Hotel Bedsheets:హోటల్ గదులలో బెడ్ షీట్‌లు, టవల్స్ తెల్లగా ఎందుకు ఉంటాయో తెలుసా?
హోటల్ గదులలో వైట్ బెడ్‌షీట్లు ఎందుకు ఉన్నాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీకు తెలియని ఈ ఆసక్తికరమైన విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
వివిధ ప్రయాణాల సమయంలో మనం చాలా సార్లు హోటళ్లలో బస చేస్తుంటాం. అయితే మనం ఉండే హోటళ్ల రూంలోని బెడ్‌లు తెల్లటి షీట్‌లతో కప్పబడి ఉండటం గమనించే ఉంటాం. అయితే దీని వెనుక కారణం ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా, హోటళ్లలో కలర్ బెడ్‌షీట్‌లను ఎందుకు ఉపయోగించరు అనే దాని వెనుక ఉన్న కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
అందంగా కనిపించడంతో పాటు తెలికగా ఉతకవచ్చు
సాధరణంగా తెల్లగా ఉండే వాటిని చాలా మంది ఇష్టపడుతుంటారు. గుదుల్లో ఉండే షీట్లు, టవల్స్ శుభ్రంగా ఉన్నయనే సూచికగా తెల్లటి వస్త్రాలను వాడుతుంటారు. అలాగే వేర్వేరు రంగులను కలిగి ఉంటే వాటిని వేర్వేరు బ్యాచ్‌లలో ఉతకాల్సి ఉంటుంది. తెలుపుగా ఉంటే ప్రతిదీ సులభంగా, త్వరగా ఒకేసారి కడగవచ్చు. రంగు బెడ్‌షీట్‌ల కంటే తెల్లటి రంగు బెడ్‌షీట్‌లను సులభంగా ఉతకవచ్చు లేదా బ్లీచ్ చేయవచ్చు.
హోటల్స్‌లో ఎక్కువ పెరాక్సైడ్ ఆధారిత డిటర్జెంట్లు ఉపయోగిస్తారు. కలర్ వస్త్రాలను వీటితో ఉతకడం వల్ల తొందరగా రంగు వెలిసిపోతుంది. తెల్లటి వస్త్రాలపై ఎలాంటి రసాయనాల ప్రభావం ఉండదు
తెలుపు రంగు శాంతి, సౌకర్యానికి చిహ్నం అని మనందరికీ తెలుసు. సాదరణంగా కొత్తగా పెళ్లయిన జంట పడకగదిలో హనీమూన్ సమయంలో కూడా తెలుపు వస్త్రాన్నే ఉపయోగిస్తారు. తెలుపు అనేది జంట మధ్య ప్రేమను మరింతగా మెరుగుపరచడానికి, జంటల మధ్య ఉన్న చిన్న విభేదాలను మరచిపోవడానికి సహకరిస్తుంది
తెలుపు రంగు బెడ్‌షీట్‌లను ఉపయోగించడం వెనుక ఉన్న ముఖ్య కారణం వాటి ఉండే మరకలను ఈజీగా గుర్తించవచ్చు. అందుకే హోటల్స్‌లో బస చేసే అతిథులందరూ భోజనం చేసేటప్పుడు లేదా బెడ్‌షీట్ వేసుకునేటప్పుడు మరేదైనా పని చేసేటప్పుడు వాటిపై మరక పడుతుందని జాగ్రత్తగా ఉంటారు.
తెలుపు రంగు వస్త్రాలను ఉపయోగించడం వల్ల లగ్జరీ అనుభూతికి సహాయం చేస్తుంది. అందువల్ల హోటల్ గది అపరిశుభ్రంగా ఉండకుండా క్లీన్ ఉందనే అనుభూతిని కలిగించడం కోసం వైట్ షిట్స్ వాడుతుంటారు. దీని కారణంగా గదిలో అతిథి విలాసవంతంగా గడుపుతారు.
మనస్తత్వవేత్తల ప్రకారం, తెలుపు రంగు మనస్సుకు ప్రశాంతతతో పాటు శాంతికి చిహ్నంగా ఉంటుంది. వీటిని చూసినప్పుడు చింతలన్ని దూరం అవుతాయి.
సంబంధిత కథనం