సెక్స్‌టింగ్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే..-tips for sexting the dos and don ts of sexting ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  సెక్స్‌టింగ్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే..

సెక్స్‌టింగ్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే..

HT Telugu Desk HT Telugu
Aug 13, 2024 08:00 AM IST

ప్రస్తుతమున్న యూత్​కి సెక్స్‌టింగ్ అంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే చాలామంది దీనిని ఓ కామన్ థింగ్​లా చేస్తున్నారు. అయితే మీరు కూడా సెక్స్‌టింగ్ చేయాలి అనుకుంటే.. కొన్ని చేయవల్సిన, చేయకూడని పనులున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సెక్స్‌టింగ్ టిప్స్
సెక్స్‌టింగ్ టిప్స్

ప్రతిసారి వ్యక్తిగత శృంగారం కలిగి ఉండడం సాధ్యం కాదు. ఆ సమయంలో మీరు ఎంత కావాలని కోరుకున్నా.. మీ భాగస్వామి దూరంగా ఉంటే మీరు ఏమిచేయలేరు. అయితే ఈ సమస్యకు తాత్కలికంగా పరిష్కారం చూపేది సెక్స్‌టింగ్. ఇది మీకు, మీ భాగస్వామికి మధ్య సంభాషణలను కాస్త రసవత్తరంగా సాగేలా చేస్తుంది. ప్రస్తుత కాలంలో సెక్స్‌టింగ్ చేయడానికి వివిధ ప్లాట్​ఫారమ్​లు ఉన్నాయి. మీరు పంపే మెసేజ్​లతో మీ భాగస్వామి మిమ్మల్ని మరింత కోరుకునేలా చేయవచ్చు. అయితే ఈ సెక్స్‌టింగ్ చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు కచ్చితంగా గుర్తించుకోవాలి. అవి ఏంటంటే..

చేయవలసినవి..

* మీ చాట్‌లను భద్రంగా ఉంచుకోండి. అంటే మీ చాట్‌లు లేదా ఫోన్ పాస్‌వర్డ్ మీకు తప్పా ఎవరికీ తెలియకుండా చూసుకోండి. ఎందుకంటే మీ ఫోన్ మీ పేరెంట్స్ లేదా.. మరెవరైనా చూస్తే.. మీకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడదు. ఇలా చేయడం వల్ల ఇతర వ్యక్తులు కూడా.. మీ టెక్స్ట్‌లను దుర్వినియోగం చేయడం.. మిమ్మల్ని బెదిరించడం లాంటివి చేయరు. కాబట్టి మీ భాగస్వామి వాటిని చూసిన తర్వాత వాటిని వెంటనే తొలగించే ఆప్షన్ ఎంచుకోవాలి.

* మీ కోసం పరిమితులను సెట్ చేసుకోండి. సెక్స్‌టింగ్ అనేది ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంటే.. వారిలో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఇలా చేయడం వల్ల మీరిద్దరూ ఒకరినొకరు కోరుకుంటారు. అయితే ఈ సమయంలోనే మీరు చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. ఆ సమయంలో మీరు మీ న్యూడ్స్ పంపిస్తే మీరు చిక్కుల్లో పడిపోతారు. కాబట్టి వాటిని నివారించడానికి పరిమితులను సెట్ చేసుకోండి. వాటికి ఇద్దరు కట్టుబడేలా ఉండండి. మీకు సౌకర్యంగా లేకుంటే వారితో మాట్లాడి సున్నితంగా తిరస్కరించండి. అంతేకాకుండా మీరు సెక్స్టింగ్ చేసే వ్యక్తి.. నిజంగా విశ్వసించగల వ్యక్తేనా? కాదో నిర్ధారించుకోండి. కొన్నిసార్లు తిరస్కరించడం కష్టంగా ఉండవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ న్యూడ్ చిత్రాలు లీక్ కాకుండా చూసుకోండి. లేదంటే.. దాని వల్ల కలిగే పరిణామాలను ఎదుర్కోవడం చాలా కష్టం.

