Breakfast Recipe : కొబ్బరి, బాదంతో చేసిన పోహా అత్యుత్తమ అల్పాహారం ఎంపిక. ఈ పోహా రెసిపీని సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పైగా ఇది ఆరోగ్యకరమైనది కూడా. బాదం, కొబ్బరి మీకు ఆసక్తికరమైన టేస్ట్‌ను ఇస్తుంది. కొలెస్ట్రాల్ సున్నా. కానీ అధిక ప్రోటీన్, కాల్షియం విలువతో కూడిన సరళమైన వంటకం. కాబట్టి ఫిట్నెస్ గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకునేవారు కూడా దీనిని హ్యాపీగా తమ డైట్లో చేర్చుకోవచ్చు. మరీ ఈ రెసిపీ తయారీ, కావాల్సిన పదార్థాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
* బాదం ఫ్లేక్స్ - 200 గ్రాములు (బాదం పప్పులను సన్నగా తరగాలి)
* ఉల్లిపాయలు - 450 గ్రాములు
* పోహా - 200 గ్రాములు
* సాల్ట్ - తగినంత
* నూనె - 20 మి.లీ
* కరివేపాకు - 8 రెబ్బలు
* పచ్చిమిర్చి - 2
* తాజా కొబ్బరి - 100 గ్రాములు
పోహాను చల్లటి నీళ్లలో నానబెట్టి.. వడకట్టి పక్కన పెట్టుకోవాలి. 3/4వ వంతు బాదం రేకులను నీళ్లలో నానబెట్టి.. మిగిలిన వాటిని టోస్ట్ చేయాలి. అనంతరం పాన్‌లో నూనె తీసుకుని.. ఆవాలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి.
ఇప్పుడు ఆ తాళింపులో నానబెట్టిన పోహా, బాదంపప్పు వేయాలి. అనంతరం తరిగిన కొత్తిమీర, తాజా కొబ్బరి తురుమును వేసుకోవాలి. చివరిలో రోస్ట్ చేసిన బాదంపప్పులను వేసి.. వేడిగా సర్వ్ చేసుకోవడమే.
సంబంధిత కథనం