Couple jailed for dance video: బహిరంగంగా డ్యాన్స్ చేసిన జంటకు 10 ఏళ్ల జైలు శిక్ష-iran couple jailed for more than 10 years over viral dance video ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Iran: Couple Jailed For More Than 10 Years Over Viral Dance Video

Couple jailed for dance video: బహిరంగంగా డ్యాన్స్ చేసిన జంటకు 10 ఏళ్ల జైలు శిక్ష

HT Telugu Desk HT Telugu
Jan 31, 2023 10:58 PM IST

Couple jailed for dance video: మధ్య యుగాల నాటి కఠిన ఆంక్షలను అమలు చేస్తున్న ఇరాన్ (IRAN) లో మరో దారుణం వెలుగు చూసింది. ఆంక్షలను ఉల్లంఘిస్తూ బహిరంగంగా నృత్యం చేసిన జంటకు ఇరాన్ కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది.

ఇరాన్ ప్రభుత్వ నిబంధనలను ధిక్కరిస్తూ ఆజాదీ స్క్వేర్ వద్ద డ్యాన్స్ చేస్తున్న జంట
ఇరాన్ ప్రభుత్వ నిబంధనలను ధిక్కరిస్తూ ఆజాదీ స్క్వేర్ వద్ద డ్యాన్స్ చేస్తున్న జంట (Twitter/@ShazzShams)

Couple jailed for dance video: ఇరాన్ (Iran) లో ప్రస్తుతం పౌరులపై కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. ఆ ఆంక్షలను ఉల్లంఘించిన వారికి అత్యంత కఠిన శిక్షలను విధిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Couple jailed for dance video: రాజ్య ధిక్కరణ

ఇరాన్ లో అమలవుతున్న కఠిన నిబంధలనపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మహిళలు కచ్చితంగా హిజాబ్ ధరించాలన్న నిబంధనను, విద్యా సంస్థల్లో మహిళల ప్రవేశానికి సంబంధించిన ఆంక్షలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో సుమారు 20 ఏళ్ల వయస్సున్న ఒక యువ జంట రాజ్యం విధించిన అమానవీయ ఆంక్షలకు వ్యతిరేకంగా గత సంవత్సరం నవంబర్ లో ఇరాన్ (Iran) రాజధాని టెహ్రాన్ (Tehran) లోని ఆజాదీ స్క్వేర్ (Azadi Tower in Tehran) ముందు జంటగా డ్యాన్స్ చేశారు. అస్తియాజ్ అజీజీ (Astiyazh Haghighi), ఆమె ఫియాన్సీ ఆమిర్ మొహమ్మద్ అహ్మది (Amir Mohammad Ahmadi) రొమాంటిక్ డ్యాన్స్ వీడియో వైరల్ అయింది. ప్రభుత్వ వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి ఇరాన్ (Iran) ప్రజలు బహిరంగంగా డ్యాన్స్ చేయడాన్ని ఒక శక్తిమంతమైన ఆయుధంగా వాడుతున్నారు.

Couple jailed for dance video: అరెస్ట్, శిక్ష

ఆ డ్యాన్స్ చేస్తున్న సమయంలో అస్తియాజ్ అజీజీ (Astiyazh Haghighi) హిజాబ్ ధరించలేదు. అంతేకాదు, ఇరాన్ (Iran) లో స్త్రీలు బహిరంగంగా డ్యాన్స్ చేయడం నేరం. మగవారితో కలిసి నాట్యం చేయడం ఇంకా పెద్ద నేరం. దాంతో, ఆ చర్యను రాజ్య ధిక్కరణగా నిర్ధారించిన ఇరాన్ (Iran) ప్రభుత్వం వారిద్దరిని అరెస్ట్ చేసింది. వారికి బెయిల్ ఇవ్వలేదు. వారి తరఫున వాదించడానికి లాయర్లను అనుమతించలేదు. ఏకపక్ష విచారణ అనంతరం ఇరాన్ రెవొల్యూషనరీ కోర్టు వారికి వేర్వేరుగా 10 సంవత్సరాల ఆరు నెలల జైలుశిక్షను విధించింది. అలాగే, వారు ఇంటర్నెట్ ను వాడకూడదని నిషేధం విధించింది.

Couple jailed for dance video: పాపులర్ జంట

జైలు శిక్ష పడిన అస్తియాజ్ అజీజీ (Astiyazh Haghighi), ఆమె ఫియాన్సీ ఆమిర్ మొహమ్మద్ అహ్మది (Amir Mohammad Ahmadi) ఇరాన్ లో ఇప్పటికే ఇన్ స్టా గ్రామ్ బ్లాగ్సర్స్ (Instagram bloggers) గా చాలా పాపులర్. హిజాబ్ నిబంధనను పాటించని మాసా అమిని (Mahsa Amini) అనే యువతి పోలీసుల కస్టడీలో మరణించిన అనంతరం ఇరాన్ (Iran) లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు మిన్నంటాయి. ప్రభుత్వం కూడా వాటిని అంతే తీవ్రంగా అణచివేయడం ప్రారంభించింది. ఇప్పటివరకు నిరసనల్లో పాల్గొంటున్న సుమారు 14 వేల మందిని అరెస్ట్ చేసింది.

WhatsApp channel