Holi Celebrations | భాంగ్ ఎక్కువ తాగితే సైకోసిస్​గా మారుతారా!-holi celebrations 2022 special story on over dose of bhang and side effects ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Holi Celebrations | భాంగ్ ఎక్కువ తాగితే సైకోసిస్​గా మారుతారా!

Holi Celebrations | భాంగ్ ఎక్కువ తాగితే సైకోసిస్​గా మారుతారా!

Geddam Vijaya Madhuri HT Telugu
Mar 18, 2022 12:04 PM IST

హోలీ రోజు రంగులు ఎంత ఫేమస్సో.. భాంగ్ కూడా అంతే ఫేమస్. ఉత్సాహంగా హోలీ ఆడిన తర్వాత.. భాంగ్ తీసుకోవడం చాలా కాలంగా వస్తూనే ఉంది. ఈ భాంగ్ వల్ల ఎంజాయ్ చేయడం ఏమో కానీ.. దుష్ప్రాభావాలు మాత్రం భాగానే ఉంటాయని అంటున్నారు నిపుణులు. మరి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

భాంగ్ వల్ల కలిగే నష్టాలు
భాంగ్ వల్ల కలిగే నష్టాలు

భాంగ్ తాగడం ఎల్లప్పుడూ హోలీతో ముడిపడి ఉంటుంది. దీనిని ఆడ గంజాయి లేదా గంజాయి మొక్క మొగ్గలు, ఆకులు, పువ్వుల నుంచి తయారైన తినదగిన మిశ్రమం నుంచి భాంగ్​ను తయారు చేస్తారు. దీనిలో పాలు, నేల గింజలు, వివిధ రకాల మసాలాలు కూడా కలిపి దీనిని చేస్తారు. దీనిని సాధారణంగా పండుగల సమయాల్లో వినియోగిస్తారు. 

భాంగ్​ను ఆయుర్వేద వైద్యంలో కూడా వినియోగిస్తారు. దీనిని వికారం, వాంతులు, శారీరక నొప్పితో సహా వివిధ రుగ్మతలకు నివారణగా వాడుతారు. ఇది కొన్ని ప్రయోజనాలను అందించినప్పటికీ.. భాంగ్ వల్ల దుష్ప్రభావాలు కూడా అన్నే ఉన్నాయి.

భాంగ్ వల్ల కలిగే దుష్ప్రభావాలు

1. కళ్లు ఎరుపెక్కడం

భాంగ్‌తో సహా గంజాయి ఆధారిత ఉత్పత్తిని తీసుకున్న తర్వాత.. ఒక వ్యక్తి హృదయ స్పందన రేటు, రక్తపోటు పెరుగుతుంది. ఇది ప్రాథమికంగా రసాయన సమ్మేళనాలు అయిన మొక్క కానబినాయిడ్స్ కారణంగా ఉంటుంది. రక్తపోటు, హృదయ స్పందన పెరుగుదల వ్యాయామం వల్ల కలిగే పెరుగుదల లాంటిది. కొంత సమయం తరువాత, రక్తపోటు తగ్గుతుంది. రక్త నాళాలు, కేశనాళికలు (కంటి సిరలతో సహా) విస్తరిస్తాయి. ఈ విస్తరణ కళ్ళకు రక్త ప్రసరణను పెంచుతుంది. దీని ఫలితంగా వ్యక్తి కళ్ళు ఎర్రగా మారుతాయి.

2. దగ్గు

అధిక భాంగ్ వినియోగం పొగాకు పొగ మాదిరిగానే ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. దీని వలన దగ్గు, కఫం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువ కాలం దీనిని తీసుకుంటే ఇది తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులకు కూడా కారణమవుతుంది.

3. నోరు పొడిబారడం

భాంగ్ నాడీ వ్యవస్థపై దాని ప్రభావాల కారణంగా నోటిలో ఉత్పత్తి అయ్యే లాలాజల పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఈ ప్రభావం తరచుగా ఉపయోగించడం వల్ల నోరు పొడిబారడం లేదా జిరోస్టోమియా అనే అసౌకర్య స్థితికి దారి తీస్తుంది. ఎక్కువ మోతాదులో తీసుకుంటే నోటి దుర్వాసన, నోటి పుండ్లు కూడా వస్తాయి.

4. హైపోటెన్షన్

హృదయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు భాంగ్ తీసుకోవడం వల్ల అధిక ఆరోగ్య ప్రమాదాలు ఉంటాయి. ఎందుకంటే భాంగ్ కార్డియాక్ వర్క్, కాటెకోలమైన్ స్థాయిలు, కార్బాక్సీహెమోగ్లోబిన్, హైపోటెన్షన్‌ను పెంచుతుంది.

5. చిరాకు

భాంగ్ ఒక్కోసారి వ్యక్తిని చికాకు పెట్టవచ్చు. ఈ పరిస్థితి కొన్ని గంటలపాటు మాత్రమే ఉంటుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

6. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత ఉండదు

భాంగ్ కొన్నిసార్లు జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది. ప్రాసెసింగ్ వేగం మందగించడం, ఏదైనా పనిపై ఫోకస్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. ఈ లక్షణాలు తరచుగా వారాలపాటు ఉండవచ్చు. భాంగ్ అధిక వినియోగం వల్ల కలిగే ఇతర హానికరమైన ప్రభావాలు నిద్రలేమి, మతిస్థిమితం, ఆందోళన, నియంత్రణ కోల్పోవడం/హఠాత్తుగా ప్రవర్తన, సైకోమోటర్ సమన్వయం లేకపోవడం, సైకోసిస్.

హోలీ అనేది ఆహ్లాదకరమైన, ఉల్లాసకరమైన పండుగ. దానికి రుచిని జోడించే ఏదైనా స్వాగతించబడుతుంది. కానీ మీరు కొంచెం జాగ్రత్తగా మిమ్మల్ని మీరు నిగ్రహించుకుంటే మంచిది. ముఖ్యంగా భాంగ్ వినియోగం విషయంలో కూడా.. మీరు కాస్త నిగ్రహాన్ని పాటిస్తే.. పండుగను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంజాయ్ చేయవచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం