Tomato Ketchup: టమాటో కెచప్ తినడానికే కాదు, ఇలా ఇంట్లోనే వస్తువులను తళతళ మెరిపించేందుకు వాడవచ్చు
Tomato Ketchup: టమాటో కెచప్ పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఉంటుంది. దీన్ని కేవలం తినడానికే కాదు, ఇంట్లోనే కొన్ని వస్తువుల మురికిని వదిలేసి మెరిసేలా చేయడానికి వినియోగించవచ్చు.
Tomato Ketchup: నూడుల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి జంక్ ఫుడ్ లో టమాటా కెచెప్ వేసుకొని తింటూ ఉంటారు. ప్రతి ఇంట్లో టమాటా కెచప్ సాధారణంగా ఉంటుంది. టమోటో కెచప్ ఆరోగ్యానికి మేలే చేస్తుంది.అయితే దీన్ని కేవలం తినడానికే కాదు, ఇంట్లోని కొన్ని వస్తువుల మురికిని వదిలించడానికి కూడా వినియోగించవచ్చు. దీనిలో క్లీనింగ్ ఏజెంట్ లక్షణాలుఎక్కువగా ఉన్నాయి. టమాటో కెచప్ ని ఉపయోగించి ఎలాంటి వస్తువులను తళతళ మెరిసేలా చేయవచ్చో తెలుసుకోండి.
ఆభరణాలు
ప్రతి ఇంట్లో బంగారు, వెండి ఆభరణాలు ఉంటాయి. అవి నల్లగా మురికి పట్టినప్పుడు ఈ టమాటో కెచప్‌ను వాటిపైన వేసి పావుగంట పాటు వదిలేయండి. తర్వాత ఒక మృదువైన బ్రష్‌తో లేదా వస్త్రంతో తుడవండి. అవి మెరుపును సంతరించుకుంటాయి. తర్వాత ఓసారి కడిగి పొడి టవల్‌తో తుడిచేయాలి.
తుప్పు వదిలించేందుకు
కొన్ని లోహపు వస్తువులకు తుప్పు పడుతూ ఉంటాయి. వాటి తుప్పు వదిలించేందుకు కెచప్‌ను వినియోగించవచ్చు. ఎందుకంటే ఈ కెచప్‌ను టమాటోలతో తయారుచేస్తారు. టమాటోలలో ఆమ్ల స్వభావం ఉంటుంది. కాబట్టి తుప్పు పట్టిన పాత్రల్లో కెచప్‌ను వేసి ఒక గంట పాటు వదిలేయాలి. ఆ తర్వాత బ్రష్షు లేదా స్పాంజితో రుద్దితే తుప్పు పోతుంది.
మెటల్ పాత్రలు మెరిసేలా
ఇత్తడి, రాగి వంటి వాటితో చేసిన మెటల్ పాత్రలను మెరిపించేందుకు టమాటా కెచప్‌ను వినియోగించవచ్చు. ఎక్కువ రోజులు మెటల్ పాత్రలను వినియోగించకపోతే అవి నల్లగా మరకలు పడతాయి. అలాంటి పాత్రలపై టమాటో కెచప్‌ను వేసి బాగా పాలిష్ చేయాలి. మురికిని పోగోడుతుంది.
ఫేషియల్‌కి...
టమాటో కెచప్ తో ఫేషియల్ కూడా వేసుకోవచ్చు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు, లైకోపీన్ అధికంగా ఉంటాయి. ఈ కెచప్ ను ముఖంపై అప్లై చేసుకున్నాక పావుగంట పాటు వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మాన్ని మెరిపిస్తుంది.
వెండి
ప్రతి ఇంట్లోనూ వెండి సామాగ్రి ఉండడం సహజం. వెండి వస్తువులు త్వరగా మెరుపును కోల్పోతాయి. అలాంటప్పుడు కెచప్ తో వెండి సామాగ్రిని తోమడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇది తేలికపాటి ఆమ్లత్వాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి వెండి వస్తువులు ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటాయి.
ఇంట్లో ఉన్న గ్రిల్స్ దుమ్ము, ధూళి పట్టినప్పుడు కూడా వాటిని శుభ్రం చేయడానికి గ్రిల్ పై కెచప్‌తో రుద్దండి. మురికి పోయి అవి తళ తళ మెరుస్తాయి.
టాపిక్