తెలుగు న్యూస్ / ఫోటో /
Ramadan 2022 : ఉపవాసంతో 5 ప్రయోజనాలు… ప్రాణాంతక వ్యాధుల నుంచి ఉపశమనం?
- పవిత్ర రంజాన్ మాసాన్ని భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లింలు జరుపుకుంటారు. ఈ పవిత్ర మాసంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వారు ఏమి తినరు. రోజంతా ఉపవాసం ఉండి భగవంతుని నామస్మరణ చేయడం ఆధ్యాత్మికతకే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ప్రాణాంతక వ్యాధులను కూడా దూరం చేస్తుంది.
- పవిత్ర రంజాన్ మాసాన్ని భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉండే ముస్లింలు జరుపుకుంటారు. ఈ పవిత్ర మాసంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు వారు ఏమి తినరు. రోజంతా ఉపవాసం ఉండి భగవంతుని నామస్మరణ చేయడం ఆధ్యాత్మికతకే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ప్రాణాంతక వ్యాధులను కూడా దూరం చేస్తుంది.
(1 / 7)
రంజాన్ మాసంలో ఉపవాసం చాలా ముఖ్యమైనది. ఇస్లాంలో ఉపవాసానికి మతపరమైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్నప్పటికీ.. ఇది శరీరానికి, ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరం. (HT)
(2 / 7)
అడపాదడపా ఉపవాసం చేయడం వల్ల శరీరంలోని హార్మోన్లు, కణాలు, జన్యువుల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయం చేస్తాయి. అంతేకాకుండా శరీరంలోని ఇన్సులిన్ స్థాయిని నియంత్రిస్తాయి. అదే సమయంలో.. జన్యువుల కార్యాచరణ పెరుగుతోంది.(HT)
(3 / 7)
రంజాన్‌లో 10 గంటల పాటు ఉపవాసం ఉండటం వల్ల శరీరంలోని అధిక కొవ్వు, కొవ్వును బాగా తగ్గించవచ్చు. ఎందుకంటే దీర్ఘకాలం ఉపవాసం చేయడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. (HT)
(4 / 7)
ప్రస్తుతం కాలంలో.. జీవనశైలి, ఆరోగ్యపు అలవాట్ల వల్ల చాలా మందికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. కానీ రంజాన్‌లో ఉపవాసం ఉండడం వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. అడపాదడపా ఉపవాసం రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది.(HT)
(5 / 7)
రంజాన్ సమయంలో ఉపవాసం చేయడం వల్ల శరీరంలోని ఆక్సీకరణ ఒత్తిడి, వాపు, రక్తంలోని చక్కెర, ఇన్సులిన్ నిరోధకత మెరుగుపడుతుంది. ఇది మెదడుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇది కణాలను ఆరోగ్యంగా చేస్తుంది. అంతేకాకుండా మెదడు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది శరీరాన్ని బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది.(HT)
(6 / 7)
రెగ్యులర్ ఉపవాసం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే శరీరంలోని మూలకణాలు, రోగనిరోధక వ్యవస్థ.. మరింత పారదర్శకంగా పనిచేయడానికి ఉపవాసం సహాయపడుతుంది. అదే సమయంలో… రంజాన్ సందర్భంగా ఉపవాసం చేయడం వల్ల ట్యూమర్ కిల్లింగ్ సెల్స్ ఉత్పత్తి పెరుగుతుంది.(HT)
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు