తెలుగు న్యూస్ / ఫోటో /
Breakfast for Weight loss| స్థిరంగా బరువు తగ్గాలనుకునే వారు ఇలాంటి బ్రేక్‌ఫాస్ట్ చేయాలి!
- Healthy Breakfast Habits for Weight loss: తిండి మానేయకుండా బరువు తగ్గే ఐడియా ఏదైనా ఉంటే అది ప్రతిరోజూ మిస్ అవ్వకుండా బ్రేక్‌ఫాస్ట్ చేయడమే. అయితే ఇందులోనూ కొన్ని షరతులు ఉన్నాయి. స్థిరంగా బరువు తగ్గాలనుకునేవారు అలవర్చుకోవాల్సిన ఆరోగ్యకరమైన అల్పాహార అలవాట్లు కొన్ని ఉన్నాయి. అవేంటో చూడండి..
- Healthy Breakfast Habits for Weight loss: తిండి మానేయకుండా బరువు తగ్గే ఐడియా ఏదైనా ఉంటే అది ప్రతిరోజూ మిస్ అవ్వకుండా బ్రేక్‌ఫాస్ట్ చేయడమే. అయితే ఇందులోనూ కొన్ని షరతులు ఉన్నాయి. స్థిరంగా బరువు తగ్గాలనుకునేవారు అలవర్చుకోవాల్సిన ఆరోగ్యకరమైన అల్పాహార అలవాట్లు కొన్ని ఉన్నాయి. అవేంటో చూడండి..
(1 / 7)
బరువు తగ్గడం విషయానికి వస్తే, అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం అవుతుంది. ఎందుకంటే రోజంతా మీ ఆకలి కోరికలను తగ్గించవచ్చు. పోషకాహార నిపుణురాలు కరిష్మా షా బరువు తగ్గడానికి సహాయపడే కొన్ని ఆరోగ్యకరమైన అల్పాహార అలవాట్ల గురించి వివరించారు.(Freepik)
(2 / 7)
Opt for a big breakfast: ఎక్కువ కేలరీలు ఉండే అల్పాహారాన్ని తీసుకోండి. అల్పాహారంలో కేలరీలు తక్కువైతే అది రోజు గడిచేకొద్దీ ఆకలి స్థాయిలను పెంచుతుంది, స్వీట్లు తినాలనే కోరిక కలిగిస్తుంది. ఇలా అయితే బరువు పెరుగుతారు, దీనిని నివారించాలంటే ఉదయమే ఎక్కువ తినేయాలి.(Unsplash)
(3 / 7)
Opt for healthy sources of fat, fibre:మీరు కొవ్వును తగ్గించడానికి ప్రయత్నిస్తే, కేలరీలను అదుపులో ఉంచుకుంటూ ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన ఆహారాలను ఎంచుకోండి. ఆకలి నియంత్రణ, బరువు తగ్గడం లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఇది ముఖ్యమైనది.(Unsplash)
(4 / 7)
Never skip breakfast: అల్పాహారం దాటవేయడం వల్ల అధిక బరువు, ఊబకాయం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని నిరూపితమైంది. కాబట్టి, మీ అల్పాహారాన్ని ఎప్పుడూ మిస్ అవ్వద్దు.(iStock)
(5 / 7)
Include eggs: గుడ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి, ప్రోటీన్ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్లు తింటే శరీర బరువు తగ్గుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.(Unsplash)
(6 / 7)
Have high protein: అధిక ప్రోటీన్ అల్పాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొవ్వు పెరగదు, సరైన బరువును కలిగి ఉండటానికి ఉపయోగపడుతుంది.(Unsplash)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు