Elnaaz Norouzi Strips to Nude: బట్టలిప్పి నిరసన తెలిపిన ఇరాన్ నటి.. లో దుస్తులు కూడా.. ఎందుకో తెలుసా?-iran actress elnaaz norouzi strips to nude for support anti hijab agitation ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Elnaaz Norouzi Strips To Nude: బట్టలిప్పి నిరసన తెలిపిన ఇరాన్ నటి.. లో దుస్తులు కూడా.. ఎందుకో తెలుసా?

Elnaaz Norouzi Strips to Nude: బట్టలిప్పి నిరసన తెలిపిన ఇరాన్ నటి.. లో దుస్తులు కూడా.. ఎందుకో తెలుసా?

Maragani Govardhan HT Telugu
Oct 12, 2022 01:28 PM IST

Elnaaz Norouzi Strips Video: ఇరాన్ నటి ఎల్నాజ్ నోరౌజీ తమ దేశంలో జరుగుతున్న హిజాబ్ వ్యతిరేక ఉద్యమానికి వినూత్నంగా నిరసన తెలిపింది. బట్టలిప్పేసి.. మై బాడీ మై ఛాయిస్ అంటూ ఆందోళన తెలిపింది.

<p>బట్టలిప్పేసి హిజాబ్‌ను వ్యతిరేకించిన ఇరాన్ నటి ఎల్నాజ్</p>
బట్టలిప్పేసి హిజాబ్‌ను వ్యతిరేకించిన ఇరాన్ నటి ఎల్నాజ్ (Instagram)

Elnaaz Norouzi Supports Anti Hijab: ఇరాన్‌లో హిజాబ్ ఉద్యమం రోజురోజుకు ఊపందుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది మహిళలు ఈ నిరసనకు మద్దతు తెలుపుతున్నారు. అయితే రప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన సేక్రెడ్ గేమ్స్‌‌లో నటించిన ఇరాన్ నటి ఎల్నాజ్ నోరౌజీ(Elnaaz Norouzi) తన మద్దతును వినూత్నంగా తెలిపింది. ఒంటి మీద బట్టలన్నీ విప్పేస్తూ దర్శనమిచ్చింది. ఇరాన్‌లో హిజాబ్‌ను(Anti Hijab) వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉద్యమానికి బట్టలిప్పుతూ కనిపించింది. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను గమనిస్తే.. ఇరాన్ నటి నోరౌజీ ముందు హిజాబ్ ధరించి కనిపించింది. అనంతరం ఒక్కొక్కటిగా దుస్తులను విప్పుడం ప్రారంభించింది. ఎంతలా అంటే లోదుస్తులను కూడా విప్పి తన నిరసనను తెలిపింది. మై బాడీ మై ఛాయిస్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది.

"ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ.. తను ఎక్కడ నుంచి వచ్చినప్పటికీ.. ఆమె కోరుకున్నది ధరించే హక్కును కలిగి ఉండాలి. అలాగే ఎప్పుడైనా, ఎక్కడైనా ధరించాలి. ఏ పురుషుడు లేదా మరే ఇతర స్త్రీ అయినా ఆమె హక్కును కాదని, వేరే దుస్తులు ధరించమని అడిగే హక్కు లేదు. ప్రతి ఒక్కరికి భిన్నమైన అభిప్రాయాలు, నమ్మకాలు ఉంటాయి. వాటిని గౌరవించాలి. ప్రజాస్వామ్యం అంటే నిర్ణయించే శక్తి.. ప్రతి స్త్రీకి తన శరీరాన్ని స్వయంగా నిర్ణయించుకునే అధికారం ఉండాలి. నేను నగ్నత్వాన్ని(Nudity) ప్రచారం చేయడం లేదు. అవకాశం ఫ్రీడమ్ ఆఫ్ ఛాయిస్‌ను ప్రమోట్ చేస్తున్నాను." అంటూ ఎల్నాజ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా ఎంతో మంది మహిళలు నిరసనలు తెలుపుతున్నారు. ఇప్పటికే 100 మందికి పైగా నిరసనకారులు మరణించినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీరిలో ఎక్కువ మంది యువతులే ఉన్నారు. వీరంతా జుట్టును బహిరంగంగా చూపించకూడదనే నిర్బంద హిజాబ్ నియామాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇరాన్ పోలీసుల కస్టడీలో మహ్సా అమినీ అనే మహిళ మరణంతో ఈ నిరసన జ్వాలలు మిన్నంటాయి.

Whats_app_banner

సంబంధిత కథనం