High Blood Pressure: రక్త ప్రవాహం రక్తనాళాల గోడలపై పీడనంతో నెట్టడం జరిగినపుడు కలిగే పరిస్థితిని రక్తపోటు లేదా అధిక రక్తపోటు అంటారు. దీని కారణంగా మీ గుండె, రక్త నాళాలు రక్తాన్ని పంప్ చేయడానికి ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. ఈ పరిస్థితి వాటి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాలక్రమేణా, ఇది ధమనుల లోపల కణజాల నష్టానికి దారితీస్తుంది. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. హైపర్‌టెన్షన్ ఉన్నప్పటికీ చాలా సార్లు దీని లక్షణాలు బయటపడవు. అందుకే దీనిని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు.
ఆరోగ్య సంస్థల మార్గదర్శకాల ప్రకారం రక్తపోటు 120/80 mmHg వరకు ఉంటే దానిని సాధారణంగా చెప్తారు. ధమనులలో 140/90 mmHg కంటే ఎక్కువగా దీర్ఘకాలికంగా పెరిగిన రక్తపోటును హైపర్‌టెన్షన్ గా సూచిస్తారు. ఇందులో 140 mmHg స్థాయిని సిస్టోలిక్ రక్తపోటు (SBP)గా చెబితే, 90 mmHg స్థాయిని డయాస్టోలిక్ రక్తపోటు (DBP) గా నిర్వచిస్తారు.
హైపర్‌టెన్షన్‌లలోనూ వివిధ రకాల హైపర్‌టెన్షన్‌లు ఉంటాయి. మీ రక్తపోటు నిరంతరం ఎక్కువగా ఉంటే, ముందు అది ఏ రకమైనదో తెలుసుకోండి. తదనుగుణంగా చికిత్స తీసుకుంటే ముప్పు నుంచి బయటపడవచ్చు.
ఇది సాధారణంగా లక్షణరహితంగా ఉంటుంది. సాధారణ రక్తపోటు చెకప్ లేదా కమ్యూనిటీ స్క్రీనింగ్ ద్వారా దీనిని గుర్తించవచ్చు. స్థూలకాయం, డయాబెటిస్ మెల్లిటస్, హృదయ సంబంధ వ్యాధులు, 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, ధూమపానం చేసే వ్యక్తులు ప్రాథమికంగా రక్తపోటును కలిగి ఉంటారు, వారు చెకప్ చేయించుకోవాలి.
BP అకస్మాత్తుగా పెరిగినపుడు కలుగుతుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, ఆల్డోస్టెరోనిజం, రెనోవాస్కులర్ హైపర్‌టెన్షన్, మూత్రపిండ అనారోగ్యం (OSA) వంటి పరిస్థితులు సెకండరీ హైపర్ టెన్షన్‌కు దారితీయవచ్చు. హైపర్‌టెన్సివ్ కేసుల్లో దాదాపు 5-10% సెకండరీ హైపర్‌టెన్షన్‌ను అభివృద్ధి చేయవచ్చు.
గర్భస్థ రక్తపోటు.. ఇది గర్భిణీ స్త్రీలను ప్రభావితం చేసే పరిస్థితి. ఇది చాలా ప్రమాదకరమైనది. ప్రసూతి మరణాలు, పిండం లోపాల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది ప్రీఎక్లంప్సియా నిర్ధారణతో లేదా లేకుండా సంభవించవచ్చు.
దీనినే ఐసోలేటెడ్ క్లినిక్ హైపర్‌టెన్షన్ అని కూడా పిలుస్తారు, ఇది పెరిగిన ఆఫీసు బ్లడ్ ప్రెజర్ ద్వారా వర్గీకరిస్తారు, అంబులేటరీ బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ ఉపయోగించి నిర్ధారిస్తారు. ఆఫీస్ BP స్థాయిలు వారి అంబులేటరీ విలువల కంటే కనీసం 20/10 mmHg ఎక్కువగా ఉంటే దానిని వైట్ కోట్ హైపర్‌టెన్షన్ అని నిర్ధారిస్తారు. పెద్దవారి కంటే యువకుల్లోనే ఈ వైట్ కోట్ హైపర్‌టెన్షన్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
చికిత్స చేసినా రోగి రక్తపోటును నియంత్రించడంలో విఫలమైనప్పుడు దానిని రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ అని నిర్ధారిస్తారు. హైబీపీ ఉన్న 10% మంది రోగుల్లో రెసిస్టెంట్ హైపర్ టెన్షన్ ఉండవచ్చు. హృదయ సంబంధ వ్యాధులు, ఆర్గాన్ ఫెయిల్యూర్ వంటి పరిస్థితుల్లో ఈ రకమైన హైబీపీ ఉంటుంది.