Belly Fat: చున్నీ, స్కార్ఫ్ ఉంటే చాలు, మీ పొట్ట చుట్టూ కొవ్వు ఇలా కరిగించేయొచ్చు-use dupatta to reduce belly fat in eight weeks with exercises ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Belly Fat: చున్నీ, స్కార్ఫ్ ఉంటే చాలు, మీ పొట్ట చుట్టూ కొవ్వు ఇలా కరిగించేయొచ్చు

Belly Fat: చున్నీ, స్కార్ఫ్ ఉంటే చాలు, మీ పొట్ట చుట్టూ కొవ్వు ఇలా కరిగించేయొచ్చు

Koutik Pranaya Sree HT Telugu
Oct 05, 2024 12:30 PM IST

Belly Fat: : బెల్లీ ఫ్యాట్ లేదా పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించుకోడానికి చూస్తున్నారా? అయితే మీ ఇంట్లోనే ఉండే దుపట్టా లేదా స్కార్ఫ్ సాయంతో కొన్ని వ్యాయామాలు చేసి ఇలా తగ్గించుకోండి.

పొట్ట కొవ్వు తగ్గించే మార్గాలు
పొట్ట కొవ్వు తగ్గించే మార్గాలు (shutterstock)

బరువు పెరగడంతో పాటే ముందుగా కనిపించే సమస్య పొట్ట చుట్టూ కొవ్వు చేరుకోవడం. ఈ బెల్లీ ఫ్యాట్ మీ శరీరాకృతిని ప్రభావితం చేయడమే కాక అనేక వ్యాధులకూ కారణం అవుతుంది. ఈ మొండి కొవ్వును కరిగించుకోవడానికి చాలా శ్రమ అవసరం. ఏవేవో వ్యాయామలు చేస్తున్నా పొట్ట చుట్టు కొవ్వును కరిగించుకోలేకపోతే ఈసారి మీ దగ్గర ఉండే స్కార్ఫ్ లేదా చున్నీని వాడండి. దీంతో కింద చెప్పబోతున్నట్లుగా చేస్తే తప్పకుండా 8 వారాల్లో మీ పొట్ట కొవ్వు చాలా సులభంగా తగ్గిపోతుంది.

పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించే వ్యాయామాలు:

సిజర్స్:

సిజర్స్ అంటే కత్తెర కదా. ఈ వ్యాయామంలో కాళ్లను కత్తెరలాగా పైకి కిందికి అంటుంటాం. అందుకే ఆ పేరు. దీనికోసం మ్యాట్ మీద వెల్లికిలా పడుకోండి. కాళ్లను ముందుకు చాపండి. మీ రెండు అరికాళ్ల కింద చున్నీ ఉండేలా పెట్టి రెండు చేతులతో రెండు చున్నీ కొనలను పట్టుకోండి.

సిజర్స్ వ్యాయామంలో కాళ్లను పైకి కిందికి కదిపినప్పుడు చున్నీ ఉంటే కదలిక సులభం అవుతుంది. ఎక్కువసేపు ఈ వ్యాయామం చేయగలుగుతారు. పొట్టు కొవ్వును తగ్గించే వ్యాయామాల్లో ఇది సులభం, ఉత్తమం.

లెగ్ రేజ్:

లెగ్ రేజ్ అంటే కాలు ఎత్తి చేసే వ్యాయామాలు. ఇలాంటి వ్యాయామాలు చేయడం వల్ల పొట్ట కొవ్వు తగ్గించుకోవచ్చు. అయితే అవి చేయడం మీకు కష్టం అనిపిస్తే దుపట్టా సాయం తీసుకోండి. మీ మోకాలు కింది నుంచి దుపట్టా తీసి రెండు కొనలను మీ చేతిలో పట్టుకోండి. ఇప్పుడు కాలును మెల్లగా పైకి లేపుతూ దుపట్టా కొనలను మీ వైపుకు లాగండి. దీంతో కాలును వీలైనంతగా సాగదీయడం, ఎక్కువసేపు పట్టుకోవడం సులవవుతుంది.

మోకాలి వ్యాయామాలు:

నిటారుగా నిలబడి మోకాళ్లను ఛాతీకి దగ్గరగా తీసుకురావడం పొట్ట కొవ్వును తగ్గించే సమర్థవంతమైన వ్యాయామాల్లో ఒకటి. అయితే దీన్ని చేయడం కష్టంగా అనిపిస్తే సులభతరం చేయడానికి చున్నీ వాడొచ్చు. చున్నీని మోకాలి కింది నుంచి దీసుకుని చేతులతో చున్నీని మీ దగ్గరి దాకా లాక్కోవాలి. ఇలా చేస్తే మీకు కాళ్ల కదలికి సులభం అవుతుంది. వ్యాయామం ఎక్కువసేపు సమర్థవంతంగా చేయగలరు.

పొట్ట చుట్టూ కొవ్వును తగ్గించడానికి ఇవన్నీ మంచి వ్యాయామాలు. వీటిని రోజులో కనీసం పావుగంట సేపు మార్చి మార్చి చేయడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు సులభంగా తగ్గుతుంది. స్కార్ఫ్ సాయంతో ఆ సమయం మరింత పెంచొచ్చు. సరిగ్గానూ ఈ వ్యాయామాలు చేస్తారు. కేవలం ఎనిమిది నుంచి పది వారాల్లో బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవచ్చు.

Whats_app_banner