(1 / 6)
మీ రోజూవారీ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా గుండె జబ్బులు, ఆకస్మిక గుండె పోట్లు, ఇతర సమస్యలను నివారించవచ్చు.
(Freepik)(2 / 6)
చాలా మందికి అధిక రక్తపోటు సమస్య ఉంటుంది. ఇది గుండెపోటు వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. దాని అదుపులో ఉంచుకోండి, క్రమం తప్పకుండా మందులు తీసుకోండి.
(Freepik)(3 / 6)
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. కాబట్టి వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. సెలవు దినమైనా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గుండె సమస్యలు దరిచేరవు.
(Freepik)(4 / 6)
పండ్లు ఎక్కువగా తినడం ముఖ్యం. చిరుతిండి స్థానంలో పండ్లు తీసుకోండి. దీనివల్ల శరీరంలో చెడు కొవ్వులు, కొలెస్ట్రాల్ లేదా కార్బోహైడ్రేట్లు పేరుకుపోవు. ఫలితంగా గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది.
(Freepik)(5 / 6)
పిజ్జా బర్గర్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్, కొవ్వు పరిమాణం పెరుగుతుంది. ఇది పూర్తిగా హానికరం.
(Freepik)(6 / 6)
చాలా మంది లంచ్, డిన్నర్ సమయంలో కడుపు నిండా తింటారు. బదులుగా, చిన్న భోజనం తినండి. ఇది జీర్ణ ప్రక్రియపై ఎక్కువ ఒత్తిడిని కలిగించదు. మీకు బాగా ఆకలిగా ఉంటే, కొన్ని పండ్లు తినవచ్చు.
(Freepik)ఇతర గ్యాలరీలు