* ఒకరికొకరు చిత్రాలను మార్పిడి చేసుకున్నప్పుడు.. మంచి లైటింగ్, మీకు కంఫర్ట్​గా ఉంటే సెక్సీ ఫోజ్లో.. ఉండే ఫోటోలు పంపుకోవచ్చు. ఇవి మీ పార్టనర్​ మూడ్​ని పెంచుతాయి. అంతేకాకుండా కనిపించి, కనిపించకుండా పంపడం వల్ల మీ భాగస్వామికి మీరు మరింత ఎక్కువ కావాలనే కోరిక కలిగిస్తుంది.

* ఇతరులతో మీరు సెక్స్‌టింగ్ చేయాలని డిసైడ్ చేసుకున్నప్పుడు.. వారి గురించి కాస్తైనా తెలుసుకోండి. ఎవరైనా బయటి, తెలియని వ్యక్తులతో చాట్ చేస్తున్నప్పుడు వారిగురించి మీకు కనీస అవగాహన ఉండేలా చూసుకోండి. మీ భాగస్వామి ఫాంటసీలను గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వారు ఇష్టపడేవి మీరు చేయడం వల్ల వారు మిమ్మల్ని అభినందిస్తారు.

చేయకూడనివి

* సెక్స్‌టింగ్ చాలా ఉత్తేజకరమైనది. అయితే అవతలి వ్యక్తి సంభాషణతో పూర్తిగా సుఖంగా ఉండకపోవచ్చు. ఆ సమయంలో మీ భాగస్వామి మీ స్థాయిలోనే ఉన్నారని నిర్ధారించుకోండి. వారికి అసౌకర్యంగా అనిపించినప్పుడల్లా.. మాట్లాడమని చెప్పండి. భాగస్వాములిద్దరూ సమానంగా ఎఫర్ట్స్ పెడితేనే సెక్స్టింగ్ సరదాగా ఉంటుంది.

* డ్రింక్ చేసి.. మీ భాగస్వామితో సెక్స్‌టింగ్ చేయకండి. మీకు డ్రింక్ ఎక్కువైతే.. మీరు మీ ఫోన్ ఎక్కడైనా వదిలేయవచ్చు. దానిని ఎవరైనా మిస్ యూజ్ చేయవచ్చు. అది మీకు, మీ పార్ట్​నర్ ఇద్దరికి మంచిది కాదు. కాబట్టి మీరు సురక్షితంగా ఉన్నారు అనుకున్నప్పుడే చాట్ చేయండి.

* మీరు సెక్స్‌టింగ్ చేస్తున్న వ్యక్తిని మీరు కలిసినప్పడు ఈ విషయం కచ్చితంగా గుర్తించుకోండి. మొదటి డేట్​లోనే వారికి మీరు ఎంత ఎట్రాక్ట్ అయినా.. వారి గురించి ఇంకా తెలుసుకోవడానికి సమయం తీసుకోండి. సరైన సంభాషణ వారి ఆసక్తిని ఎక్కువసేపు ఉంచుతుంది. తద్వారా వారు మీతో మరింత కనెక్ట్ అవుతారు.

* సెక్స్‌టింగ్ అనేది ఒక మంచి ఫ్లోలో జరగాలి. కాబట్టి ఆలస్యంగా లేదా ఏదైనా పనిలో బిజీగా ఉన్నప్పుడు కాకుండా ఇద్దరికి కుదిరిన సమయంలో చాట్ చేసుకునేలా చూసుకోవాలి. మీరు ఆలస్యంగా రిప్లై ఇస్తూ ఉంటే.. అవతలి వ్యక్తి తమ కోరికలను అణచివేసుకునే అవకాశముంది.

సెక్స్‌టింగ్ మీకు అసౌకర్యంగా ఉంటే అది తప్పేమి కాదు. మీరు డైరక్ట్​గా వారికి మీ పరిస్థితి గురించి చెప్పేయండి. మీ భాగస్వామి కోరికలను తీర్చడానికి మీరు ఎప్పుడూ ఒత్తిడికి గురికాకూడదు. లేదా వారికోసం మీరు సఫర్ అవుతూ.. చాట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు సంతోషాన్ని కలిగించే వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. సెక్స్‌టింగ్‌కు మించిన శృంగారం మరింత సరదాగా కాకపోయినా సమానంగా ఉంటుంది.

Whats_app_banner