Low Blood Pressure । బీపీ తక్కువవుతుందా? సాధారణ స్థాయిలో ఉంచేందుకు చిట్కాలు ఇవిగో!-top 6 ayurvedic remedies for managing low blood pressure ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Low Blood Pressure । బీపీ తక్కువవుతుందా? సాధారణ స్థాయిలో ఉంచేందుకు చిట్కాలు ఇవిగో!

Low Blood Pressure । బీపీ తక్కువవుతుందా? సాధారణ స్థాయిలో ఉంచేందుకు చిట్కాలు ఇవిగో!

HT Telugu Desk HT Telugu
May 05, 2023 04:10 PM IST

Low Blood Pressure: BP తక్కువైనపుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఆయుర్వేద నివారణ మార్గాలను ఇక్కడ తెలుసుకోండి.

Low Blood Pressure
Low Blood Pressure (Unsplash)

Low Blood Pressure: శరీరంలో రక్త ప్రవాహం అనేది సాధారణ స్థాయిలో ఉండాలి. రక్తపోటు ఎక్కువైనా, తక్కువైనా రెండూ ప్రమాదకరమే. ముఖ్యంగా లోబీపీకి గురైనపుడు ఉన్నప్పుడు గుండెకు, మెదడుకు సరఫరా అయ్యే ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతాయి. లోబీపీ తీవ్రమైతే ఆక్సిజన్ స్థాయిలు పూర్తిగా పడిపోయి ఆ వ్యక్తి గుండె, మెదడు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఇది చాలా ప్రాణాంతకమైన పరిస్థితి. రక్తం మీ నాళాల ద్వారా సాధారణం కంటే తక్కువ పీడనంతో ప్రవహించినప్పుడు లోబీపీ సంభవిస్తుంది, దీనిని హైపోటెన్షన్ (Hypotension) అని కూడా పిలుస్తారు.

బీపీ మానిటర్లో ఎగువకు వెళ్లే సిస్టోలిక్ రీడింగ్ 90mm Hg, అలాగే దిగువకు వెళ్లే డయాస్టొలిక్ రీడింగ్ 60 mm Hg కంటే తక్కువ రీడింగ్‌ను ( 90mm Hg/ 60mm Hg) లోబీపీగా పేర్కొనవచ్చు. BP పడిపోయినప్పుడు, మీ శరీర అవయవాలకు ఆక్సిజన్, పోషకాల సరఫరాలో అంతరాయం కలుగుతుంది. దీనివలన గందరగోళం, తలతిరగడం, అలసటగా అనిపించడం, చూపు మందగించడం, తలనొప్పి, మెడ నొప్పి, వికారం, గుండె దడ, చల్లగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంతమందిలో అసలు లక్షణాలేమి కనిపించకపోవచ్చు.

BP తక్కువైనపుడు గమనించవలసిన సాధారణ లక్షణాలు:

  • అస్పష్టమైన లేదా క్షీణించిన దృష్టి
  • తల తిరగడం లేదా తలతిరగడం
  • మూర్ఛపోవడం
  • అలసట
  • ఏకాగ్రత లోపం
  • వికారం

ఆయుర్వేద & గట్ హెల్త్ కోచ్, డాక్టర్ డింపుల్ జంగ్దా లోబీపీని నియంత్రించడంలో సహాయపడే ఆహారాలు, ఆయుర్వేద నివారణలు గురించి వివరించారు. అవి ఇక్కడ తెలుసుకోండి.

Ayurvedic- Home Remedies for Low BP- లోబీపీని పరిష్కరించే ఆయుర్వేద చిట్కాలు

1. రాత్రిపూట నానబెట్టిన ఎండుద్రాక్షను ఖాళీ కడుపుతో తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది. 5 ఎండు ద్రాక్షలను రాత్రిపూట నానబెట్టి, మరుసటి రోజు ఉదయం నానబెట్టిన నీటితో పాటు కలిపి తీసుకోండి. ఇది మీ శరీరంలో ఐరన్ లెవెల్స్‌ను పెంచడానికి గొప్ప మార్గం.

2. శరీరంలో హైడ్రేషన్ లెవెల్స్‌ని మెయింటెయిన్ చేయడానికి తగినంత నీరు త్రాగాలి.

3. అవసరమైన విటమిన్లు, ఖనిజాల కోసం ప్రతిరోజూ పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినండి

4. లో బీపీతో బాధపడుతున్నప్పుడు క్యారెట్, పాలకూర జ్యూస్ లు తాగితే అద్భుతం ప్రభావం ఉంటుంది.

5. ఉసిరి రసం రక్తపోటును నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. రోజుకు ఒక ఉసిరిని తింటే చాలు. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి. మీరు తినే ఇతర ఆహారాల నుండి పోషకాలను గ్రహించడానికి ఇది గొప్ప మార్గం.

6. తులసి ఆకులు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ ఉదయం 5-6 తులసి ఆకులను నమలడం వల్ల రక్త ప్రసరణ సాధారణ స్థితికి వస్తుంది.

లోబీపీ ఉన్నప్పుడు ఈ ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా లక్షణాలను అదుపు చేసుకోవచ్చు అని ఆయుర్వేద నిపుణులు పేర్కొన్నారు. మీకు లోబీపీ సమస్య ఎక్కువ ఉంటే వైద్యుడిని సంప్రదించండి.

Whats_app_banner

సంబంధిత కథనం