Telugu News  /  Video Gallery  /  Iran: Anti-hijab Protesters Burn Governor's Office, Police Vehicles; Over A Dozen Dead In Clashes

Anti-Hijab protests in Iran: హిజాబ్ వ్యతిరేక ప్రదర్శనలతో అట్టుడుకుతున్న ఇరాన్

22 September 2022, 22:52 IST HT Telugu Desk
22 September 2022, 22:52 IST

Anti-Hijab protests in Iran: ఇరాన్ అట్టుడుకుతోంది. దేశవ్యాప్తంగా యాంటి హిజాబ్ నిరసనలు మిన్నంటాయి. దేశ మొరాలిటీ పోలీసుల అత్యుత్సాహం వల్ల మరింత పెద్ద సంఖ్యలో పౌరులు, ముఖ్యంగా మహిళలు ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. ఇటీవల హిజాబ్ ను సరిగ్గా ధరించలేదన్న కారణంతో మొరాలిటీ పోలీసులు అరెస్ట్ చేసిన 22 ఏళ్ల యువతి మొహసా ఆమ్ని కస్టడీలో చనిపోయింది. నిరసనకారుల ఆగ్రహం మరింత పెరిగింది. తాజాగా, ఉత్తర ఇరాన్ లో గవర్నర్ భవనాన్ని వారు తగలబెట్టారు. గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఈ హింసాత్మక ఆందోళనల్లో 31 మంది వరకు నిరసనకారులు చనిపోయారు. గవర్నర్ భవనం తగలబడి పోతున్న దృశ్యాలను ఈ వీడియోలో చూడండి..

More