Vastu Tips for Married Life : బెడ్‌రూమ్‌లో ఈ మార్పులు చేస్తే.. దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది..
Vastu Tips for Married Life : దాంపత్య జీవితంలో గొడవలు కామన్. అయితే ఈ చిన్న చిన్న గొడవలు రాకుండా ఉండాలంటే.. ఒకరినొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం. అయితే వాస్తు ప్రకారం కొన్ని చిట్కాలు పాటిస్తే.. ఆ గొడవలు కూడా ఉండవు అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అవేంటో మీరు చూసేయండి.
Vastu Tips for Married Life : సంతోషకరమైన వైవాహిక జీవితం కావాలంటే వాస్తు, ఫెంగ్‌షుయ్ చిట్కాలు ఫాలో అవ్వాలి అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. పెళ్లి తర్వాత పలు కారణాల వల్ల మీకు ప్రేమ దూరం అవుతుంది. లేదా చిన్న చిన్న వైవాహిక గొడవలు పెరిగి.. క్రమంగా సంబంధంలో పెద్ద చీలికలను సృష్టిస్తాయి. మీరు కూడా ఇలాంటి సమస్యల్లో ఉన్నారనిపిస్తే వీటిని ఫాలో అవ్వండి.
బెడ్‌రూమ్ వాల్ అండ్ కాట్
ఫెంగ్ షుయ్ ప్రకారం.. బెడ్‌రూమ్‌లో డోర్ ఉన్న గోడకు పక్కగా మంచం ఉంటే.. దాంపత్య సమస్యలు పెరుగుతాయంటున్నారు. ఒకవేళ మీరు సమస్యలు ఎదుర్కొంటుంటే ఈ అంశాన్ని పరిశీలించండి.
పడకగది కిటికీ
జీవావరణ శాస్త్రం ప్రకారం.. పడకగది కిటికీ గదిని కాంతితో నింపుతుంది. దాంపత్య సుఖాన్ని కలిగిస్తుంది. పడకగదిలోని కిటికీలోంచి మంచి వెలుతురు వచ్చేలా జాగ్రత్తపడాలి. పడకగదికి నైరుతి దిక్కులో గులాబీల వంటి ఎర్రటి పువ్వులు పెడితే బాంధవ్యం మెరుగుపడుతుంది.
పడకగదిలో ఏ మొక్కలు ఉంచాలంటే..
వాస్తుశాస్త్రం ప్రకారం.. వివాహ సంబంధాలను మెరుగుపరచడానికి పడకగదిలో ఒకటి కంటే ఎక్కువ చెట్లను ఉంచాలని చెప్తున్నారు. ఒక లావెండర్ లేదా లిల్లీ ఫ్లవర్ ప్లాంట్‌ను బెడ్‌రూమ్‌లో ఉంచినట్లయితే, ముఖ్యంగా శాంతి కలువను ఉంచితే.. అది మీకు తిరిగి ప్రేమను ఇస్తుంది. ఇది భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలపరుస్తుందని వాస్తుశాస్త్రం పేర్కొంది.
సంబంధిత కథనం