Valentine’s Day 2023 : బ్రేకప్ అయిందా? మళ్లీ మళ్లీ వాళ్లే కావాలనిపిస్తుందా?-valentines day 2023 want to get back the love here s some tips for you ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Valentines Day 2023 Want To Get Back The Love Here's Some Tips For You

Valentine’s Day 2023 : బ్రేకప్ అయిందా? మళ్లీ మళ్లీ వాళ్లే కావాలనిపిస్తుందా?

Anand Sai HT Telugu
Feb 07, 2023 10:29 AM IST

Breakup Tips : ఏదో ఆవేశంలో లవ్ చేసిన వ్యక్తికి దూరం అవుతారు. కానీ మళ్లీ మళ్లీ వాళ్లే గుర్తుకువస్తారు. అటు వైపు కూడా అలానే ఉంటుదేమో చెప్పలేం. వెళ్లి మాట్లాడాలనిపిస్తుంది. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా మీకు ఇష్టమైన వాళ్లకు దగ్గరయ్యే ప్రయత్నం చేయండి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

కొన్ని పరిస్థితుల్లో తప్పు ఎవరిది లేకున్నా.. వీడిపోవాల్సి వస్తుంది. పరిస్థితులే అలా తయారవుతాయి. కానీ మళ్లీ వాళ్లు దగ్గరుంటేనే సంతోషం అనిపిస్తుంది. సో దగ్గరయ్యేందుకు ప్రయత్నించండి.. మీ విడిపోయిన భాగస్వామి కోసం ప్రేమ భాషలో ఆలోచించండి. ఏం చేస్తే వాళ్లు దగ్గరవుతారో చూడండి. ఈ వాలెంటైన్స్ డే(Valentines Day)ని మరింత ప్రత్యేకంగా చేసుకోండి. మీకు ఇష్టమైన వాళ్లకు.. ఇష్టమైనవేంటో చేయండి.

ఈ ప్రేమికుల రోజు(Lovers Day)న అందరూ దగ్గరే ఉంటారు అని చెప్పలేం. కొంతమంది ఎక్కడో ఉండొచ్చు. కొంతమంది బ్రేకప్ అయి ఉండొచ్చు. వివిధ పనుల్లో బిజీగా ఉండి.. జంటలు దూరంగా ఉండొచ్చు. ఇలాంటి విషయాలు కాస్త నిరాశను కలిగిస్తాయి. కానీ మీకు ఇష్టమైన వాళ్లకు నచ్చేలా కొన్ని ప్లాన్స్ చేసుకుంటే.. చాలు.. మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తారు. కొంచెం ఆలోచిస్తే.. చాలు.. ప్రతిధ్వనించే ప్రేమ భాషతో భాగస్వాములు బంధాన్ని బలంగా ఉంచుకోవచ్చు. ప్రతి జంటకు ప్రేమ భాష ఉంటుంది. అది అర్థం చేసుకోవాలి. మనం ప్రేమించిన వ్యక్తి ఇష్టాలు, అలవాట్లు తెలుసుకోవాలి. వారికి నచ్చేలా కొన్ని పనులు చేస్తే చాలు.. బ్రేకప్(Breakup) అయిన వాళ్లు తిరిగిరావొచ్చు. లవర్స్ డేకు దూరంగా ఉన్నా.. మీ మీద ఇంకా ప్రేమను పెంచుకోవచ్చు.

మీ ప్రియమైన వారి కోసం ప్రేమలేఖలు(Love Letters) లేదా పద్యాలు రాయండి. అది టెక్స్టింగ్ ద్వారా కావచ్చు, వీడియో కాల్ లేదా వాయిస్ సందేశం ద్వారా గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ సందేశాన్ని పంపండి. మీకు ఇష్టమైన జ్ఞాపకాల ఫోటో ఆల్బమ్‌లను వీడియోల ద్వారా క్రియేట్ చేయండి. అవి మీకు ఎంత ప్రత్యేకమైనవో వివరించండి. ప్రత్యేకంగా మీరే సొంతంగా మీ ప్రేమకు సంబంధించి.. ఏదైనా రాసి పంపండి.

మీ భాగస్వామి దూరంగా ఉన్నా వారికి ఇష్టమైన భోజనాన్ని ఆర్డర్(Food Order) చేయండి. ఆన్‌లైన్ షాపింగ్(Online Shopping) చేసి పంపండి. దూరంగా ఉన్నప్పుడు వర్చువల్ తేదీలను పెట్టుకోండి. కలిసి ఆన్‌లైన్ గేమ్‌లు ఆడండి. మీ భాగస్వామి కోసం వీలైనంత సమయం కేటాయించడానికి ప్రయత్నించండి. ఇవన్నీ వారితోనే మీరు ఉన్నట్టుగా అనిపిస్తుంది.

మీరు స్వయంగా చేతితో తయారు చేసిన బహుమతులను మీ భాగస్వామికి పంపండి. ఆన్‌లైన్‌లో పూలు లేదా ఇతర బహుమతులు ఆర్డర్ చేసి.. ఆశ్చర్యపరచండి. తక్కువ ధరైనా.. మీరు వాళ్ల మీద చూపిస్తున్న ఇంట్రస్ట్ కు సంబరపడిపోతారు.

కౌగిలింతకు మించిన భావం లేదు. కౌగిలింతల గురించి మాట్లాడండి. పాత జ్ఞాపకాలను తిరిగి పొందేలా చేయండి. మీరు గుర్తుకు వచ్చేలా.. ఏదైనా మీ భాగస్వామికి ఇవ్వండి.

చిన్న చిన్న విషయాలే.. ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. మీకు బ్రేకప్ చెప్పినవారికి.. అవే గుర్తుకువచ్చేలా చేయండి. వాళ్లపై మీకున్న ప్రేమ గురించి తెలిసేలా చేయాలి. రిప్లై లేదు కదా.. అని ఇష్టం వచ్చినట్టుగా సందేశాలు పంపితే.. మెుదటికే మోసం వస్తుంది మరి..!

WhatsApp channel