Tomato Ketchup Problems : టొమాటో కెచప్ ఎక్కువగా తింటున్నారా? అయితే జాగ్రత్త-side effects of tomato ketchup eating details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tomato Ketchup Problems : టొమాటో కెచప్ ఎక్కువగా తింటున్నారా? అయితే జాగ్రత్త

Tomato Ketchup Problems : టొమాటో కెచప్ ఎక్కువగా తింటున్నారా? అయితే జాగ్రత్త

HT Telugu Desk HT Telugu
Apr 08, 2023 10:45 AM IST

Tomato Ketchup Problems : సమోసాలు, కర్రీ పఫ్‌లు, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, బర్గర్‌లు లేదా నూడుల్స్.. తినేప్పుడు.. టొమాటో కెచప్ అవసరం. అయితే రుచిగా ఉండే టొమాటో కెచప్ తింటే.. కొన్ని సమస్యలు వస్తాయి. ఈ జబ్బులు మీపై పడతాయనే విషయం గుర్తుంచుకోండి.

టొమాటో కెచప్
టొమాటో కెచప్

కొన్ని రకాల ఫుడ్ మీద టొమాటో కెచప్(Tomato Ketchup) వేస్తే.. తినేందుకు టేస్టీగా ఉంటుంది. కొంతమంది టొమాటో కెచప్ అధికంగా తింటారు. కొన్ని బేకరీ ఐటమ్స్(Bakery Items) తినాలంటే.. టొమాటో కెచప్ కావాలి. కెచప్ లేకుండా తింటే ఏదో వెలితిగా ఉంటుంది. టొమాటోను తరచుగా కెచప్‌లో ఉపయోగిస్తారు. టమోటా కెచప్ ప్రయోజనాల గురించి చాలా విన్నారు. నాణేనికి మరోవైపు ఉన్నట్టుగానే.. దాని నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకోండి.

కెచప్‌ను ఎక్కువ కాలం వాడితే ఆరోగ్యం(Health)పై చెడు ప్రభావం చూపుతుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. కెచప్‌లో చక్కెర చాలా ఎక్కువ. కనుక ఇది ఆరోగ్యానికి హానికరం. కెచప్‌లో సోడియం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కెచప్‌ను మితంగా తీసుకోవడం మంచిది.

టొమాటో కెచప్‌లో ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్(cholesterol), మధుమేహాన్ని పెంచుతుంది. ఇన్సులిన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ జబ్బులు రాకుండా ఉండాలంటే కెచప్ తక్కువగా తినడం మంచిది. మీరు ఇప్పటికీ టొమాటో కెచప్ కావాలనుకుంటే, ఇంట్లో తయారుచేసిన కెచప్ ఉపయోగించడం మంచిది.

టొమాటో కెచప్ ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలను(Kidney) ప్రభావితం చేసే కాల్షియం పరిమాణం పెరుగుతుంది. టొమాటో లాగానే దాని గింజలు కూడా శరీరంలోకి ప్రవేశిస్తాయి. అయితే ఈ విత్తనాలను తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.

ఎందుకంటే విత్తనాలు నేరుగా కిడ్నీకి సులభంగా చేరుతాయి. ఇది కిడ్నీలో రాళ్లు(Kidney Stones) ఏర్పడటాన్ని ప్రోత్సహిస్తుంది. కెచప్‌లో హిస్టామిన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉన్నందున టొమాటో కెచప్‌ను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో అలెర్జీ ప్రతిచర్యలు ప్రేరేపిస్తాయి.

టొమాటో కెచప్ తింటే ఎసిడిటీ(acidity) సమస్య వస్తుంది. నిజానికి, ఇందులో అధిక మొత్తంలో యాసిడ్ ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల ఎసిడిటీ వస్తుంది. ఇది అధిక ఫ్రక్టోజ్ చక్కెరను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది సాధారణ కార్న్ సిరప్, ఉల్లిపాయ పొడిని కూడా కలిగి ఉంటుంది. జన్యుపరంగా మార్పు చెందిన జీవి (GMO) మొక్కజొన్న నుండి తయారు చేయబడింది. ఇందులో చాలా రసాయనాలు, పురుగుమందులు ఉంటాయి. కాబట్టి టొమాటో సాస్ ఆరోగ్యానికి మంచిది కాదు. టొమాటో కెచప్‌లోని టెర్పెన్ కంటెంట్ శరీర దుర్వాసనను కలిగిస్తుంది. ఆర్గానిక్ టొమాటోలకు బదులు రసాయన టొమాటోలు మార్కెట్ లో ఉన్నాయి. ఇవి అధిక రక్తపోటుతో సహా ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.

Whats_app_banner