Easy Weight Loss Tips : రోజుకి 5 నిమిషాలు ఈ వ్యాయామాలు చేస్తే చాలు.. బరువు తగ్గుతారు
Easy Weight Loss Tips : సరిగ్గా 5 నిమిషాలు! మీరు రోజులో ఈ సమయాన్ని ఇవ్వగలిగితే, మీరు త్వరగా బరువు తగ్గుతారు, ఏమి చేయాలి. బరువు తగ్గడంలో సమస్య ఉందా? మీరు రోజుకు 5 నిమిషాలు గడపగలరా? అప్పుడే బరువు తగ్గుతారు. నీకు ఎలా తెలుసు?
Easy Weight Loss Tips : బరువు తగ్గాలనుకునే ప్రోసెస్లో ఉన్నప్పుడు చాలా మంది నిరుత్సాహానికి గురవుతారు. ఎందుకంటే ఆహారాన్ని నియంత్రించినా.. చాలా నియమాలు పాటించినా కూడా బరువు తగ్గలేరు. దానివల్ల చాలా నిరుత్సాహ పడతారు. అయితే సులభంగా బరువు తగ్గడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. మరి ఆ మార్గాలు ఏమిటో..? నిజంగా అవి వర్క్అవుట్ అవుతాయో లేదో ఇప్పుడు తెలుసుకుందాం.
దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేమిటంటే.. దీనికోసం గంటలు గంటల సమయం గడపాల్సిన అవసరం లేదు. అదేంటి వర్క్ అవుట్ అంటున్నారు సమయం ఎక్కువ పట్టదు అంటున్నారు అని డౌట్ వస్తుందా? అయితే అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రోజులో కేవలం 5 నిమిషాలు గడిపితే చాలు బరువు తగ్గవచ్చు అంటున్నారు. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని తేలికపాటి వ్యాయామాలు మీ శరీర కొవ్వును గణనీయంగా తగ్గించగలవు. రోజు ప్రారంభంలో కేవలం 5 నిమిషాలు వాటి కోసం వెచ్చిస్తే చాలు అంటున్నారు. మరి వీటితో బరువు తగ్గడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ ఎలాంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలో.. ఇక్కడ జాబితా ఉంది.
స్కిప్పింగ్
ఇకపై వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రతిరోజూ సరిగ్గా 5 నిమిషాలు స్కిప్పింగ్ చేస్తే చాలు అంటున్నారు. దీని వల్ల కొవ్వు తగ్గుతుంది.. బరువు తగ్గుతారు. అంతేకాకుండా నరాలను, కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి.
బర్పీస్
ఇది చేయడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది కానీ.. దీనివల్ల కలిగే ప్రయోజనాలు మీకు చాలానే ఉన్నాయి. ప్రతిరోజూ సరిగ్గా 5 నిమిషాలు బర్పీస్ చేయండి. బరువు త్వరగా తగ్గుతారు. కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది. ఇది చాలా గొప్ప వ్యాయామంగా చెప్పవచ్చు.
ప్లాంక్
వ్యాయామం చేయడానికి ఎక్కువ సమయం లేదా? అయితే ప్రతిరోజూ 5 నిమిషాలు ప్లాంక్ వేయండి. దీంతో బరువు కూడా త్వరగా తగ్గుతారు. ఇది నడుము, వెనుక కండరాలను మెరుగుపరుస్తుంది. శరీరం ప్రశాంతంగా ఉంటుంది.
స్క్వాట్స్
ఇది కూడా గొప్ప వ్యాయామం. కాళ్లలో కొవ్వు ఎక్కువగా ఉన్నవారు.. నడుము దగ్గర కొవ్వు పేరుకుపోయిన వారు ఈ వ్యాయామం చేయవచ్చు. రోజూ 5 నిమిషాలు ఇలా చేస్తే బరువు తగ్గుతారు.
కానీ గుర్తుంచుకోండి.. ఈ వ్యాయామాలన్నింటినీ చేసే ముందు డాక్టర్ లేదా నిపుణుడిని సంప్రదించండి. ఎందుకంటే ఒక నిపుణుడు మాత్రమే మీకు ఏది ఉత్తమమైనదో, సురక్షితమైనదో చెప్పగలరు.
సంబంధిత కథనం