Happy Rose Day 2023 । ఈ వాలెంటైన్స్ వీక్‌లో మీ ప్రేమ గులాబీ వికసించనీ.. వివిధ రంగుల రోజాలకు అర్థాలు ఇవే!
Happy Rose Day 2023: ప్రేమికుల వారంలో రోజ్ డే సందర్భంగా వివిధ రంగుల గులాబీలను ఇచ్చి పుచ్చుకుంటారు. మీరు ఎవరికైనా గులాబీలు ఇవ్వాలనుకుంటే దేని అర్థం ఏమిటో ఇక్కడ చూడండి.
Happy Valentine's Day Week 2023: ప్రతీ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తేదీని వాలెంటైన్స్ డే (Valentine's Day) గా నిర్వహిస్తారు. ప్రేమను వేడుక చేసుకునే రోజుగా ఈ తేదీ గుర్తింపు పొందింది. అయితే ప్రేమికుల రోజు సందడి వారం రోజుల నుంచే మొదలవుతుంది. ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 14 వరకు వారం రోజులను ప్రేమికుల వారం (Valentine's Day Week) గా ప్రేమికులు జరుపుకుంటారు. సంవత్సరంలో వాలెంటైన్స్ వీక్‌ను అత్యంత రొమాంటిక్ వీక్ అని చెప్తారు. ఈ వాలెంటైన్ వీక్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7న రోజ్ డే (Rose Day) తో మొదలవుతుంది. ఈరోజు నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.
ఫిబ్రవరి 7న ప్రేమకు వేడుకగా మొదలయ్యే రోజ్ డేకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజు నుంచి తమకు అత్యంత ఇష్టమైన వారికి, తమ ప్రేమను వ్యక్తీకరించడానికి బహుమతులు, ఉత్తరాలు, కవితలు ప్రేమికులు పంపుకుంటారు. ముఖ్యంగా గులాబీల పంచుకోవడం ఇక్కడ విశేషంగా చెప్పాలి.
Happy Rose Day 2023- ప్రేమికుల వారంలో వివిధ రంగుల రోజా పువ్వులకు గల అర్థాలు
వసంతకాలం రాకతో ఫిబ్రవరిలో రోజా పువ్వులు విరబూస్తాయి. తమ ప్రియమైన వారికి వివిధ రంగుల గులాబీలను బహుమతిగా ఇస్తారు. ఒక్కో రంగు గులాబీకి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. ఏ రంగు గులాబీకి ఎలాంటి అర్థం ఉందో తెలుసుకోండి. మీకు ప్రియమైన వారికి ఆ రంగు గులాబీని అందించి వారి పట్ల మీరు ఎలాంటి భావనను కలిగి ఉన్నారో తెలియజెప్పండి.
1. ఎర్ర గులాబీ
అన్ని గులాబీలలో ఎర్ర గులాబీ అత్యంత ప్రియమైనది. ప్రేమకు చిహ్నం ఈ ఎర్ర గులాబీ. మీరు ఈ ప్రేమికుల వారంలో ఎర్ర గులాబీని ఎవరికైనా ఇస్తున్నారంటే మీరు వారిని ప్రేమిస్తున్నారని చెప్పకనే చెప్పడం. వారు మీరు ఇచ్చిన ఎర్ర గులాబీని స్వీకరిస్తే మీ ప్రేమను అంగీకరించినట్లు అర్థం.
2. ఆరెంజ్ గులాబీ
ఆరెంజ్ గులాబీ మీరు ఎవరినైనా చాలా ఇష్టపడుతున్నారు, అంటే వారికి మీ ఇష్టాన్ని తెలిపేందుకు ఆరెంజ్ గులాబీని బహుమతిగా ఇవ్వండి, వారు మీకు ఇష్ట సఖులు అని వారికి తెలియజేయండి.
3. పీచు గులాబీ
మీకు ఎవరినైనా ప్రేమిస్తుంటే వారు చెప్పటానికి సిగ్గుపడుతుంటే, లేదా వారి ప్రేమను అంగీకరించాలన్నా ఏదైనా బిడియం అడ్డువస్తుంటే వారికి ఈ పీచు రంగు గులాబీని ఇవ్వవచ్చు. దీని అర్థం మీరు కూడా వారిని ప్రేమిస్తున్నారు, కానీ కొన్ని కట్టుబాట్లు మీకు అడ్డుపడుతున్నాయి.
4. పసుపు గులాబీ
పసుపు రంగు గులాబీ ఇద్దరి మధ్య స్నేహాన్ని సూచిస్తుంది. వారిపై మీకు ఇష్టం, అభిమానం ఉండి, వారి స్నేహం మీతో ఇలాగే కలకాలం నిలిచి ఉండాలని కోరుకుంటున్నపుడు ఎల్లో రోజ్ ఇవ్వడం సరైనది.
5. లావెండర్ గులాబీ
ఈ రంగు గులాబీ అందమైనది, అరుదైనది. మీరు ఎవరితో అయినా మొదటి చూపులోనే ప్రేమలో పడితే, అది వారికి తెలియజేయడానికి పర్పుల్ గులాబీల బహుమతిగా ఇవ్వండి. ఎవరైనా ఆకర్షించే రూపం, వారి అందాన్ని పొగడటానికి ఈ పర్పుల్ రోజ్ ఇవ్వవచ్చు.
6. పింక్ రోజ్
గులాబీ రంగు రోజా పువ్వు ఇవ్వడం అభినందనకు, అభిమానానికి సూచిక. ఎవరినైనా అభినందించాలనుకుంటే, లేదా మెచ్చుకోవాలనుకుంటే పింక్ రోజ్ ఇవ్వండి.
7. తెల్ల గులాబీ
తెల్ల గులాబీని ప్రత్యేక సందర్భాల్లో ఇస్తారు. ఎవరైనా వివాహం చేసుకోబోతుంటే వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి, ఎవరైనా దూరం అయితే వారికి నివాళిగా వైట్ రోజ్ ఇవ్వడం సరైనది. ప్రేమికుల వారంలో ఈ తెల్ల గులాబీలు సాధారణంగా ఎవరు ఇచ్చిపుచ్చుకోవాలని కోరుకోరు.
మీకు ఈ ప్రేమికుల రోజు ప్రత్యేకం కావాలి.. మీ ప్రేమలు పండాలి, మీరు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ.. Happy Rose Day, Happy Valentine's Day Week, Happy Valentine's Day!
సంబంధిత కథనం