Weightloss Tips: బరువు తగ్గడానికి సింపుల్ ఫార్మూలా ఇదే, ఇలా నెల రోజులు చేయండి చాలు మూడు కిలోలు తగ్గిపోతారు-this is the simple formula to lose weight do this for a month and you will lose three kilos ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weightloss Tips: బరువు తగ్గడానికి సింపుల్ ఫార్మూలా ఇదే, ఇలా నెల రోజులు చేయండి చాలు మూడు కిలోలు తగ్గిపోతారు

Weightloss Tips: బరువు తగ్గడానికి సింపుల్ ఫార్మూలా ఇదే, ఇలా నెల రోజులు చేయండి చాలు మూడు కిలోలు తగ్గిపోతారు

Haritha Chappa HT Telugu
Nov 14, 2024 02:00 PM IST

Weightloss Tips: పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి ప్రజలు రకరకాలుగా కష్టపడుతుంటారు. అయితే బరువు తగ్గడానికి బెస్ట్ ఫార్ములా ఏమిటో తెలుసా? తక్కువ తిని, ఎక్కువ కష్టపడడమే. ఇలా చేస్తే బరువు త్వరగా తగ్గుతారు.

త్వరగా బరువు తగ్గేందుకు సింపుల్ చిట్కాలు
త్వరగా బరువు తగ్గేందుకు సింపుల్ చిట్కాలు

ఊబకాయం ప్రపంచంలో పెద్ద సమస్యగా మారింది. అధిక బరువు అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. అందుకే బరువు తగ్గేందుకు ఎంతో మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఆహారం పుష్టిగా తీసుకోవడం, శారీరక శ్రమ తక్కువగా ఉండటం వల్ల నేడు పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి శరీరంలో కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకున్నా ఎంతో మంది మంచి ఫలితాన్ని పొందలేరు. అటువంటి పరిస్థితిలో, మీరు బరువు పెరగడానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అలాగే బరువు తగ్గేందుకు సింపుల్ చిట్కాలను తెలుసుకోవాలి.

బరువు తగ్గించే సింపుల్ చిట్కా

బరువు తగ్గడమంటే శరీరంలో కొవ్వు కరిగించడమే. అలా కొవ్వు కరగాలంటే మీరు చేయాల్సిన ముఖ్య పని తక్కువ తినాలి. తక్కువ తిని ఎక్కువ శారీరక శ్రమ చేయడం వల్ల బరువు సులువుగా తగ్గుతారు. తక్కువ తిని ఎక్కువ నడవడం వల్ల బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంది. ఎనర్జీ బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గవచ్చు. తక్కువ ఆహారాన్ని తిని రోజంతా ఎక్కువ కష్టపడుతుంటే మీరు మెరుపుతీగలా మారిపోతారు. ఆ తక్కువ ఆహారంలో పోషకాలు నిండిన పండ్లు, నట్స్ వంటివి ఉండేలా చూసుకోండి. లేకుంటే పోషకాహార లోపం ఏర్పడే అవకాశం ఉంది.

బరువు ఎందుకు పెరుగుతాము?

బరువు తగ్గడం గురించి తెలుసుకునే ముందు బరువు ఎందుకు పెరుగుతారో తెలుసుకోవాలి. ఏ ద్రవ్యరాశి అయినా పెరగడానికి లేదా తగ్గడానికి శక్తి అవసరం. మనం జీవించాలంటే శక్తి అవసరం, అది ఆహారం నుంచి లభిస్తుంది. మన శరీరంలో 37 ట్రిలియన్ కణాలు ఉన్నాయి. ప్రతి ఒక్క కణం శక్తిని ఉత్పత్తి చేస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీరు శరీరానికి ఎక్కువ శక్తిని ఇచ్చినప్పుడు, దాన్ని శరీరం ఉపయోగించుకోలేకపోతుంది. అప్పుడు అది శరీరంలో ఎక్కడో దగ్గర నిల్వ అవుతుంది. దీన్ని నిల్వలు పెరిగి బరువు పెరుగుతారు. సింపుల్ గా చెప్పాలంటే ఎక్కువ తింటే ఎక్కువ బరువు పెరుగుతారు.

ఎక్కువ తిని, తక్కువ ఎనర్జీని వాడితే బరువు పెరుగుతారని పోషకాహార నిపుణులు చెబుతారు. అదే పద్ధతిలో తక్కువ తినడం, ఎక్కువ ఎనర్జీని ఉపయోగించడం వల్ల బరువు తగ్గుతారు. మీరు తిన్న ఆహారానికి తగ్గట్టు శక్తిని కూడా వినియోగించాలి. బరువు తగ్గడానికి కేలరీలు తక్కువగా ఉండటం అవసరమని గుర్తుంచుకోండి.

బరువు తగ్గడానికి ఉత్తమ వ్యాయామాలు

మీరు వ్యాయామం చేసేటప్పుడు, తక్కువ తింటారు. వ్యాయామం చేసిన తర్వాత నూనెలో వేయించిన ఆహారం తినాలని అనిపించదని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. వ్యాయామం చేయడం వల్ల, తక్కువ తినడం వల్ల బరువు కచ్చితంగా తగ్గుతారు. నడక ద్వారా కూడా బరువును తగ్గించవచ్చు. అదే సమయంలో వారానికి 4 రోజులు 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం మంచిది. రెండు రోజుల కార్డియో, రెండు రోజుల స్ట్రెంత్ ట్రైనింగ్ చేయండి. బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

Whats_app_banner