Overcoming Addiction : వ్యసనాల నుంచి బయటపడలేకపోతున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే-top 5 strategies to overcome any addiction here is the tips ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Top 5 Strategies To Overcome Any Addiction Here Is The Tips

Overcoming Addiction : వ్యసనాల నుంచి బయటపడలేకపోతున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే

Geddam Vijaya Madhuri HT Telugu
Jan 28, 2023 08:15 AM IST

Overcoming Addiction : వ్యసనాలను అధిగమించాలని అనుకోవడం సులువే కానీ.. మానేయడం చాలా కష్టం. చాలామంది ఈరోజు నుంచి ఇది మానేయాలి.. అది చేసేయాలనుకుంటారు కానీ.. కొంచెంసేపటి తర్వాత దానిని విస్మరిస్తారు. అలాకాకుండా మీరు పూర్తిగా వ్యసనాలకు దూరం కావాలంటే కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు.

వ్యసనాల నుంచి బయటపడాలంటే వీటిని ఫాలో అవ్వండి
వ్యసనాల నుంచి బయటపడాలంటే వీటిని ఫాలో అవ్వండి

Overcoming Addiction : కొన్ని అలవాట్లు అనుకోకుండా మొదలవుతాయి. సంతోషంలోనో.. పార్టీలోనో.. బాధలోనో.. ఆ మూమెంట్​లో తెలియకుండా కొన్ని అలవాటు చేసుకుంటాము. అవి తర్వాత ఇష్టాలుగా మారుతాయి. అనంతరం అవి తెలియకుండానే వ్యసనాలుగా మారుతాయి. కొన్నిసార్లు పరిస్థితులు ప్రేరేపించడం వల్ల.. సంబంధాలు, పని, ఆరోగ్యం, ఒత్తిడి వంటి మీ జీవితాన్ని వ్యసనాల వైపు మళ్లేలా చేస్తాయి. అవి మిమ్మల్ని నాశనం చేస్తాయి. మీరు, మీ కుటుంబం బాగుండాలి అంటే.. మీరు వాటితో పోరాడటం చాలా ముఖ్యం. మరి మీ వ్యసనాల నుంచి బయటపడేలా చేసే వ్యూహాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీ వ్యసనాన్ని అధిగమించడానికి నిర్ణయం తీసుకోండి

మీ వ్యసనాలను అధిగమించాలంటే ముందుగా మీరు చేయాల్సింది ఏమిటంటే.. మీరు నిజంగా దానిని మానేయాలని కోరుకోవడం. మీరు నిర్ణయించుకోవడంతోనే ఏదైనా మార్పు మీ జీవితంలో జరుగుతుంది. ఈ నిర్ణయం మీరు నిబద్ధతతో, అంకితభావంతో ఉండేలా చేస్తుంది.

ఈ వ్యసనాన్ని ఎలా వదిలించుకోవాలి.. దీనిని వదిలేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ అలవాటును దూరం చేసుకోవడానికి మనకి ఏ వనరులు అవసరమవుతాయి అనే దానిపై అంచనాకు రండి.

మీ చుట్టూ ఉన్న పరిస్థితులను మార్చండి..

మీ పర్యావరణం, కంపెనీ, ఇతర ట్రిగ్గర్‌లను వీలైనంత త్వరగా మార్చండి. మీ వ్యసనాన్ని ప్రోత్సహించే ప్రాంతం లేదా ఎవరైనా మీకు కంపెనీ ఇచ్చేవారు.. మీ దగ్గర దాని ప్రస్తావన తెచ్చేవారిని మీరు దూరంగా ఉంచండి. ఇది మీలో త్వరిత, సమర్థవంతమైన మార్పునిస్తుంది.

ఉదాహరణకు.. మీరు డ్రగ్స్ లేదా ఆల్కహాల్‌కు బానిసలైతే.. వాటిలో మునిగిపోయే వారిని.. వాటిని సేవించమని ప్రోత్సాహించేవారిని మీరు దూరంగా ఉంచాలి. లేదంటే మీరు ఇంటర్నెట్‌లో ఎక్కువ అడల్ట్ కంటెంట్‌ను చూసే అలవాటు ఉన్నట్లయితే.. దానిని కంట్రోల్ చేయడానికి.. మీ గాడ్జెట్‌లో సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.

మిమ్మల్ని మీరు బిజీగా మార్చుకోండి..

వ్యసనాన్ని అధిగమించే ప్రక్రియలో మీరు తప్పనిసరిగా చేయవలసిన ఒక విషయం ఏమిటంటే బిజీగా ఉండటం. మీరు ఏదైనా పనిలో నిమగ్నమై ఉంటే.. మీరు మీ వ్యసనాల వైపు దృష్టి మరలదు. అయితే ఆ పనిలో మీ వ్యసనానికి సంబంధించిన అంశాలు ఎక్కడా లేకుండా చూసుకోండి.

ఉదాహరణకు మీకు తినే అలవాటు ఉంతే.. వంట చేయడం కరెక్ట్ కాదు. దానికి బదులుగా మీరు జిమ్‌కు వెళ్లవచ్చు. తినే అలవాటు దూరం అవుతుంది. బాడీ ఫిట్​గా మారుతుంది.

సపోర్ట్ తీసుకోండి..

మీ వ్యసనాలపై విజయం సాధించే ప్రాసెస్​లో మీకు హెల్ప్​ చేస్తారు అనుకునేవారి సహాయం తీసుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ మనసు మారి లేదా ఒత్తిడివల్ల మళ్లీ ఆ వ్యసనం జోలికి వెళ్లాలి అనుకున్నా.. వారు మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు. అదనంగా వారి సొంత ఆలోచనలు, వ్యూహాలతో మీరు త్వరగా ఈ వ్యసనానికి దూరమయ్యేలా చేస్తారు.

మీపై మీరు నమ్మకముంచండి..

మీపై మీరు నమ్మకముంచండి అని సులభంగా చెప్పవచ్చు కానీ.. వ్యసనాలను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. ఇదే అతి ముఖ్యమైన దశ. ఎందుకంటే దీనిని నేను ఓవర్​కామ్ చేయగలనా? అసలు నేను ఈ అలవాటును మానుకోగలనా? అనే ప్రశ్నలకు మీకు మీరే సమాధానం ఇచ్చుకోవాలంటే.. మీపై మీరు నమ్మకముంచండి.

ఎందుకంటే కొన్నిసార్లు వెనక్కి తగ్గడం, ప్రేరణ కోల్పోవడం, నెమ్మదించడం లేదా మళ్లీ అలవాట్లకు లొంగిపోవాలనుకుని మీకు అనిపించే సందర్భాలు చాలా ఉంటాయి. అయినప్పటికీ.. మిమ్మల్ని మీరు విశ్వసిస్తే.. ప్రక్రియకు ఎటువంటి ఆటంకం కలిగించదు.

WhatsApp channel

సంబంధిత కథనం