Gold Facial at Home: ఇంట్లో దొరికే వస్తువులతోనే ఖరీదైన గోల్డ్ ఫేషియల్ ఇలా చేసుకోండి-make an expensive gold facial with household items gold facial at home ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gold Facial At Home: ఇంట్లో దొరికే వస్తువులతోనే ఖరీదైన గోల్డ్ ఫేషియల్ ఇలా చేసుకోండి

Gold Facial at Home: ఇంట్లో దొరికే వస్తువులతోనే ఖరీదైన గోల్డ్ ఫేషియల్ ఇలా చేసుకోండి

Haritha Chappa HT Telugu
Jul 01, 2024 02:00 PM IST

Gold Facial at Home: ఇంట్లోనే ఖరీదైన గోల్డ్ ఫేషియల్ ను సులభంగా చేయవచ్చు. అంతే కాదు ఈ ఫేషియల్ ప్రత్యేకత ఏంటంటే వంటగదిలో ఉండే నేచురల్ వస్తువులను మాత్రమే వాడడం ద్వారా ఈ ఫేషియల్ వేసుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి అలెర్జీలు కూడా రావు.

గోల్డ్ ఫేషియల్
గోల్డ్ ఫేషియల్ (shutterstock)

Gold Facial at Home: ముఖానికి మసాజ్‌లు, ఫేషియల్ వంటివి చేయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. మచ్చలు కూడా పోతాయి. ముఖంపై ఉన్న సన్నని గీతలు, మరకలు, మచ్చలు వంటి సమస్యలను తొలగించడానికి ఇలా ఫేషియల్స్ సహాయపడతాయి. కానీ పార్లర్లలో ఫేషియల్స్‌కు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తారు. ఖరీదైన ఫేషియల్స్‌లో గోల్డ్ ఫేషియల్ ఒకటి.

మీ ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి పార్లర్ కు వెళ్లి డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని సులభంగా ఖరీదైన గోల్డ్ ఫేషియల్స్ చేసుకోవచ్చు. అంతే కాదు ఈ ఫేషియల్ ప్రత్యేకత ఏంటంటే వంటగదిలో ఉండే నేచురల్ వస్తువులతోనే చేసుకోవచ్చు. దీని వల్ల చర్మంపై అలెర్జీలు, మచ్చలు వంటివి రాకుండా ఉంటటాయి. కాబట్టి ఇంట్లో కూర్చొని ఖరీదైన గోల్డ్ ఫేషియల్స్ ఎలా చేయాలో తెలుసుకోండి.

ఇంట్లో గోల్డ్ ఫేషియల్ ఎలా చేయాలి?

గోల్డ్ ఫేషియల్‌ను మొదటగా ఫేస్ క్లెన్సింగ్‌తో ప్రారంభించాలి. దీని కోసం ముందుగా 4 టేబుల్ స్పూన్ల పచ్చి పాలను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో దూదిని ముంచాలి. ఇప్పుడు ఆ దూదితో ముఖానికి, మెడకు అప్లై చేసి 1 నిమిషం పాటు మసాజ్ చేయాలి. తరువాత సాధారణ నీటితో శుభ్రపరచుకోవాలి.

ఆవిరి పట్టడం

క్లెన్సింగ్ పూర్తయ్యాక ముఖానికి ఆవిరి పట్టాలి. ఇందుకోసం జుట్టుకు షవర్ క్యాప్ పెట్టుకోవాలి. 2 నిమిషాల పాటు ముఖానికి ఆవిరి పట్టాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. ఆ తర్వాత ముఖం, మెడ టవల్ తో తుడుచుకుంటే మురికి, మృతకణాలు తొలగిపోతాయి.

ఫేస్ స్క్రబ్బింగ్

ఆవిరి పట్టిన తర్వాత ముఖానికి ఫేస్ స్క్రబ్బింగ్ చేయాలి. ఇందుకోసం ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ పంచదార, అర టీస్పూన్ తేనె వేసి అన్నింటిని బాగా కలపాలి. ఇప్పుడు ఆ మిశ్రమంతో ముఖాన్ని రెండు నిమిషాల పాటూ స్క్రబ్ చేయాలి. వేళ్లతోనే కనీసం పదినిమిసాలు స్క్రబ్ చేయాలి.

ఇప్పుడు గోల్డ్ ఫేషియల్ కోసం ఫేస్ మసాజ్ క్రీమ్ తయారు చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ తీసుకుని అన్నింటిని ఒక బౌల్ లో వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ క్రీమ్ తో ముఖానికి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తరువాత మెత్తటి టవల్ తో తుడుచుకోవాలి.

ఫేస్ మాస్క్ తయారీ

ఇప్పుడు ఫేస్ మాస్క్‌ను తయారు చేసుకోవాలి. ఫేస్ మాస్క్ తయారు చేయడానికి ఒక గిన్నెలో పావు స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్ల శెనగపిండి, 2 టేబుల్ స్పూన్ల పాలు, 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, 1 టీస్పూన్ తేనె వేసి అన్నింటిని బాగా కలపాలి. ఇప్పుడు ఈ తయారుచేసిన పేస్ట్ ను ముఖానికి పట్టించి 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. మీ చర్మం జిడ్డుగా ఉంటే, మాస్క్ తయారు చేయడానికి తేనెను వేసుకోవద్దు. తరువాత ముఖం శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. అంతే గోల్డ్ ఫేషియల్ రెడీ అయినట్టే.

Whats_app_banner