి సంఖ్య బాగా పెరిగింది. వాటిలో కొన్ని గత కొన్నేళ్లుగా ప్రాణాంతకంగా మారాయి. వాటిలో మొదటిది కాలేయ క్యాన్సర్.

ఈ కాలేయ క్యాన్సర్ అనేదాన్ని మెుదట్లోనే గుర్తిస్తే మీకు ఎటువంటి సమస్యలు రావు. మీరు తప్పకుండా ఈ విషయాలను గుర్తించాలి. ఎందుకంటే క్యాన్సర్ ఒక్కసారి వస్తే.. అదిపెరుగుకుంటూ పోతుంది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా తగ్గదు. ఫలితంగా ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. అందుకే క్యాన్సర్ వ్యాధిని అంత తేలిగ్గా తీసుకోకూడదు.

చాలా మంది ఈ క్యాన్సర్‌ను తట్టుకోలేరు. అయితే క్యాన్సర్ మొదటి దశలోనే గుర్తిస్తే వైద్యులను సంప్రదించి ఎంతో కొంత ఉపశమనం పొందవచ్చు. కాలేయ క్యాన్సర్ వచ్చింది అనడానికి ముందుగానే మన శరీరం కొన్ని లక్షణాలను మనకు చెబుతుంది. వాటిని ముందుగానే పసిగట్టి వైద్యుడి వద్దకు వెళితే ఫలితం ఉంటుంది. లేదంటే మీ ప్రాణాల మీదకు వస్తుంది. అయితే కాలేయ క్యాన్సర్ లక్షణాల గురించి తెలుసుకోండి.

పొత్తి కడుపులో అసౌకర్యం

కాలేయ క్యాన్సర్ యొక్క ప్రాథమిక లక్షణాలు పొత్తికడుపులో అప్పుడప్పుడు అసౌకర్యం, నొప్పి కుడి వైపున ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా కడుపు నొప్పి తరచుగా సంభవిస్తుంది. కుడి ఊపిరితిత్తుల కింద నొప్పి ఎక్కువ అవుతుంది. తరచుగా వాంతులు, పొట్ట ఉబ్బిపోతుంది. ఆహారం జీర్ణం కాదు. ఇది క్యాన్సర్ మొదటి లక్షణం. ముందుగా జాగ్రత్తగా ఉండండి. లేదంటే తర్వాత ప్రమాదంలో పడవచ్చు.

తరచుగా కామెర్లు

కాలేయ క్యాన్సర్ యొక్క మరొక లక్షణం తరచుగా కామెర్లు. మీరు కామెర్లు అనేక లక్షణాలను కలిగి ఉంటే జాగ్రత్తగా ఉండండి. చాలా మందికి మూత్రం పసుపు, పసుపు కళ్ళు ఉంటాయి. బిలిరుబిన్ స్థాయిలు పెరుగుతూనే ఉంటాయి. కళ్లలోని తెల్లసొన పసుపు రంగులోకి మారుతూనే ఉంటుంది. కాలేయం సరిగా పనిచేయదు. పదేపదే కామెర్లు వస్తాయి. ఎంత ప్రయత్నించినా తగ్గదు. ఇదే జరిగితే తప్పు చేయకండి. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

ఆకలి తగ్గుతుంది

శరీరంలో క్యాన్సర్ కణాల సంఖ్య పెరిగినప్పుడు. ఆ సమయంలో వ్యక్తికి ఆకలి క్రమంగా తగ్గుతుంది. ఆకలి తగ్గడం వల్ల బరువు కూడా తగ్గుతుంది. ఒక వ్యక్తి క్రమంగా బరువు కోల్పోతుంటే, ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించండి. ఎందుకంటే ఇది కాలేయ క్యాన్సర్‌కు మరో లక్షణం. మీరు అన్నం సరిగా తినలేకపోతున్నారంటే డాక్టర్ వద్దకు వెళ్లి పరీక్షలు చేసుకోవాలి.

కడుపులో సమస్యలు

కాలేయ క్యాన్సర్ కడుపులో వివిధ సమస్యలను కలిగిస్తుంది. కామెర్లు కాకుండా, కడుపు నొప్పి, ఆకలి తరచుగా తగ్గుతుంది. చాలా వికారంగా ఉంటుంది. శరీరం బలహీనంగా మారుతుంది. ఏ పనికి శక్తి ఉండదు. పొట్ట ఉబ్బిపోతుంది. జీర్ణశక్తి తగ్గుతుంది. దీనితో పాటు రోగనిరోధక శక్తి కూడా తగ్గుతుంది. మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య సలహా తీసుకోండి. ఎందుకంటే ఇవి కాలేయ క్యాన్సర్ మొదటి లక్షణాలు. ముందుగా తెలుసుకోవాలి. అప్పుడే మీరు ఎక్కువ కాలం జీవించగలరు.

Whats_app_banner