Foot Pain- Home Remedies | పాదాలలో నొప్పులా? ఈ చిట్కాలు పాటిస్తే వెంటనే ఉపశమనం!
రోజంతా నిలబడి ఉండటం వలన కాళ్లు, పాదాలు నొప్పి పుడతాయి. ఈ నొప్పులతో రాత్రి నిద్రకూడా పట్టదు. అయితే ఇంటి చిట్కాలతో పాదాల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకోండి.
ఎక్కువసేపు నిలబడి ఉండటం వలన పాదాలు నొప్పి పుడతాయి. ముఖ్యంగా మన ఇళ్లల్లో ఇంటి పనులు, వంటపనులు చూసుకునే వారు ఎక్కువగా నిల్చునే పనిచేస్తారు. ఉదయం త్వరత్వరగా అల్పాహారం సిద్ధం చేయటం దగ్గర్నించీ రాత్రి పసందైన భోజనం తయారు చేసేంతవరకు వారు నిల్చోనే ఉండాల్సి వస్తుంది. మిగతా ఇంటి పనుల బాధ్యత కూడా వారి భుజాలపై ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ప్రతిరోజూ ఇలా నిలబడి ఉండటం వలన వారి కాళ్లలో, పాదాలలో నొప్పి తలెత్తుతుంది. కొన్నిసార్లు పాదాలలో వాపు, మంటను కూడా అనుభవిస్తారు. మీ ఇంట్లోనూ ఇదే పరిస్థితి ఉంటే లేదా మీరు కూడా పాదాల నొప్పితో బాధపడుతున్నట్లయితే ఇక్కడ కొన్ని ఇంటి చిట్కాలను అందిస్తున్నాం. వీటిని పాటించటం ద్వారా మీరు మీ పాదాల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఎప్సమ్ ఉప్పు
ఎప్సమ్ సాల్ట్ ఉపయోగించి మీరు మీ పాదాల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. అదెలా అంటే.. ముందుగా ఒక వెడల్పాటి టబ్‌లో వేడి నీటిని నింపాలి, అందులో ఎప్సమ్ ఉప్పును కలపాలి. ఈ టబ్‌లో మీ పాదాలను 15 నుండి 20 నిమిషాల పాటు నీటిలో ముంచండి. ఇలా చేయడం వల్ల మీ పాదాల నొప్పి నయమవుతుంది. అంతేకాదు ఈ ఎప్సమ్ ఉప్పు ఒక ఖనిజ లవణం, మరిన్ని ప్రయోజనాలు కూడా అందుతాయి.
ఆవాల నూనె
ఆవనూనెతో పాదాలకు మసాజ్ చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మీ పాదాలలో నొప్పిగా ఉంటే, ఆవాల నూనెతో మసాజ్ చేసిన తర్వాత, పడుకుని కాసేపు విశ్రాంతి తీసుకోండి. పాదాలకు మసాజ్ చేయడం వల్ల పాదాల కండరాల బిగుతు తగ్గుతుంది, నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. రాత్రి పూట చేసుకుంటే మంచి నిద్ర కూడా పడుతుంది.
యాపిల్ వెనిగర్
ఆపిల్ వెనిగర్ సహాయంతో మీరు పాదాలలో నొప్పి సమస్యను నయం చేసుకోవచ్చు. నిరంతరం నిలబడటం లేదా కూర్చోవడం వల్ల కాళ్లు నొప్పిగా మారడం ప్రారంభిస్తే, ఒక టబ్‌లో గోరువెచ్చని నీటిని తీసుకోండి. దానిలో యాపిల్ వెనిగర్ వేసి కాసేపు ఆ నీటిలో మీ పాదాలను ముంచండి. ఈ నీటిలో పాదాలను ముంచి ఉంచడం వల్ల పాదాలలో నొప్పి తగ్గిపోతుంది.
స్ట్రెచ్చింగ్
మీరు పాదాల నొప్పిని వదిలించుకోవడానికి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయవచ్చు. నేలపై కూర్చోండి. కాళ్ళు నిఠారుగా చాచండి. ఆ తర్వాత పాదాల వేళ్లను చేతితో పట్టుకోవాలి. తర్వాత కాలి వేళ్లను లోపలికి తిప్పాలి. ఇలా 2 నుండి 3 సార్లు రిపీట్ చేసి రిలాక్స్ అవ్వండి. నొప్పి మటు మాయం అవుతుంది.
సంబంధిత కథనం