Sugar Free Almond Burfi Recipe : షుగర్ ఫ్రీ ఆల్మండ్ బర్ఫీ పండుగకు ఇంటిల్లిపాదీ ఎంజాయ్ చేయండి..-today diwali special recipe is sugar free almond burfi here is the making process ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Today Diwali Special Recipe Is Sugar Free Almond Burfi Here Is The Making Process

Sugar Free Almond Burfi Recipe : షుగర్ ఫ్రీ ఆల్మండ్ బర్ఫీ పండుగకు ఇంటిల్లిపాదీ ఎంజాయ్ చేయండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Oct 19, 2022 06:52 AM IST

Sugar Free Almond Burfi Recipe : ఎంత కఠినమైన డైట్ తీసుకున్నా.. పండుగ సమయాల్లో కచ్చితంగా చీట్ డే ఉండాలి. అలాంటి సందర్భంలో మిమ్మల్ని టేస్ట్​తో అదరగొట్టే ఓ స్వీట్.. చక్కెర లేకుండా వచ్చిందనుకో.. మీరు హ్యాపీ మీ టమ్మీ హ్యాపీ. మరి ఇంకెందుకు ఆలస్యం.. షుగర్ ఫ్రీ ఆల్మండ్ బర్ఫీని ఈ పండుగకు తయారు చేసుకోండి. దానిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ ఫ్రీ ఆల్మండ్ బర్ఫీ
షుగర్ ఫ్రీ ఆల్మండ్ బర్ఫీ

Sugar Free Almond Burfi Recipe : పండుగంటే ఎవరికైనా స్వీట్ తినాలని ఉంటుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి కూడా స్వీట్ క్రావింగ్స్ ఎక్కువ ఉంటాయి. అయితే ఈ పండుగకి వారిని డిస్పాంయింట్ చేయకుండా.. మీరు ఫిట్​నెస్ ఫ్రీక్ అయినా కూడా ఇది మీకు కూడా మంచిగా హెల్ప్ చేస్తుంది. అయితే ఇలాంటి వారికోసం షుగర్ ఫ్రీ బాదం బర్ఫీని తయారుచేసేయండి. మరి దీనిని ఎలా తయారు చేస్తారో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

* ఖోయా - 500 గ్రాములు

* స్వీటెనర్ - 40 గ్రాములు (ఆప్షనల్)

* బాదం పప్పులు - 1 కప్పు (పొడి చేసుకోండి..)

షుగర్ ఫ్రీ ఆల్మండ్ బర్ఫీ తయారీ విధానం

ఖోయాను తీసుకుని.. దానిని తురుమి పక్కన పెట్టండి. ఇప్పుడు పాన్ వేడి చేసి.. ఖోయా వేయండి. ఇప్పుడు మీరు స్వీటెనర్ ఒకటి ఉపయోగిస్తుంటే 40 గ్రా స్వీటెనర్ వేసి 3-4 నిమిషాలు.. తక్కువ వేడి మీద ఉడికించండి. దానిని మంట మీద నుంచి తీసివేసి.. బాగా కలపాలి. దానిలో బాదం పొడి వేసి.. వెంటనే సర్వింగ్ డిష్‌కి బదిలీ చేయాలి. మీరు మిగిలిన స్వీటెనర్‌ను పైన చల్లుకోవచ్చు. దానిని 200 C వద్ద వేడిచేసిన ఓవెన్‌లో ఉంచాలి. తీసిన వెంటనే కూడా సర్వ్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత తినొచ్చు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్